Sunday, October 25, 2015

థామస్ ఆల్వా ఎడిసన్ స్కూల్లో జరిగిన సంఘటన.

ఒకరోజు టీచర్ ఓ చీటీ ఇచ్చి ఇంటికెళ్ళి నేరుగా అమ్మకివ్వు
నువ్వు ఎట్టిపరిష్తితులలోనూ తీసి చూడకు అని చెప్పారట.
అతి విధేయతతో ఎడిసన్ ఆ చీటీని అమ్మకిచ్చి ఆమె అందులో ఏముందో
చెబుతుందిగదా అని ఎదురు చూసాడట.
వాళ్ళమ్మగారు చీటీలోని విషయాలను పెద్దగా చదివి వినిపిస్తూ.
"మీ అబ్బాయి చాలా తెలివైన వాడు. ఈ పాఠశాల అతని మేధకు
పదునుపెట్టగల సామర్ధ్యంలేనిది,కావునా మీరతన్ని ఏదయినా
మంచి బడిలో చేర్పించి చక్కగా సానపట్టగలరని మా విన్నపం."
అతన్ని ఇంకో బడిలో చేర్పించారు.వాళ్ళా అమ్మగారు పరమపదించాక
ఎడిసన్ పాత సామాన్లన్నింటినీ సర్దుతుంటే వాళ్ళమ్మగారి డైరీ
కనిపించింది అందులో ఓ పేజీలో మడతపెట్టిన ఓ కాగితం కనబడితే
తీసి చూసి నిరుత్తరురుడయాదు ఎడిసన్. అది ఆరోజు తన బదిలోనుంచి తను తెచ్చిన కాగితం. తీరా ఉత్తరం చదివాక ఎడిసన్ కళ్ళనీళ్ళపర్యంతమయాడు. ఆఉత్తరంలోని సారాంశం అమ్మ ఆరోజు చదివి వినిపించిన దానికన్నా భిన్నంగా వుంది.
'మీ అబ్బాయి మందమతి .అతన్ని బాగు చేయడం మా వల్లకాదు అతనివలన మిగతా పిల్లలుకూడా చెడిపోయేప్రమాదం వుంది.
మీరతన్ని వెంటనే మా బడినుంచి మానిపించగలరు!!"
అప్పుడు అశృపూరితనయనాలతో ఎడిసన్ అన్నమాటలు.
ఎడిసన్ మంద బుద్ధిగలవాడే కానీ వాళ్ళ అమ్మ ధీరోదాత్త అందుకే తనకొడుకును భిన్నంగా తీర్చిదిద్ది ఇలా ఓ శాస్త్రవేత్తగా నిలబెట్టగలిగింది.

పెళ్ళి ఉంగరం మన చేతి నాలుగో వేలికే ఎందుకు తొడుగుతారు. తెలుసుకుందామా.ఇది పెళ్ళయినవాళ్ళకి,పెళ్ళికాబోయేవాళ్ళకి ఉపయోగకరము.చూద్దామా సంగతేంటో.

* పెళ్ళి ఉంగరం మన చేతి నాలుగో వేలికే ఎందుకు తొడుగుతారు.
తెలుసుకుందామా.ఇది పెళ్ళయినవాళ్ళకి,పెళ్ళికాబోయేవాళ్ళకి
ఉపయోగకరము.చూద్దామా సంగతేంటో.
01. బొటనవేలు-తల్లితండ్రులకు ప్రతినిధి
02. చూపుడువేలు-తోబుట్టువులకు ప్రతినిధి
03. మధ్యవేలు-మనకోసం
04. ఉంగరంవేలు-జీవితభాగస్వామికి ప్రతినిధి
05. చిటికెనవేలు-పిల్లలకు ప్రతినిధి
ఆసక్తిగా ఉందికదా……..
ఈ విధంగా చేయండి.రెండు అర చేతులను తెరచి,మధ్య వేళ్లు
రెండూ మడిచి వెనకవైపునుండి దగ్గరగా పెట్టండి.ఇప్పుడు
మిగతా వేళ్లన్ని చివరలు కలిపి ఉంచండి.
మొదట బొటన వేళ్లు విడదీసి చూడండి.అవి విడిపోతాయి.
అంటే మానవులందరూ ఎదో ఒక రోజు చనిపోతారు.అలాగే
మన తల్లితండ్రులు కూడా మనల్ని వదలి వెళతారు.
ఇప్పుడు బొటన వేళ్లు కలిపి రెండో వేళ్లు విడదీయండి. అవి
కూడా విడిపోతాయి. అంటే మన తోబుట్టువులు కూడా వాళ్ల
సంసారాలలో తలమునకలై ఉండి మనతో ఉండరు.
ఇప్పుడు రెండో వేళ్లు కూడా కలిపి చిటికెన వేళ్లు విడదీయండి.
అవి విడిపోతాయి. అంటే మన పిల్లలు కూడా తమ స్వంత
జీవితాలకోసం మనల్ని వదలి వెళతారు.
ఇక చిటికెన వేళ్లు కూడా కలిపి నాలుగో వేళ్లు విడదీయండి.
ఆశ్చర్యం! ఇది నిజం అవి విడిపోవు.ప్రయత్నించినా మిగతా
వేళ్లు కలిసే ఉండాలి. ఎందుకంటే ఆ నాలుగో వేళ్లు భార్యా
భర్తల బంధానికి,ప్రేమకు ప్రతినిధులు. జీవితాంతం కలిసే
వుండాలని పెళ్లి ఉంగరాలను ఆ నాలుగో వేలికి తొడుగుతారు.
అందుకే నాలుగో వేలిని ఉంగరపువేలు అని అంటారు.
ప్రయత్నించి చూడండి.

ఎవరు పేదవారు??

ఎవరు పేదవారు??
 
ఒక చాలా సంపన్న మహిళ చీరల షాప్ కి వెళ్లి , "బాబూ! కొన్ని చౌకగా చీరలు చూపించండీ! నా కుమారుడి వివాహం. కట్నంగా మా ఇంట్లో పని మనిషికి ఇవ్వాల్సి ఉంది."
అలాగే అని చౌక చీరలను చూపించాడు ఆ షాప్ అబ్బాయి .
అందులోంచి ఒక చౌక చీరను ప్యాక్ చేయించుకుని వెళ్లిపోయింది ఆ సంపన్న మహిళ.
కొంత సమయం తర్వాత ఆ చీరల షాప్ కి మరొక మహిళ వచ్చి, "అన్నా! కొన్ని ఖరీదైన చీరలు చూపించు! మా యజమానురాలి కొడుకు వివాహం. ఈ సందర్భంగా మా యజమానురాలుకు కట్నం పెట్టడం కోసం నెలనెల డబ్బులు కూడబెట్టాను. ఆమెకు ఒక మంచి చీరను కట్నంగా ఇవ్వాలి.
అలాగే అని ఖరీదైన చీరలను చూపించాడు ఆ షాప్ అబ్బాయి .
అందులోంచి ఒక ఖరీదైన చీరను ప్యాక్ చేయించుకుని వెళ్లిపోయింది ఆ పేద మహిళ.
ఈ ఇద్దరు స్త్రీలలో ఎవరు పేదవారు?
పేదరికం ఎక్కడ ఉంది ?
మనస్సులోనా?
గుణం లోనా?
సంపన్న మహిళకు ఇంట్లో పేదరికం లేకపోవచ్చు! కాని ఆమే వ్యక్తిత్వంలో పేదతనం ఉంది.
ఆ పేద మహిళకు ఇంట్లో పేదరికం ఉండోచ్చు! కాని ఆమే వ్యక్తిత్వంలో పేదతనం లేదు.
ఆ ఇద్దరు స్త్రీలను ఇల్లుతోనూ - దేనితోనూ సంబంధం లేకుండా ఒంటరిగా నిల్చోబెడితే ఎవరు పేదవారు ???
  
ఎవరు ధనవంతులు ???
🔯 🔯 🔯
ఒకసారి, తన కుటుంబం తో ఒక మహిళ టూర్ కు వెళ్లి అక్కడ ఒక త్రీస్టార్ హోటల్ లో బస చేసింది.. ఆ మహిళ ఒక ఆరు నెలల పాపకు తల్లి.
పాప పాల కోసం ఏడుస్తుంటే ఆ మహిళ త్రీస్టార్ హోటల్ మేనేజర్ వద్దకు వెళ్లి " దయచేసి ఒక కప్పు పాలు ఇవ్వగలరా? " అని అడిగింది.
"తప్పకుండా మేడమ్" అని ఆయన బదులిచ్చారు.
" కానీ మేడమ్ మా హోటల్లో ఒక కప్పు పాలు 100 రూ॥ మేడమ్!"
"పర్వాలేదు ఇవ్వండి!" అని ఆ మహిళ పాలు తీసుకుని పాపకు త్రాగించింది.
కొంత సమయం తర్వాత వారందరు అక్కడి ప్రదేశాలను చూడడానికి కారులో బయలుదేరారు.
మధ్యలో పాప ఆకలితో పాల కోసం ఏడుస్తుంటే...
వారు ఒక రహదారి ప్రక్కన ఉన్న టీ స్టాల్ వద్ద కారును ఆపుకున్నారు. ఆ టీ విక్రేత వద్ద ఒక కప్పు పాలు తీసుకుని పాపకు పట్టింది.
తరువాత "ఎంత?" అని ఆమె టీ స్టాల్ వ్యక్తిని అడిగింది.
"మేడమ్! మేము చిన్న పిల్లల పాలకు డబ్బు వసూలు చేయం" అన్నాడు టీ స్టాల్ వ్యక్తి నవ్వుతూ
ఎంత బలవంతపెట్టినా డబ్బులు తీసుకోలేదతను. అంతే కాదు ప్రయాణంలో పాపకు అవసరమౌతాయని మరో కప్పు పాలు పోసి ఇచ్చాడు.
ఆ మహిళ కారులో కుర్చున్న తరువాత ఆలోచించసాగింది.
నిజంగా ఎవరు ధనవంతులు ? త్రీస్టార్ హోటల్ నిర్వాహకుడా? లేక టీ స్టాల్ విక్రేత నా?
ధనవంతత్వం ఎక్కడ ఉంది?
మనస్సులోనా?
గుణం లోనా??
లేక దాచుకున్న డబ్బుకట్టలు - సంపదలలోనా???
చాలా సార్లు మనమందరం డబ్బు సంపాదన యావ లో పడి మనుషుల మన్న సంగతి మర్చిపోతుంటాము.
కాని ఇలాంటి అనేక సందర్భాలలో " తిరిగి ఏదో ఆశించకుండా చేసే చిన్న చిన్న సహాయాలు " డబ్బు ఇచ్చే కిక్ కన్న ఎన్నో రెట్లు అధికంగా మంచి అనుభూతిని ప్రసాదిస్తాయి

Tuesday, January 13, 2015

సుమధుర దాంపత్యబంధం అంటే!

సుమధుర దాంపత్యబంధం అంటే! 

పురుషాధిక్య భావజాలం వీడాలి. మనిషిని మనిషిగా చూడగలగాలి. మాటల్లోనే కాదు. చేతల్లోనూ తనలో సగభాగంగా సహధర్మచారిణిని అర్ధం చేసుకోవాలి. అంగీకరించాలి. ఇలాంటి ఇంటి వాతావరణం పిల్లల హృదయాలను స్పృశిస్తుంది,వికసింపజేస్తుంది.
'నిన్ను నిన్నుగా ప్రేమించుటకు, నీకోసమే కన్నీరు నించుటకు, నేనున్నానని నిండుగ పలికే, తోడొకరుండిన అదే భాగ్యము, అదే స్వర్గము...' అని మహాకవి శ్రీశ్రీ చెప్పిన మాటనే జీవితాన మననం చేసుకోవాల్సిన సందర్భాలు చాలానే వుండొచ్చు. 'భార్య అతనికి తోడునీడ..! 'భర్త' ఆమెకు బతుకంతా నమ్మకం. అసలు తొలిరోజుల్లోనే 'ఈమె నాకు సరియైన జోడీ' అన్న భావం పురుషుడికి కలగాలి. 'ఇతడు నాకు కొండంత అండ..' అన్న భరోసా ఆమెకు చేకూరాలి. 'నీవు లేని నేను లేనులే..అదీ నిజములే...! పూవు లేని తావి నిలువ లేదులేే..ఇదీ నిజములే..!' అని సినీ కవి అన్నట్టు..' రెండు వేణువులు: ఒకటే స్వరం. రెండు పుష్పాలు: ఒకటే పరిమళం. రెండు దీపాలు: ఒకటే వెలుగు. రెండు పెదాలు: ఒకటే వాక్కు. రెండు నేత్రాలు: ఒకటే దృశ్యం. వారిద్దరూ ఒకటే విశ్వం..' అని మహారాష్ట్ర భక్తకవి జ్ఞానేశ్వర్‌ అంటారు. అంటే ఆలుమగలు- ఆడ, మగగా మిగిలిపోకుండా భార్యాభర్తలుగా ఓ గూట్లోకి చేరి ఒకరికొకరిగా ఒక్కటైనప్పుడే సమైక్య జీవన సరాగ మాలిక. అప్పుడే సమభావం, సహధర్మం అనే పసందైన మేళవింపు ప్రతిఫలిస్తుంది. అది రెండు మంచి మనసుల మధ్య స్థిరంగా నిలిచే ఒకానొక గొప్ప నిర్వచనం కూడా అవుతుంది.
'రవికిరణం తాకనిదే నవ కమలం విరిసేనా!
మధుపం తను తాకనిదే మందారం మురిసేనా!
మేను మేను తాకనిదే మనసు మనసు కలవనిదే
మమత లేదూ, మనిషి లేడూ, మనుగడయే లేదులే' అని దేవులపల్లి కృష్ణశాస్త్రి ఓ గీత రచనలో చెప్పినట్లు పెళ్లయిన తొలినాళల్లో పురుషుడు ఇలా కోరుకున్నా, స్త్రీ కోరుకొనేది వేరే వుంది. అతడి సమక్షంలో తానుండగా, తండ్రి గుర్తొచ్చినా బెంగ కలగకూడదు. మదిలో తల్లి మెదిలినా కన్నీళ్లు పెట్టకూడదు. అసలు పుట్టింటివారెవరూ తనవద్ద లేరనే దిగులే వుండకూడదు. ఆ విధంగా అతడే ఆమెకు అన్నీ తానై మెలగాలి. అలా అయిననాడు ఆమె నవ్వితే అతడు నవ్వాలి. ఆమెకు ముల్లు గుచ్చుకుంటే అతను విలవిలలాడాలి. ఆమెకు గాయమైతే అతడు నవనీతం పూయాలి. ఆమె నల్లని జడలో అతను మల్లియలా మెరవాలి. అటువంటి ప్రేమమూర్తి సన్నిధిలో ఆమె మనసు రాగరంజితం కావాలి. అలాంటి మధుర క్షణాల్లో ఆమె 'అతడొస్తూ వసంతాన్ని వెంట తెస్తాడు..' అంటూ మురిసిపోతుంది. అదీ సుమధుర దాంపత్యబంధం అంటే! అరమరికల్లేని అలాంటి అన్యోన్య దాంపత్యం మధురగీతంలా సుతిమెత్తగా సాగిపోతుంది.

వివాహం అనే మహా వేధిక

ఇద్దరు స్త్రీ పురుషులూ కలిసి జీవితకాలం గడుపుతూ, సమాజానికి క్రమబద్దమైన సంతానం, వారసత్వం, సంపదలను అందించటానికి ఏర్పడినదే వివాహవ్యవస్థ స్వరూపం. ఇందులో భార్యా భర్త ప్రధాన పాత్ర ధారులు. 
భర్తంటే...తాళీ, తండ్రీ, తోడూ అనే మూడు ముళ్ళు కట్టి, వాటికి బద్దుడైన పురుషుడు. 
ఆమెకూ, ఆమె బిడ్డలకూ తను ఒక నీడలా మారి బాధ్యత వహించాలి. అప్పుడే అతను భర్తగా మన్నింపబడతాడు.
తెలియని మనిషిని పెళ్ళి అనే ఒక కార్యక్రమంతోనే ఆడది అంతగా నమ్ముతుందంటే కారణం... ఈ విలువను అతను ఇచ్చితీరతాడనే విశ్వాసమే.
తన ప్రాణoకి సైతం తెగించి అతని బిడ్డలకు తల్లీ అవుతుందంటే కారణం, భర్త అనే స్థానానికి గల తండ్రి అనే రూపాంతరం.
ఆ విశ్వాసమే వివాహం అనే మహా వేధికకు నిలయమయ్యింది తప్ప, మరేదో మంత్రం వారిద్దరిమధ్యనా కట్లుకట్టలేదు....

అమ్మ అనే పధం నువ్వు ఎప్పుడు అనవద్దు

ఒక కొడుకు తన తల్లి తో ఇలా 
అన్నాడు . అమ్మనువ్వు నన్ను 
నీ కోడlలుని చాలా ఇబ్బందిపెడుతున్నావు .నిన్ను చూస్తుంటే 
నాకు చిరాకొస్తుంది రోజు మీ ఇద్దరకి ఏదో గొడవ జరుగుతూనెఉన్నది ఇంట్లో 
మనశాంతి లేకుండాపోయింది నేను సంతోషం గా ఉండాలంటే నువ్వు మాకు దూరంగా ఉండటమే మంచిది అనిపిస్తుంది అందుకే నిన్ను బాగా చూసుకొనే ఆశ్రమం ఒకటుంది వాళ్ళకి నేను విరాళం బాగా ఇచ్చను వాళ్ళు నిన్ను మహారాణి లా చూసుకొంటారు వెళ్తావా .............?
దానికి ఆ తల్లి ఇలా అంది 
నాయినా నీ పెళ్ళాం చెప్పిన మాటలు నమ్మి నన్ను వెళ్ళిపోమ్మంట్టునావు.వెళ్ళిపోతాను తప్పకుండ వెళ్ళిపొతాను 
కానీ వెళ్ళే ముందు ఓ చిన్న కోరిక తిర్చగలవా ......? ఆ కోరిక నువ్వు తిర్చితే జీవితం లొ నీకు మళ్ళి కనపడను
హ తీర్చగలను అమ్మ చెప్పు ఏం కావాలో చెప్పమ్మా చెప్పు ??????
అదే నువ్వు ఇప్పుడున్నావే అమ్మ అనే పధం నువ్వు ఎప్పుడు అనవద్దు .అమ్మ అని నువ్వు ఇక మీదట పలకనే కూడదు అలా చెయ్యగలవా ??
ఓసి ఇంతేనా ఇంకా నువ్వు ఏం ఆడుగుతావుఅనుకున్నాను .సరే ఇకనించి అమ్మ ఆనే పదం నా పెదాలు పలకవు సరేనా ....
సరే నేను ఇక వెళ్తాను నువ్వు నీ భార్య సంతోషంగా ఉండండి. కాని కాని నాకు ఇచ్చిన మాట మర్చిపోకు సరేనా 
సరి సరే గాని ఆగు నీ బట్టలసంచి 
ఇస్తాను .....అంటూ గది లొపలకి వేల్లభోయాడు , ఇంతలో గడప తన కాలికి తగిలింది అమ్మ అని బాధతో గట్టిగ అరిచాడు
అది చుసిన వాల్లమ్మ నవ్వుకుంటూ అక్కడనించి వెళ్ళిపోయింది
నీతి ......
అమ్మ ఆనే ఫధం కేవలం మన పెదాల మీదనే కాదు మన మన మనసులొనె ముద్రించాడు ఆ దేవుడు. అమ్మ అని అనకుండా ఉండటం ఆ దేవుని వల్ల కుడా కాదు మానవమాత్రులం మనమెంత .
ఒక కొడుకు తన తల్లి తో ఇలా 
అన్నాడు . అమ్మనువ్వు నన్ను 
నీ కోడlలుని చాలా ఇబ్బందిపెడుతున్నావు .నిన్ను చూస్తుంటే 
నాకు చిరాకొస్తుంది రోజు మీ ఇద్దరకి ఏదో గొడవ జరుగుతూనెఉన్నది ఇంట్లో 
మనశాంతి లేకుండాపోయింది నేను సంతోషం గా ఉండాలంటే నువ్వు మాకు దూరంగా ఉండటమే మంచిది అనిపిస్తుంది అందుకే నిన్ను బాగా చూసుకొనే ఆశ్రమం ఒకటుంది వాళ్ళకి నేను విరాళం బాగా ఇచ్చను వాళ్ళు నిన్ను మహారాణి లా చూసుకొంటారు వెళ్తావా .............?
దానికి ఆ తల్లి ఇలా అంది 
నాయినా నీ పెళ్ళాం చెప్పిన మాటలు నమ్మి నన్ను వెళ్ళిపోమ్మంట్టునావు.వెళ్ళిపోతాను తప్పకుండ వెళ్ళిపొతాను 
కానీ వెళ్ళే ముందు ఓ చిన్న కోరిక తిర్చగలవా ......? ఆ కోరిక నువ్వు తిర్చితే జీవితం లొ నీకు మళ్ళి కనపడను
హ తీర్చగలను అమ్మ చెప్పు ఏం కావాలో చెప్పమ్మా చెప్పు ??????
అదే నువ్వు ఇప్పుడున్నావే అమ్మ అనే పధం నువ్వు ఎప్పుడు అనవద్దు .అమ్మ అని నువ్వు ఇక మీదట పలకనే కూడదు అలా చెయ్యగలవా ??
ఓసి ఇంతేనా ఇంకా నువ్వు ఏం ఆడుగుతావుఅనుకున్నాను .సరే ఇకనించి అమ్మ ఆనే పదం నా పెదాలు పలకవు సరేనా ....
సరే నేను ఇక వెళ్తాను నువ్వు నీ భార్య సంతోషంగా ఉండండి. కాని కాని నాకు ఇచ్చిన మాట మర్చిపోకు సరేనా 
సరి సరే గాని ఆగు నీ బట్టలసంచి 
ఇస్తాను .....అంటూ గది లొపలకి వేల్లభోయాడు , ఇంతలో గడప తన కాలికి తగిలింది అమ్మ అని బాధతో గట్టిగ అరిచాడు
అది చుసిన వాల్లమ్మ నవ్వుకుంటూ అక్కడనించి వెళ్ళిపోయింది
నీతి ......
అమ్మ ఆనే ఫధం కేవలం మన పెదాల మీదనే కాదు మన మన మనసులొనె ముద్రించాడు ఆ దేవుడు. అమ్మ అని అనకుండా ఉండటం ఆ దేవుని వల్ల కుడా కాదు మానవమాత్రులం మనమెంత .

Wednesday, December 31, 2014

ధర్మేచ, అర్థేచ, కామేచ, మోక్షేచ, నాతిచరామి..!! అని ప్రమాణాలు చేసుకొని ఒకటి అవుతున్నారు... మరి చిన్న చిన్న కారణాలకి ఎందుకు విడాకుల వరకు వెళుతున్నారు...!

ధర్మేచ, అర్థేచ, కామేచ, మోక్షేచ, నాతిచరామి..!!
అని ప్రమాణాలు చేసుకొని ఒకటి అవుతున్నారు...
మరి చిన్న చిన్న కారణాలకి ఎందుకు విడాకుల
వరకు వెళుతున్నారు...! 

నాలుగు గోడల మధ్య ఉండవలసిన భార్యా భర్తల
తగాదాలను సర్ది చెప్పే పెద్దవారితో కాకుండా,
అహంకారం కోసం ఆదిపత్యం కోసం ఆజ్యం పోసే వారితో పంచుకొని,
వారి సలహలు స్వీకరించి తమ జీవితాలను చేజేతుల నాశనం చేసుకోవడంతో పాటు, మనతోపాటే జీవితం అనుకున్న వారిని దుఖః సాగరంలో ముంచుతున్నారు...

ప్రపంచంలో ఏ రెండు గడియారాలు ఒకే సమయాన్ని చూపించవు,
అలాగే 100% ఒకే అభిప్రాయాలున్న
మనుషులు ఎవరు ఉండరు కాబట్టి ఇద్దరి మద్య బేధాలు సహజం..
కాని వాటిని సర్దుకొని పోవడంలోను, ఒకరినొకరు అర్థం చేసుకోవడంలోను,
అభిప్రాయాలను, భావాలను మరొకరు గౌరవించుకోవడంలోనే
ఆనందంకరమైన జీవితం ఉంది.. రెండు చేతులు కలిస్తేనే చప్పట్లు...
కాబట్టి ఒకరు మూర్ఖంగానో కోపంగానో
ఉన్నప్పుడు మరొకరు శాంతంగా ఉండగలిగితే చాలు భార్యా
భర్తల జీలితం సజావుగా సాగుతుంది.......