Saturday, May 3, 2014

నీ సమయాన్ని నేను కొనగలనా?

నీ సమయాన్ని నేను కొనగలనా?
ఒక వ్యక్తి చాల ఆలస్యం గా ఇంటికి వచ్చాడు. గుమ్మం ముందు తన కోసం ఎదురు చూస్తున్న తన కుమారుడిని చూసాడు.
కొడుకు: నాన్న నేను నిన్ను ఒక ప్రశ్న అడగొచ్చా?
తండ్రి: హ తప్పకుండ అడుగు..
కొడుకు: నాన్న నువ్వు గంటకి ఎంత సంపాదిస్తా
వ్?
తండ్రి: అది నీకు అనవసరమైనది. అయిన నీకు ఎందుకు?
కొడుకు: నాకు తెలుసుకోవాలని ఉంది , దయచేసి చెప్పండి నాన్న, నువ్వు గంటకి ఎంత సంపాదిస్తావ్?
తండ్రి: సరే, నేను గంటకి 1000 రూపాయలు సంపాదిస్తాను.
కొడుకు: అవునా, అని తన తలదించుకొని , నాన్న నాకు 500 ఇస్తావా?
తండ్రి: కోపంతో నీకు ఎందుకు అంత డబ్బు... నీకు కావాల్సిన ఆట బొమ్మలు, నీకు ఏది కావాలంటే అన్ని తెచ్చాను గా! ఇంకా ఏంటి ? నోరుముస్కోని నీ గదిలోకి వెళ్లి పడుకో.
ఆ పిల్లాడు బాధతో తన గదిలోకి వెళ్లి పడుకున్నాడు.
ఆ తండ్రి కాసేపు కూర్చొని, ఇంకా కోపంతో ఎందుకు నా కొడుకు ఇలాంటి ప్రశ్నలు అడుగుతున్నాడు. అయిన వాడికి ఎంత దైర్యం నన్నే డబ్బు అడుగుతున్నాడు అది 500 రూపాయలు.

ఒక గంట తర్వాత ఆ వ్యక్తి కొంచెం శాంత పడి , ఆలోచించటం మొదలెట్టాడు...
వాడికి బాగా అవసరమైతేనే ఇంత డబ్బు అడుగుతాడు. లేకపోతె అడిగేవాడు కాదు కదా.. అయిన నేను సంపాదిస్తుంది వాడి కోసమే కదా... ఛ అనవసరం గా నా పనిలోని కోపం అంతా వాడి మీద చూపించాను.
అని వాడి గదిలోకి వెళ్లి ,
తండ్రి: నిద్రపోతున్నావా నాన్నా!!!
కొడుకు: లేదు నాన్న మేలుకువతోనే ఉన్న.
తండ్రి: నన్ను క్షమించు రా నా పని లో కోపాన్ని నీ మీద చూపించ.. ఇదుగో నువ్వు అడిగిన 500 తీసుకో...
కొడుకు: ఆనందంతో, థాంక్స్ నాన్న..
అని తన దిండు కింద నలిగిపోయిన డబ్బులుని తీసి లేక్కపెడుతున్నాడు.
తన దగ్గర డబ్బులుండి కూడా అడిగిన తన కుమారుడి ఇంకా కోపం వచ్చి...
తండ్రి: అయిన నీ దగ్గర డబ్బు ఉండి కూడా నను ఎందుకు అడిగావు???
కొడుకు: నాన్న ఇప్పుడు నా దగ్గర మొత్తం 1000 రూపాయలు ఉన్నాయి. ఇప్పుడు " నేను నీ గంట సమయాన్ని కొనగలనా! దయచేసి మీరు రేపు కొంచెం తొందరగా వస్తే నేను మీతో భోజనం చేద్దాం అనుకుంటున్నా....
వెంటనే తండ్రి కొడుకుని తన చేతులతో కొడుకుని హత్తుకొని,
తండ్రి: నన్నూ క్షమించురా!! నేను ఇంకా ఎప్పుడు ఇలా చేయను...

అప్పటి నుండి తన కొడుకుతో కొద్ది సమయం గడుపుతూ ఉన్నాడు
ప్రియ మిత్రులారా, మీలో ఎంత మంది మీ కొడుకులతో సమయం గడుపుతున్నారు???

Thursday, May 1, 2014

ప్రార్థించే పెదవుల కన్నా, సాయం చే సే చేతులు మిన్న

ప్రార్థించే పెదవుల కన్నా, సాయం చే సే చేతులు మిన్న
చాలా మంది మనుషులకి అనిపిస్తుంది, ఎంత ప్రార్థించినా కష్టాలు తీరట్లేదు, భగవంతుని కృప లేదు అని. శ్రీ రామాయణంలో ఒక కధ చదివితే అర్థమౌతుంది.
విభీషణుడు ఒక రోజు హనుమంతునితో ఇలా అన్నారు. 'హనుమాన్ నీవు కోతివి అయినా కూడా, నీ మీద భగవంతుని కృప ఉంది, నేను ఎంత రాముడి ధ్యానంలో ఉన్నా, ఆ కృప నాకు రాలేదు'.
అప్పుడు హనుమంతులవారు ఇలా అన్నారు, విభీషణా! మీరు నిజంగానే, శ
్రీరాముడి ధ్యానంలో ఉన్నారు, కానీ, శ్రీ రాముని కార్యంలో ఎంత పాల్గొన్నారు? కేవలం, శ్రీరాముని నామం ధ్యానం చెయ్యటం వల్ల, కృప రాదు. మీ అన్న రావణుడు,సీతమ్మవారిని, తీసుకుని వచ్చినప్పుడు, సీతాదేవికి ఏమి సహాయము చేశారు. కొంచెమైనా, శ్రీరాముని బాధ తగ్గించే ప్రయత్నం చేసేరా....
నీతి :
కేవలం భగవంతుని మీద, గురువు మీద, భక్తి, ప్రేమ ఉంటే సరిపోదు. వారు నేర్పించినవి, సాధనలో పెట్టాలి. వాటిలో ఒక మార్గం, మనుషులని ప్రేమించటం, సేవ చెయ్యటం.

చివరి బంధం

ఒక సామాన్య రైతు కుటుంబం లో పుట్టిన ఒక రైతు తన కొడుకుని ఒక గొప్ప వ్యక్తి గా చూడాలి అనుకున్నాడు..!! రేయి అనక, పగలు అనక కష్టపడి చదివించాడు..!! నాన్న నెను చదవటానికి పుస్తకం లేదు..!! కొనడానికి డబ్బులు లేవు అని అడిగితే ఆ తండ్రి కష్టపడి చేస్తున్న వ్యవసాయం తో పాటు ఒక చిన్న ఉద్యోగం లో చేరి తన కొడుక్కి కావల్సిన ప్రతీది ఇస్తూ, సౌకర్యం గా పెంచాడు..!!
'కొన్ని సంవత్సరాలు తరువాత ఆ కొడుకు ఒక గొప్ప వ్యక్తి గా ఎదిగ
ాడు..!! ఒక పెద్ద ఇంజినీర్ అయ్యాడు.. అంచలు అంచలు గా ఎదిగి ఒక కంపెనీ స్థాపించాడు..!! ఇంత స్థాయి కి తన కొడుకుని తీసుకు రావడానికి ఒక కిడ్నీ తో పాటు తన తండ్రి కి అయిన ఖర్చు "సుఖం లేని జీవితం, నిద్ర మరచిన రాత్రులు, అలుపు ఎరుగని కష్టం
అసలు కష్టమే లేని జీవితం చుస్తున్నాడు కొడుకు..!! తన చదువు కోసం కిడ్నీ అమ్మి చదివించిన తన తండ్రి అంటే ఆ కొడుకుకి ప్రాణం..!! తన తండ్రి ని ఎంతో ప్రేమ గా చూసుకుంటున్నాడు..!! వయసు పైబడింది..!! తండ్రి ఆరోగ్యం క్షీనించింది..!! 6 సంవత్సరాల బబు కి 60 సంవత్సరాల వృద్ధుడికి తేడా వుండదు అంటారు..!! ఎందుకో తెలుసా?? వాళ్ళ ఇద్దరికి కూడా ఒకరి సహకారం కావాలి..!! కాని అదే కొడుకు తనకి నడక నేర్పిన తండ్రి చివరి రోజుల్లో నడవలేక అవస్త పడుతుంటే గాలికి వదిలేసాడు..!!
తన మీద తన కొడుకుకి ప్రేమ ఎందుకు కరువు అయ్యింది అని ఆ తండ్రి బాధపడని రోజు లేదు..!! తాగి ఇంటికి వచ్చే వాడు..!! చివరి రోజుల్లో చెడిపోతున్న కొడుకుని చూసి ఏడవని రోజు లేదు ఆ తండ్రికి..!!
చివరికి ఒక రొజు ఆ కొడుకు తన తండ్రి ని ఎంత వద్దు అని మొత్తుకుంటున్నా బలవంతం గా తీసుకుని వెళ్ళి ఒక వృద్ధాశ్రమం లో చేర్చాడు..!! కాలం గడిచింది, 6 నెలలు గడిచిన కూడా తన కొడుకు నుండి ఒక్క ఫోన్ రాలేదు...!! ఇప్పటికి ఆ కొడుకు తనకి ఇస్తున్న విలువకి ఒక పక్క బాధపడుతూనే ఇంకొకపక్క ఆ కొడుకు కోసం తను పడిన కష్టాన్ని తలుచుకుంటూ గర్వ పడుతున్నాడు..!! వున్నట్టు ఉండి ఒక ఫోన్ కాల్, దగ్గరలో వున్న హాస్పిటల్ లో ప్రానాపాయ స్తితి లో తన కొడుకు వున్నాడు అని..!! తనని ఏ మాత్రం పట్టించుకోని తన కొడుకు చావు బ్రతుకుల్లో వున్నాడని తెలిసిన ఆ తండ్రి పరుగు పరుగున వెళ్ళి తన కొడుకుని కలుసుకున్నాడు..!!
అప్పుడు ఆ కొడుకు తన తండ్రి తో పలికిన మాటలు..!!
"నేను చచ్చిపోతున్నాను నాన్న..!! పుట్టిన ప్రతి వ్యక్తి ఒక రోజు చనిపొతాడు కాని ఎప్పుడు చనిపోతాడు అనేది ఎవరికి తెలీదు..!! కాని నాకు దేవుడు ఆ అవకాశం ఇచ్చాడు.. నేను చనిపోతాను అని నాకు 1 సంవత్సరం ముందె తెలుసు నాన్న..!! అందుకే మిమ్మల్ని దూరం గా వుంచాను..!! నా మీద అసహ్యం పుడితే నేను చనిపోయిన రోజు నన్ను చూసి నువ్వు ఏడవకుండా వుంటావు అని..!! కాని నా చివరి శ్వాస నీ వడిలో పడుకుని వదలాలి అని వుంది నాన్న..!! నా చావు కన్నా ముందు నేను చుపించిన ద్వేషానికి పశ్చ్యాతాపం గా నీ వడిలో నా శ్వాస వదలాలి అని వుంది నాన్న...!! " అంటూ తన తండ్రి వడిలోనే ప్రానాలు విడిచాడు.. !!
చనిపోయిన కొడుకుని చూస్తు "పిచ్చోడా!! నువ్వు నన్ను ద్వేషిస్తే నీ మీద అసహ్యం పెంచుకోడానికి నువ్వు నా శత్రువు కాదు నాన.!!. నా కొడుకువి..!! " అని బరువెక్కిన గుండెతో పలికిన మాటలు ఇంకా నా చెవిలో మారుమ్రోగుతున్నాయి...!!
కొడుకు చనిపోయిన తరువాత ఎంతో మంది అనాధలను దత్తతు తీసుకుని వాళ్ళని పెంచి పోషిస్తూ, చదివిస్తూ ఆ తండ్రి కూడా ఒక రోజు ప్రాణం విడిచాడు.....!!
ఇదే సమాజం లో రోడ్ మీద పడి వున్న కొంత మంది పిల్లల్ని దత్తతు తీసుకుని వాళ్ళని చదివిస్తున్న గొప్ప వాళ్ళు వున్నారు... వాళ్ళకి ప్రేమ విలువ తెలీదా?? లేక అసలు వాళ్ళలో ప్రేమ లేదు అంటారా??
ప్రతీ బంధాన్ని చివరి బంధం గా భావించు.. అప్పుడే నీకు ప్రేమించడం తెలుస్తుంది...
ప్రతీ క్షణాన్ని చివరి క్షణం గా భావించు.. అప్పుడే నీకు ప్రేమ విలువ, మనిషి విలువ, కాలం విలువ ఏంటో తెలుస్తుంది..

TAKE CARE OF MY EYES

అనగనగా ఒక గుడ్డి అమ్మయి,
తనకీ తను తన బాయ్ ప్రెండ్ తప్ప ఈ ప్రపంచంలో ఎవరూ ఇష్టంలేదు,
ఒక రోజు తన బాయ్ ప్రెండ్ తో మాట్లాడుతు నాకు కళ్లు వచ్చిన వెంటనే నిన్నుపెళ్లి చేసుకుంటా అని చేపింది,
అలా చెప్పిన కోన్ని రోజులకు తనకు కళ్లు ఎవరొ డోనేట్ చెసారు,తనకు కళ్లువచ్చిన ఆనందంలో తన బాయ్ ప్రెండ్ దగ్గరకు వెళ్ళింది.అక్కడ తను ఆశ్చర్యపోంది తన బాయ్ ప్రెండ్ కూడా గుడ్డివాడు.
అప్పుడు తన బాయ్ ప్రెండ్ అడిగాడు నికు కళ్లు
వచ్చాయి కాదా మనం పెళ్లిచెసుకుందామా అన్నడు. కోంతసెపు అమ్మాయి ఆలోచించి ఇబ్బంది గానే చెపింది నేను నీను పెళ్లి చెసుకోలేనుఅని .
అ అబ్బాయి ఎమి మాట్లాడలేక పొయడు. కొంతసేపు అలొచించి ఏమి మాట్లాడకుండా వెళ్లిపోతూ ఇలా అన్నడు
~~~TAKE CARE OF MY EYES~~~

దేవుడు ఎప్పుడు సహాయం చేస్తాడు ?


Wednesday, April 16, 2014

The lessons we have to learn from this story:

అవినాష్ ఒక సాఫ్ట్ వేర్ ఇంజనీర్... చీకు చింతా లేని జీవితం... తను కోరిన విధంగా జీవితం చాల సంతోషంగా గడుపసాగాడు.. వారిది ప్రేమ వివాహం.. భార్య కూడా చాల అణకువ కలిగినది.... వారిది మంచి అన్యోన్య దాంపత్యం.. జీవన క్రమంలో ... అవినాష్ తండ్రి అయ్యాడు.. బాబు(విక్రం) కు 5 సంవత్సరాలు వస్తాయి... అవినాష్ కొత్తగా ఆడి కారును కొంటాడు... అది అతనికి కలల స్వప్నం... చాల రోజులకు అతని కోరిక నెరవేరింది.... ఆ కారు అంటే అవినాష్ కు చాలా చాలా ఇష్టం..... ప్రతి ఆదివారం తన కొత్త ఆడి కారు ను ఎంతో ఇష్టంగా శుభ్రం చేసుకోవడం అలవాటు... ఆ రోజు కూడా దానిని శుభ్రం చేసే సమయంలో .... అతని కుమారుడు విక్రం అక్కడికి వచ్చి ఒక రాయిని తీసుకుని కారు మీద ఏమో చెక్క సాగాడు... ఆ చప్పుడుకు అవినాష్ ఏమి జరుగుతుందో గమనించీ గమనించగానే... తట్టుకోలేనంత కోపం వస్తుంది... ఆ కోపం తనను తానూ మర్చిపోతాడు... ఒక రేంచి తీసుకుని ఇష్టం వచ్చినట్లు ఆ చిన్నారి చేతుల మీద కొడతాడు... మనిషి ఎంత మంచి వాడయిన ఒక దాని మీద ఇష్టం...మన కోపం ఒక్కొక్కసారి మనని ఉన్మాదిగా మారుస్తుంది... ఆ స్థితిలో అవినాష్ ఉన్మాదిగా మారాడు.. ఎదుట ఉన్నది తన చిన్నారి ముద్దుల కొడుకని కూడా మర్చిపోయాడు.... కొన్ని క్షణాల తర్వాత అర్ధం అయింది తానూ ఏం చేసాడో.. ...కానీ అప్పటికే ఆలస్యమయింది... వెంటనే బాబును తీసుకుని ఆసుపత్రికి పరిగెడతాడు... ఆసుపత్రిలో అన్ని పరీక్షల తర్వాత తెలుస్తుంది.. ఎముకలన్నీ తిరిగి అతుక్కోలేనంత నుజ్జు నుజ్జు అయ్యాయని... బాబు చెయ్యి మామూలు స్థితికి తిరిగి రాదని.... కన్నీరు మున్నీరయిన క్షణంలో .. బాబు అడుగుతాడు.. నాన్నా.. నా చేతులు తిరిగి రావా.... పరవాలేదులే బాధ పడకు.. ఇంకెప్పుడూ అలా చేయను.. అని దీనంగా అంటాడు... అవినాశ్ కు కన్నీటిని ఆపడానికి కాలేదు... తన చేసిన తప్పుకు ప్రాయశ్చిత్తంగా ఆ కారును నాశనం చేయాలనీ, చేద్దామని.. కారు దగ్గరకు వెళతాడు.. అప్పటి వరకూ తన కొడుకు కారు మీద ఏమి చెక్కాడు అనేది కనీసం చూడను కూడా చూడలేదు... ఇంతకూ ఆ కారు మీద బాబు ఏం చెక్కాడో తెలుసా... ఐ లవ్ యు డాడ్ .... అవినాశ్ తన మూర్ఖత్వానికి తన మీద తనకే అసహ్యం వేస్తుంది... కానీ ఏమి చేస్తే ఆ చిన్నారిని బాగు చేయగలడు... చేసిన తప్పు తిరిగి దిద్దుకోగాలడా.... ఎంత డబ్బు ఉంటే ప్రయోజనమేముంది... చితికేడంతావివేకం ఉండాలి... వస్తువులపై వ్యామోహం ఉండకూడదు...

The lessons we have to learn from this story:
మనలో చాలా మందికి వస్తువుల మీద వ్యామోహం ఉంటుంది... కానీ అది మనుష్యుల కంటే ఎక్కువ కాకూడదు.. దేవుడు వస్తువులను వాడుకోవడానికి .. మనుష్యులను ప్రేమించడానికి సృష్టించాడు.. మనమే వస్తువులను ప్రేమిస్తూ.. మనుష్యులను వాడుకుంటూ లేని సమస్యలను సృష్టించుకుంటున్నాం.

Wednesday, April 9, 2014

తల్లితండ్రులని గౌరవించండి.

ఒక యువకుడు రెండు ఎత్తైన కొండల మధ్య ఫీట్స్ చేస్తున్నాడు ..
ఒక కొండ మీద నుండి ఇంకొక కొండ పైకి ఒక ఇనుప తీగ కట్టి ప్రజలందరూ చూస్తుండగా ఒక కర్ర ఆధారంగా తీగపై ఒక వైపు నుండి మరొక వైపుకు నడిచాడు
అక్కడున్న ప్రజలందరూ చప్పట్లు కొట్టారు ..
తర్వాత ఒక చక్రం ఉండే తోపుడు బండి తీస్కుని ఒక వైపు నుండి మరొక వైపుకి నడిచాడు ..
చూస్తున్న వారందరూ మరల కరతాళ ద్వనులు చేసారు,
తర్వతా ఆ యువకునితో కొంత మంది ఇలా అంటారు ..
ప్రాణం లేని బండి, కర్ర తో నడవడం కాదు ఒక మనిషిని ఆ బండి లో కూర్చో పెట్టుకుని తీగపై నడువు అప్పుడు నీవు గోప్పవాడివని నమ్ముతాం అంటారు ..
అప్పుడా యువకుడు "ఎవరైనా వచ్చి ఈ బండి లో కూర్చుంటే అలాగే చేస్తాను" ఎవరైనా ఉన్నారా అని అడుగుతాడు ..
అప్పుడు ఎవరు ముందుకు రారు, కాసేపటి తర్వాత ఒక ముసలి అతను వచ్చి బండి లో కూర్చుంటాడు ..
అక్కడున్న వారు ఎం తాత బ్రతుకు మీద ఆశ చచ్చి పోయిందా ఈ విధంగా ఫేమస్ అవ్వాలనుకుంటున్నావా, ఇంటి దగ్గర చెప్పి వచ్చావ" అని ఎగతాళి చేస్తారు ..
ఆ యువకుడు బండిలో ముసలి వ్యక్తిని కూర్చో పెట్టుకుని ఇవతలి నుండి అవతలికి సునాయాసంగా నడుస్తాడు.
అక్కడున్న కొందరు వచ్చి " ఎం తాత ఏ నమ్మకం తోటి ఆ అబ్బాయి మాటలు విని ఇంత పనికి తెగించావు " అని అడుగుతారు..??
ఎందుకంటే వాడు నా కొడుకు " అని అతను సమాధానం చెప్తాడు ..
ఫ్రెండ్స్.. ఈ ప్రపంచం మిమ్మల్ని నమ్మిన నమ్మకపోయినా మీ తల్లితండ్రులు మిమ్మల్ని నమ్ముతారు..
మీ ఔన్నత్యం కోసం ఎంత త్యాగానికైనా సిద్ద పడతారు....
అవమానాలని కూడా భరిస్తారు...
మీ తల్లి తండ్రులు మీమీద పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ముచేయకండి. తల్లితండ్రులని గౌరవించండి.