Thursday, December 11, 2014

॥ పవిత్ర బంధానికి / పండంటి కాపురానికి - పన్నెండు సూత్రాలు॥

శ్రీరస్తూ శుభమస్తూ !!!
ఒకప్పుడు arranged marriages ఎక్కువగా ఉండేవి. ఇప్పుడు ప్రేమ పెళ్ళిళ్ళు ఎక్కువ అవుతున్నాయి. పెళ్ళికి ముందు అబ్బాయి అయినా అమ్మాయి అయినా ఒకలా జీవిస్తారు. ఎలా నడుచుకున్నా తల్లిదండ్రులు భరిస్తారు, బుజ్జగించుకుంటారు, భయపెడతారు, నాలుగు తిట్లు తిట్టి మన ఆలోచనలతో పాటు మనల్నీ సరైన దారిలో పెడతారు. అదే భావం మన తోడబుట్టిన వాళ్ళతో ఉండదు. వారితో మనం ప్రేమగా ఉన్నా, కీచులాటలు, పోట్లాటలు, అసూయలు అవ్వి కూడా చాలానే ఉంటూ ఉంటాయి. కొన్ని కుటుంబాలలో ఎక్కువ, మరి కొందరి విషయాల్లో తక్కువ. ఇక్కడ ఈ వ్యత్యాసం మన age difference వల్ల వస్తుంది. అమ్మ నాన్న అంటే గౌరవం ప్లస్ ఒక జనరేషన్ ముందు వారు కాబట్టి, ప్లస్ మనకి నమ్మకం... వారు మన మంచికే చెబుతారు అని. వినడం వినకపోవడం మన మీదనే ఆధార పడి వుంటుంది. అదే మన తోబోట్టువు అయితే? ఇంచు మించు ఒకే వయసు కాబట్టి ప్రేమ ఆప్యాయతలతో బాటు ఈర్హ్స్యా అసూయలు, చిన్ని చిన్ని గిల్లికజ్జాలు, పోట్లాటలు, ఒకొర్నకరు పోల్చుకోడాలు సహజం.
ఇప్పుడు అసలు topicకి వద్దాం. పెళ్లి అయ్యాక జంటల పరిస్థితి ఎలా ఉంటుందో. ఇక్కడ కూడా భార్యా భర్తలిద్దరూ ఇంచుమించు ఒక వయసు పరిధిలోని వారే. సో మన తోబోట్టువులతో ఉండే problems ఇక్కడా ఉంటాయి. ఇక పోతే major difference ఎక్కడా అంటే, వారిద్దరి పెంపకం, ఇంట్లో అలవాట్లు, పెరిగిన వాతావరణం, చుట్టూ ఉన్న ఆత్మీయుల, బంధువుల ఆచార వ్యవహారాలూ, వారితో అనుబంధాలు, etc. మరి అలాంటప్పుడు భార్య భర్తలిద్దరి బంధం అన్ని బంధాల కంటే కూడా చాలా సెన్సిటివ్ అంటే సుకుమారమైనది అని గ్రహించాలి. Completely ఒక వేరే గ్రహం నుండి ఇంకో గ్రహానికి వచ్చినట్టు భావించాలి. ఇది ప్రేమించి పెళ్లి చేసుకున్నా వర్తిస్తుంది, పెద్దలు కుదిర్చిన పెళ్లికైనా వర్తిస్తుంది. మనం ఒకరి ఆలోచనలను, వ్యక్తిత్వాన్ని అలవాట్లను గౌరవించనపుడు ఇబ్బందులు మొదలవుతాయి. పెళ్లి అయిన వెంటనే తల్లిదండ్రుల ప్రమేయాలు, పెళ్ళిలో ఆచరించలేదని చెప్పే ఏవో సాకులు, మా అమ్మాయో అబ్బాయో తన భార్య లేక భర్తకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారనే insecured feeling వల్లనో బేధాభిప్రాయాలు తప్పకుండా వస్తాయి. అక్కడే అసలైన చిక్కు. ఇవన్ని చినికి చినికి గాలి వానయ్యి చివరికి పోట్లాటలకి దారి తీస్తాయి. ఇక అక్కడి నుండి మొదలండి అహంభావం, ఆత్మనూన్యత , అబద్రతాభావం, అపార్ధాలు, miscommunication, etc, etc
ఇలాంటివి మొదటి సారి అనుభవంలోకి వస్తాయి కాబట్టి ఒకోసారి ఎలా స్పందించాలో తెలియక, మన మిడిమిడి జ్ఞానంతోనో, స్నేహితుల అనుభవాలతోనో, లేక వాళ్ళ కోణంలో నుండి చూసి ఆలోచించే మన తల్లిదండ్రులతోనో, తోబుట్టువులతోనో, చుట్టాలతోనో చర్చించి మనం స్పందిస్తాము. చాలా మట్టుకు ఇదే పధ్ధతి పాటిస్తారు కొత్త దంపతులంతా. అది సరైన పధ్ధతి కాదు. ఎందుకంటే వాళ్ళు ఎదుర్కొన్న సందర్భాలు వేరు, ఆలోచనలు, వ్యవహారాలూ అన్నీ వేరు. ప్రతి గుండెకి ఒక కథ ఉన్నట్టే, ప్రతి జంటకి ఒకో problem ఒకో విధంగా ఉంటుంది. అన్నిటికి ఒకే మంత్రం, ఒకే మందు అంటే ఎలా? రోగిని చూసి, రోగాన్ని పరికించి మందో మాకో, మంత్రమో తంత్రమో వెయ్యాలి. దంపతుల విషయంలోనూ అంతే. ఒకోజంటకి ఒకో పద్ధతి.
మొదటి సంవత్సరం చాలా కష్టపడాలి భార్యా భర్తలిద్దరూ. ఈ మొదటి సంవత్సరంలోనే ఉంటుంది అసలు మసాలా అంతా. అన్ని అడ్డంకులు ఎదుర్కొని, ఒకరినొకరు అర్ధం చేసుకోవడానికి సమయం ఇచ్చుకొని, ప్రతి సామరస్యంగా పరిష్కారాలు వెతుక్కొన్నాకనే, భవిష్యత్తులో అన్యోన్యతకి అంకురార్పణ అప్పుడు జరుగుతుంది. ఇప్పటి స్థితిని బట్టి ఏ నిర్ణయాలు తీసుకోవద్దు. మనం ఆలోచించాల్సింది ఒక్కటే. భార్యా భర్తలిద్దరూ ఎప్పటికీ అన్యోన్యంగా ఉండడం. అదే మన డెస్టినీ, మన గమ్యం. అందుకు అందరిని, అన్ని పరిస్థితులని ఎదుర్కోవాలి.
1. ముందు ఇద్దరు ఒక్కటి కాదు, వేరు వేరు అని గ్రహించాలి. ప్రేమతోనే ఒకరిని ఒకరు అన్ని విషయాలు అడిగి తెలుసుకోవాలి వాటిల్లో. ఎవరు ఏయే పనులు చూసుకోవాలి ఇంట్లో. ఇద్దరూ ఉద్యోగస్తులైతే, ఎవరు దేనికి ఖర్చు పెట్టాలి అని సీరియస్ గా కాదండోయ్.... నవ్వుతూ వర్క్ అండ్ మనీని విభజించుకోవాలి. మానవులం కదా, మతిమరుపు సహజం. సో డివిజన్ అఫ్ వర్క్ అండ్ మనీ రాసి పెట్టుకోవడం బెటర్.
2. తరువాత భార్యాభర్తలిద్దరూ సమానం అన్న విషయం గ్రహించాలి. భర్త మగవాడు, కాబట్టి తానే గొప్ప అనో. భార్య కట్నం తెచ్చింది, భర్త కంటే నాలుగాకులు ఎక్కువ చదివింది కాబట్టి తానే గొప్ప అనో అన్న అపోహలు మానుకోవాలి. ఎవరి జీతం ఎక్కువైతే ఏంటి? ఎవరి చదువు, అనుభవం ఎక్కువయితే ఏంటి? మనిషి మనిషికీ వ్యత్యాసం ఉండడం సహజం. మన అమ్మా నాన్న కాలం కాదు ఇది. మారుతున్న కాలాన్ని బట్టి మనం కూడా మారాలి. మన తోటి మానవులంతా సమానమే అన్న దృక్పథాన్ని అలవర్చుకొని నరనరాల్లో జీర్ణింపచేసుకోవాలి.
3. ఒకరినొకరు ముందు గౌరవించుకోవాలి. మీ భాగస్వామి ఇష్టాయిష్టాలని గౌరవించండి, వారి వృత్తిని గౌరవించండి. వారి తలిదండ్రులని, బంధువులని, స్నేహితులని గౌరవించండి. వారు ఇంటికొస్తే ఎందుకు వచ్చారురా బాబు అనుకోకుండా మీ వంతు సహాయం మీ భాగస్వామికి అందివ్వండి. మీ చుట్టాలుగా మీరిద్దరూ కలిసి ప్రవర్తించండి. వారిలో ఏ విషయమైనా నచ్చకపోతే, పోట్లాడకుండా ఇద్దరు చర్చించుకోండి. సమస్యకి పరిష్కారం ఆలోచించుకోండి.
4. ప్రతి ఒక్కరికి అలవాట్లు తప్పకుండా ఉంటాయి. మీ భాగస్వామి ఏదైనా చెబితే విసురుగా కాకుండా నమ్రతగా వినండి. మంచి అలవాట్లను కొత్తగా మనం పాటిస్తే తప్పులేదుగా. చెడ్డ అలవాట్లను వదులుకుంటే మంచిదే కదా. ఆచరించడం ఆచరించకపోవడం తరువాత విషయం. ఎవరి అలవాట్లు వాళ్ళవి. వారి అలవాట్ల వల్ల మీకు కాని మరెవరికైనా కాని ఇబ్బంది లేకపోతే పట్టించుకోకండి. ఎవరి అలవాట్లు వాళ్ళనే పాటించనివ్వండి. కొన్ని బుద్ధులు పుట్టకతో వచ్చినవి, పుల్లలేసినా పోవు. మరి ఈ విషయంలో దెబ్బలాటలు ఎందుకు? పెద్దమనసుతో వదిలెయ్యండి. అందరికి individuality కావాలి. నాకిష్టం వచ్చినట్లే ఉండాలి, ఇష్టం వచ్చినట్లే ప్రవర్తించాలి అన్న వితండ వాదం వదులుకోండి. ప్రేమ ఉంటే ఇలా ప్రవర్తించు అలా ప్రవర్తించు అని అడగక్ఖర్లేదు. వాళ్ళే మీకు అనుగుణంగా ప్రవర్తిస్తారు. మీ గౌరవించి ఇష్టపడడం మొదలు పెడతారు. కాని మీరు మిమ్మల్ని ప్రేమించనివ్వాలిగా. అంత space and time మీరు తనకి ఇవ్వాలి మరి.
5. వారి దుఃఖంలో ఓదార్పు మీరే కావాలి. వారి భయానికి మీరే ధైర్యం కావాలి. వారి నిస్సత్తువకి మీరే శక్తి కావాలి. వారి ఆలోచనకి మీరే ప్రేరణ కావాలి, వారికి తోడు నీడ, వారి నమ్మకం మీరే కావాలి. ఎప్పుడు వారిని మాటలతో, చేతలతో మోసం చెయ్యకండి. మీరు అనే మాట ముందు ప్రవర్తించే ముందు తనవైపు ఆలోచించి ముందడుగు వెయ్యండి.
6. పెళ్లి అవ్వగానే ప్రేమ అంతం కాదు. రోజు రోజుకి పెరిగేలా చూడండి. చిన్న చిన్న outings కి మీరిద్దరే వెళ్ళండి. మీ జీవిత భాగస్వామిని ఎప్పుడు స్నేహితులుగా చూడండి. మీరిద్దరూ ఏకాంతంగా గడపడానికి సమయం తీసుకోండి. అన్ని విషయాలు దాపరికం లేకుండా పంచుకోండి. కలిసి భోజనం చెయ్యండి, ఇంట్లో అత్తమామలో, మరుదులో, పిల్లలో ఉండి, తినే సమయాలు వేరే అయినా మీ ఇద్దరు కలిసి భుజించడం విషయంలో మాత్రం no reservations. ఈ విషయంలో ఎవ్వరు ఏమనుకున్నా పరవాలేదు. తరువాత అందరు మీ అన్యోన్యత గురించే చర్చించుకుంటారు, అసూయ పడితే పడతారు. That is their problem.
7. నవ్వు మహా ఔషదం. ఇల్లాలు వంటపని, ఆఫీసు ఉంటే ఆఫీసు పని, భర్త ఆఫీసు పనితో సతమతమయ్యి ముఖం వేల్లాడదీసుకొని ఇంట్లో ఉండకండి. ఫ్రెష్ అయ్యి నవ్వు మొహంతో మీ బెటర్ హాఫ్ కి కనపడండి. ఇదొక మాజిక్ టానిక్.
8. అహంభావాలు, పోల్చుకోవడాలు, చిన్న దెబ్బలాటలకే చెయ్యి చేసుకోవడాలు, తానూ మాట్లాడితే కాని నేను మాట్లాడను అనే పంతాలు, పట్టింపులు భార్య భర్తల బంధంలో పనికి రావు. ఇద్దరు ఒకోసారి అడ్జస్ట్ అవ్వాలి. ఎప్పుడు ఒకరి పంతమే నెగ్గితే, అది అనారోగ్య బంధమే.
9. చాల ముఖ్యమైన విషయం. భార్య భర్తల మధ్య మూడో వ్యక్తికి తావు ఇవ్వ కూడదు. వారు మీ తల్లిదండ్రులైనా, తోబోట్టువులైనా, ప్రాణ స్నేహితులైనా. మన జీవిత భాగస్వామి అతిగా ప్రవర్తిస్తే తప్పకుండా చెప్పుకోవాలి, కాని మన వాళ్ళ దగ్గర మాత్రమే. మనవాళ్ళు సలహా ఇస్తే వినండి, కాని వివేకంగా ఆలోచించి, సమయం సందర్భాన్ని బట్టి మీ నిర్ణయం మీరే తీసుకోండి. అత్తమామలను అమ్మా నాన్నా అని సంబోధించి చూడండి ఆప్యాయతలు పెరుగుతాయి. ఆడబిడ్డలతో, మరుదులు, మరదల్లతో, సోదరసోదరీ భావంతో మెలగండి. మూతివిరుపులు, చెవి కోరుక్కోవడాలు ఉండవు. అందరిని "నా కుటుంబం" అనుకోని ప్రవర్తించండి. అప్పుడు చుడండి "ది రియల్ వండర్స్ అఫ్ మారీడ్ లైఫ్".
10. ఎట్టి పరిస్థితుల్లోను మన జీవిత భాగ స్వామి ఎంత పెద్ద తప్పు చేసినా నలుగురిలో అవమాన పరచకండి, ముఖ్యంగా వారి తోబోట్టువుల దగ్గరో, మీ అమ్మానాన్నల దగ్గరో, తోటికోడలో, తోడల్లుడి దగ్గరో, పిల్లలముందో, స్నేహితులముందో. ఆ నాలుగు గోడల మధ్యే మీరు ఎం మాట్లాడుకున్నా, పోట్లాడుకున్నా. నలుగురికి మాత్రం మీ ఇద్దరు ఒక్కరే. మీ ఇద్దరిది ఒక్క మాటే. మీకు సంబంధించిన ఏ బాధాకరమైన, సంతోషకరమైన, ఏదైనా వార్తా, విషయం ఉంటె ముందు తెలపాల్సింది మీ జీవిత భాగ స్వామికే. తరువాతే మిగితా అందరు.
11. ముఖ్యంగా పక్కింటి పిన్ని గారో, ఆఫీస్ లో కొల్లీగ్ దగ్గరో ఇంట్లో విషయాలు అనవసరం. ప్రేమగా పలకరించిన వాళ్ళందరి దగ్గరా ఇంటి విషయాలు చర్చించుకోకూడదు. ఎంత అమ్మా నాన్న అయినా, ప్రాణ స్నేహితుడైనా, ఇంట్లో మీ భార్య / భర్త తరువాతనే అన్న విషయం గ్రహించండి.
12. ఈరోజుల్లో ముఖపుస్తకాల వంటి సోషల్ మీడియాల్లో పరిచయాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. అందరు ఎంతో ప్రేమగానే ఆప్యాయంగానే మాట్లాడతారు. ఇక్కడ పరిచయం అయిన వాళ్లకి ఇంటి విషయాలు అస్సలు చెప్పకూడదు. వారు ఎంతటి మహామహులైనా సరే, మీకు ఎంత దగ్గరైనా సరే. తరువాత వారి ముందు తల దించుకోవాల్సింది మీరే. ఇంట్లో గుట్టు బయట పెట్టినందుకు మూల్యం చెల్లించాల్సిందీ మీరే. సోషల్ మీడియాని మితంగా వాడండి. మీ సమయాన్ని మీ వాళ్ళతో ఎక్కువగా కేటాయించండి. వాళ్ళు మాత్రమే మీ వాళ్ళు. మీ జీవితం చరమాంకంలో తోడుగా ఉండేవాళ్ళు. ముందు మీరు మీ కుటుంబం, మీ స్నేహితులు, బంధువులు, తరువాతే మీ సోషల్ మీడియా మిత్రులు. ఇక్కడ మంచి చేసేవారికంటే, హితోక్తులు, మంచి మాటలు, నీతులు చెప్పే వాళ్ళే ఎక్కువ. అందరు మంచి మనుషుల్లానే ఉంటారు. మరి వారి వారి ఇంట్లో, మనస్తత్వాల్లో ఎట్లాంటివారో మనకి తెలియదు కదా. మంచి చెబితే వినడం వరకే. కాని అతి దేనిలోనూ పనికి రాదు. ఎవ్వరిని ఎంతలో ఉంచాలో అంతలోనే ఉంచండి. ఈ మధ్య విడాకులు, హత్యలు, మోసాలు, మానసిక రుగ్మతలు, నిద్రలేమి, etc వీటన్నిటికి ముఖ్య కారణం ది గ్రేట్ మాయ విశ్వం మన FB వంటి మాయా ప్రపంచం. సో తస్మాత్ జాగ్రత్త. ఇవి మీ జీవితభాగస్వామి పట్ల ప్రేమని తగ్గించడమే కాక దూరం కూడా చేస్తుంది
ఇవన్ని పెళ్లి మొదటి సంవత్సరంలో మీరు పాటిస్తే, మీ జీవితభాగస్వామిని అర్ధం చేసుకోవడానికి ప్రయత్నిస్తే, మీ జీవితం ఒక గమనాన్ని ఏర్పరుచుకుంటుంది. మీ ఇద్దరి జీవితాలతో పాటు మీ చుట్టూ వున్నా వారి జీవితం కూడా ఆనందంగా ఉంటుంది. అప్పుడే మీరు నలుగురికి ఆదర్శంగా నిలిచి, ఆదర్శ దంపతులవుతారు.
----------------సర్వే జనః సుఖినోభవంతు----------------
-...

నమ్మకం

ఒక వ్యక్తి తన జుట్టు సమంగా కత్తిరించుకోవడానికి క్షవరసాలకి వెళ్లాడు. అక్కడ మంగలి, పని మొదలుపెట్టగానే ఇద్దరూ చాలా విషయాలు మాట్లాడుకోవడం ప్రారంభించారు. భగవంతుడి గురించి మాట్లాడడం మొదలుపెట్టేసరికి, మంగలి"నాకు భగవంతుడు ఉన్నాడు అని నమ్మకం లేదు" అన్నాడు.
"ఎందుకు అలా అంటున్నావు"అని ఆ వ్యక్తి ఆడిగాడు.
మంగలి ఇచ్చిన సమాధానం." బైటకి వెళ్ళి చూస్తే, భగవంతుడు ఉన్నాడు అని నమ్మకం కలగదు. నిజంగానే భగవంతుడు ఉంటే, ఎందుకు మనుషులు సుస్తీతో బాధ పడుతున్నారు? ఇంతమంది అనాధపిల్లలు ఉంటారా? ఎవరయినా బాధ పడతారా? నిజంగా భగవంతుడికి ప్రేమ ఉంటే ఇవన్నీ చుస్తూ ఊరుకుంటాడా?
ఆ వ్యక్తి కాసేపు ఆలోచించి, ఏమీ సమాధానం చెప్పలేదు. అనవసరంగా వాదన చేయడం ఇష్టం లేక. మంగలి పని ముగించగానే, ఆ వ్యక్తి బయటికి వెళ్ళిపోయాడు. రోడ్డు మీద
ఒక మనిషిని చూసాడు. పొడుగు జుట్టుతో సమంగా కత్తిరిచుకోకుండా, చూడడానికి అసహ్యంగా ఉన్నాడు. అప్పుడు, ఆ వెంటనే, మంగలి కొట్టుకి వెళ్ళి ఇలా అన్నాడు. "నీకు తెలుసా, మంగలి ఉన్నాడు అని నాకు నమ్మకం లేదు"
అప్పుడు, మంగలి, "అలా ఎలా అనగలువు, నేను ఇప్పుడే నీకు పని చేశాను కదా"
అప్పుడు ఆ వ్యక్తి ఇలా అన్నాడు, "నిజంగానే మంగలి ఉంటే, బయట ఆ మనిషి అలా, అంత జుట్టుతో అసహ్యంగా ఉండడు."
అప్పుడు మంగలి "నా దగ్గరికి రాకపోతే నేను ఏమి చేయ గలను" అని అన్నాడు.
దానికి ఆ వ్యక్తి, "మనుషులు భగవంతుడి సహాయం కోసం, దగ్గరికి వెళ్ళాలి. ఎప్పుడు అయితే భగవంతుడికి దగ్గర అవుతామో ,అప్పుడు సంతోషంగా ఉంటాము. భగవంతుడు ఉన్నాడు."
నీతి:
------
భగవంతుడు కావాలి అని అనుకునే వాడికి, భగవంతుడు తప్పకుండా ఉంటాడు. భగవంతుడు ఎక్కడ లేడు? నీ మొహంలో చిరునవ్వు, ఎదుటి వాడు బాధ పడుతుంటే జాలి చూపించటం, మన దగ్గర వాళ్ళకి ప్రేమగా ఉండడం,అన్ని కూడా, భగవంతుడు మనలో ఉండి చేయిస్తున్నాడు. భగవంతుడి కోసం మన హృదయంలో దృష్టి పెడితే నవ్వుతూ
కనిపిస్తాడు.

Saturday, September 13, 2014

నా గుండెలో వున్నది నీ ప్రాణమే !!



ఒక అమ్మాయి తన లవర్ నీ ఇలా అడిగింది - "
వచ్చేవారం నా బర్త్డే
కదా ఏ గిఫ్ట్ ఇస్తున్నావురా?. ." అని
అడిగింది.
తన లవర్ ఇలా అన్నాడు " ఇంకా వారం వుంది
కదా అప్పుడే
అడుగుతే ఎలా చెప్పనురా బంగారం ? అయినా
సరే చెప్తున్నా..
ఇప్పటి వరకు ఎవరు ఇవ్వని గిఫ్ట్
నీకు నేను ఇస్తా..!" అని మాట
ఇచ్చాడు..
అమ్మాయి బర్త్డే కి
మూడు రోజులు ముందు ఆ అమ్మాయి సృహ
తప్పి
పడిపోయింది. వెంటనే హస్పిటల్
కు తీసుకు వెళ్ళారు.
డాక్టర్ ఆ అమ్మాయిని చెకప్ చేసి, తన
కుటుంబ సభ్యులతో ఇలా
చెప్పాడు " తను ఎక్కువ రోజులు బ్రతకదు.
తనకు వెంటనే సేమ్
బ్లడ్ గ్రూప్ వున్నవారు ఎవరైన వారి గుండెని
డోనేట్చేయాలి లేకపోతే
చనిపోతుంది.. " అని చెప్పాడు.
అది విని ఆ అమ్మాయి తన లవర్
చేతులు పట్టుకొని ఏడుస్తూ - ఇలా
చెప్పింది " రేయ్!! నేను కొద్దిరోజుల్లో
చనిపోతానంట.
నువ్వు నన్ను మర్చిపోరా!.. ప్లీజ్ రా..! నా
చివరి కోరిక ఇదేరా.
నువ్వు ఇక్కడి నుంచి నాకు దూరముగా
వెళ్ళిపోరా!! నా కంటికి
కనిపించనంత దూరంగా వెళ్ళిపోరా.. " అని అంది.
ఆ అబ్బాయి ఓ చిరునవ్వు నవ్వి "
నువ్వు ఎక్కడకి పోతావురా
బంగారం. నన్ను వదిలి నీకు ఏమి కాదురా
నేను ఉన్నాను కదా.."
ఆ అమ్మాయి ఏడుస్తూ అంది - "
నువ్వు అంత నమ్మకంగా ఎలా
చెబుతున్నావురా నేను బ్రతుకుతాననీ ?"
ఆ అబ్బాయి - అమ్మాయి నుదుటి మీద
ముద్దు పెట్టి, " నీకు బర్త్డే
గిఫ్ట్ ఇవ్వలేదు కదా..! నీకు వచ్చే గిఫ్ట్
చూడు..
నువ్వు బ్రతుకుతావు.." అని చెప్పి అక్కడి
నుంచి వెళ్ళిపోయాడు.
రెండు రోజులు తర్వాత ఆపరేషన్ జరిగింది.
కొద్దిరోజుల తరవాత ఆ
అమ్మాయి డిశ్చార్జ్ అయ్యి ఇంటికి
వెళ్ళిపోయింది.. తన బెడ్రూంలో ఒక
లెటర్ వుంది. ఆ లెటర్లో ఇలా వ్రాసి వుంది -
ప్రియమైన బుజ్జిబంగారం..
నీవు ఈ ఉత్తరంని చదువుతున్నావు కదా!
నువ్వు బ్రతుకుతావుని చెప్పాను కదా !!
నా ప్రాణం వున్నంత వరకు నువ్వు ఎలా
చనిపోతావు రా ?
నా ఆఖరి శ్వాస వరకు నీ కోసమే బ్రతకాలి
అనుకున్నా..
నా ప్రాణం ఇచ్చైనా బ్రతికించుకోవాల నీ
అనుకున్నా.
"బుజ్జి" - నువ్వు మొన్న అడిగావు కదా - నా
బర్త్డేకి ఏ గిఫ్ట్
ఇస్తావనీ..!!
నీకు అప్పుడు చెప్పాను కదా..
నీకు ఎవరు ఇవ్వని గిఫ్ట్ నేను ఇస్తాననీ,
నీకు ఎవ్వరు ఇవ్వలేనీ గిఫ్ట్ గా - నా గుండెని
నీకు కానుకగా
ఇచ్చా!
బంగారం.. ఏడవకు రా..
నేను చనిపోయినా నా గుండె - నీ దగ్గరే వుంది
కదరా!!
నా గుండెలో వున్నది నీ ప్రాణమే !!

Sunday, July 27, 2014

yagnopaneetham aug Monthly Magazine Aug2014

Online లో చదవడానికి క్రింది లింక్ క్లిక్ చేయండి | Click Below Link to View / Read Online.
https://drive.google.com/file/d/0ByOMsv7nnAWEd3Noa3JDUm9zVzA/edit?usp=sharing

 క్రింది  నుండి డౌన్లోడ్ చేసుకోండి | Download From The Below Link    
https://drive.google.com/file/d/0ByOMsv7nnAWEd3Noa3JDUm9zVzA/edit?usp=sharing

Saturday, July 12, 2014

మానవ జన్మ ఎంతో విలువైనది - ఒక రాయి కథ

రాళ్ళు కొట్టుకుని జీవించే ఒక అతను ఒక రోజున తన పని చేసుకుంటూ ఉండగా కను చూపులో ఒక రాయి ఎంతో ఆకర్షణీయంగా కనిపించింది. దానికి మురిసి అతను ఆ రాయిని గుడ్డలో కట్టుకుని ఇంటికి తీసుకుని వెళ్లి భార్యకు ఇచ్చాడు. ఆమె దాన్ని గూట్లో పెట్టింది. కొన్ని రోజుల తరువాత కుంకుడు కాయలు కొట్టడానికి రాయి దొరక్క దాన్ని ఉపయోగించుకుంది తరువాత తరువాత ఆ రాయిని అదే పనికి చాలా సార్లు వాడుకున్నది. ఒక రోజున వాళ్ళ పిల్లాడు రాళ్ళ ఆట ఆడుకోటానికి ఆ రాయిని తీసుకుని బయటకి వెళ్ళాడు. కొద్ది సేపటికి అటుగా మిఠాయిలు అమ్ముకునే అతను వచ్చేటప్పటికి పిల్లలు అందరు ఆ మిఠాయి బండి చుట్టూ మూగారు. ఈ పిల్లాడు కూడా రాళ్ళు చేతిలో పట్టుకుని వెళ్ళాడు. ఆ రాయి మిఠాయి వ్యాపారిని ఆకర్షించింది. అతను బాబుతో ఆ రాయి నాకు ఇస్తావా .. నీకు ఒక చిక్కీ (పల్లీ పట్టీ) ఇస్తాను అన్నాడు. పిల్లాడు సంతోషంతో ఆ రాయి అతనికి ఇచ్చేశాడు.
సాయంత్రం చెత్త వస్తువులు ఏరుకునే అతని స్నేహితుడు చూసి ఆ రాయి గురించి అడిగితే అతను ఎవరో పిల్లాడి చేతిలో ఉంటె బాగుంది కదా అని ఒక చిక్కీ ఇచ్చి తీసుకున్నాను అని చెప్పాడు. ఆ స్నేహితుడు ఆ రాయిని కోరగా అతనికి ఇచ్చేశాడు. అతను ఆ రాయిని మిగతా చెత్త వస్తువులతో కలిపి చెత్త వస్తువులు కొనే వ్యాపారి వద్దకి పోయి వస్తువులని వివిధ రకాలుగా విభజించి అతనికి అమ్మగా అతను ఈ రాయిని చూసి అది ఏమిటి ఇవ్వవా అని అడిగాడు. దానికి అతను కొంత రొక్కము తీసుకుని ఆ రాయి వ్యాపారి కి ఇచ్చేశాడు. బాగుంది కదా అని వ్యాపారి దాన్ని బల్ల పైన పేపర్ వెయిట్ గా వాడ సాగాడు. కొన్ని రోజులకి ఒక టోకు వ్యాపారి ఇతని దుకాణానికి వచ్చి ఆ రాయిని చూసి, అతనికి కొంత రొక్కం ఇచ్చి ఆ రాయిని తీసుకున్నాడు. దాన్ని వజ్రాల వ్యాపారి వద్దకి తీసుకుని వెళ్లి పరీక్ష చేయిస్తే అది కొన్ని కోట్లు విలువ చేసే మేలిమి వజ్రం అని తేలింది.

నీతి --- అదే రాయి ని ఒకళ్ళు కుంకుడు కాయలు కొట్టుకో డానికి వాడుకున్నారు. ఒకళ్ళు రాళ్ళ ఆట ఆడుకోటానికి వాడుకున్నారు. ఒకళ్ళు ఒక చిక్కీ కోసం దాన్ని ఇతరులకి ఇచ్చేశాడు. ఒకళ్ళు దాన్ని పేపర్ వెయిట్ గా వాడుకున్నారు. నిజంగా దాని గురించి తెలిసిన వ్యక్తి దాని విలువ రాబట్టుకున్నాడు. అట్లాగే ఈ మానవ జన్మ ఎంతో విలువైనది. ఎంతో అరుదుగా లభించేది. దాన్ని దేనికోసం వాడుకోవాలి అన్నది వారి వారి బుద్ధి ప్రచోదనానికి లోబడి ఉంటుంది. మానవ జీవిత పరమార్థం తెలిసికొనినవారు ఈ జన్మను సరిగా వాడుకుంటూ జీవన్ముక్తి పొంద గలుగుతున్నారు. లేని వారు ఈ జీవితాన్ని వృథా చేసుకొనుచున్నారు.

Thursday, May 29, 2014

నమ్మకం



నమ్మకం
ప్రేమ
ఒక రోజు ఒక చిన్న పాప, తన తండ్రి వంతెన దాటుతున్నారు. తండ్రి, తన పాప ఎక్కడ పడిపోతుందో నని, పాపతో ఇలా అన్నారు,'చిన్న తల్లి, నా చెయ్యి
పట్టుకో, అప్పుడు నువ్వు, నదిలో పడిపోకుండా ఉంటావు.'
అప్పుడు ఆ పాప ఇలా అంది,'లేదు నాన్నగారు, మీరే నా చెయ్యి పట్టుకోండి'.
'ఏమిటి తేడా' అని తండ్రి ఆశ్చర్యంగా అడిగేరు.
'చాలా తేడా ఉంది నాన్నగారు' అని పాప సమాధానం చెప్పింది.
'నేను మీ చెయ్యి పట్టుకుని, నాకు ఏమైన అయితే, నేను మీ చెయ్యి వొదిలెయచ్చు కదా. కాని మీరు నా చెయ్యి పట్టుకుంటే నాకు ఖచ్చితంగా తెలుసు, ఏది ఏమైన, మీరు నా చెయ్యి వొదలరు అని'.
నీతి :-
భగవంతుడు మనందరికి తండ్రి. భగవంతుడిని మనం వదులుకోవాలి అని అనుకున్నాఆయన మనల్ని వదలరు.
భగవంతుడిని గట్టిగా పట్టుకోవాలి, ప్రేమతో, భక్తి తో కట్టెయ్యాలి.

Friday, May 16, 2014

ఆత్మవిశ్వాసం నమ్మకం

 
నమ్మకం
ఒక రోజు నేను అందర్నీ వదిలి వెళ్ళిపోవాలని నిశ్చయించుకున్నాను. నా ఉద్యోగం, నాకు ఉన్న అనుబంధాలు,ఆధ్యాత్మికత పట్ల నాకున్న శ్రద్ధ అన్నీ వదిలెయ్యాలనిపించింది.
చివరిసారిగా భగవంతుడితో మాట్లాడదామని అడవిలోకి వెళ్ళేను.
దేవుడా ! "వీటినుండి వెళ్ళిపోకుండా నిలబడడానికి నాకు ఒక కారణం చూపించగలవా" అని అడిగాను.
అప్పుడు భగవంతుడు , నీ చుట్టూ ఉన్న అడవిమొక్కలు మరియు వెదురుచెట్లను ఒక్కసారి చూడు అన్నాడు. నేను చూసానని చెప్పేక ఈ విధంగా చెప్పడం మొదలుపెట్టేడు. నేను అడవిమొక్కల విత్తనాలు, వెదురు విత్తనాలు ఒక్కసారే పాతేను. రెండింటికి నీరు,వెలుగు అందేలాగ సమంగా శ్రద్ధ తీసుకున్నాను.అడవిమొక్కలు తొందరగా ఎదగడం ప్రారంభించాయి.వాటి పచ్చదనంతో నేలంతా ఎంతో అందంగా కనిపించసాగింది.వెదురు విత్తనాలు అలాగే వున్నాయి.వాటిలో ఏమాత్రం ఎదుగుదల లేదు, అయినా నేను నిరాశ పడలేదు. ఒక సంవత్సరం గడిచింది, అడవిమొక్కలు ఇంకా బాగా ఎదిగి నేలంతా పరచుకుంటున్నాయి, కాని వెదురు విత్తనాలు అలాగే వున్నాయి, అయినా నేను నిరాశపడలేదు. మూడవ సంవత్సరంలో కూడా వెదురు విత్తనాల్లో మొలక రాలేదు, అయినా నేను నిరాశపడలేదు, నాలుగవ సంవత్సరంలో కూడా ఎలాంటి ఎదుగుదల లేదు ఐదవసంవత్సరంలో చిన్న మొలక కనిపించింది. అడవిమొక్కలతో పోలిస్తే చాల తక్కువనే చెప్పాలి,కాని 6నెలలు గడిచేసరికి 100 అడుగుల ఎత్తు వెదురు చెట్లు లేచాయి.5 సంవత్సరాలుగా వెదురు విత్తనాలు భూమిలో వుండి , చెట్టుగా మారేక నిలబడడానికి అవసరమైన వేళ్ళను బలంగా తయారుచేసుకున్నాయి. నా సృష్టిలో ఏ ప్రాణికీ అది చెయ్యలేని పనిని నేను ఇవ్వను. ఇన్ని సంవత్సరాలుగా నువ్వు పడుతున్న ఒత్తిడి వల్ల జీవితాన్ని ఎదుర్కొందుకు అవసరమైన ధైర్యం నీలో పెరుగుతోంది.వెదురు చెట్ల విషయంలో నిరాశపడి వాటిని వదిలిపెట్టలేదు, అలాగే నిన్ను కూడా వదిలిపెట్టను.
నిన్ను నువ్వు ఇతరులతో పోల్చుకుని తక్కువ చేసుకోకు. అడవిమొక్కలు, వెదురుచెట్ల లక్ష్యం ఒకటికాదు, కాని ఆరెండుకలిసి అడవిని అందంగా చేస్తున్నాయి. నీకు కూడా మంచికాలం వస్తుంది. అప్పుడు నువ్వు కూడా జీవితంలో పైకి ఎదుగుతావు. నీ ఎదుగుదల ద్వారా నా కీర్తిని వ్యాపింపచెయ్యి అని చెప్పేడు. దేవుడు నన్ను వదిలిపెట్టడన్న నమ్మకంతో నేను ఇంటికి తిరిగివచ్చేను. భగవంతుడు ఈ విశ్వానికే తండ్రి కాబట్టి తన పిల్లలవిషయంలో అశ్రద్ధ ఎప్పుడూ చూపడు. ఒత్తిడి తట్టుకోలెక మనమే ఆయన్ని అపార్థం చేసుకుంటాము. మంచి రోజులు సంతోషాన్ని ఇస్తే , చెడ్డ రోజులు అనుభవాల్ని ఇస్తాయి. జీవితంలో రెండెంటి విలువ తెలుసుకోవడం మన కర్తవ్యం
.
నీతి: ఇతరులతో పొల్చుకోవడం మానేసి మన పనిమీద దృష్టి పెట్టగలిగితే విజయం సాధించడం సులభం అవుతుంది. మన కర్తవ్యం నిర్వహించి మిగిలినది భగవతుడికి వదిలెయ్యాలి. అడవిమొక్కలు, వెదురుచెట్లలాగే మనుషులందరి జీవితాలకి విభిన్నమైన లక్ష్యాలు ఉంటాయి. నమ్మకంతో ప్రయత్నం చేసి వాటిని చేరుకోవడం మన కర్తవ్యం.