Wednesday, December 31, 2014

ధర్మేచ, అర్థేచ, కామేచ, మోక్షేచ, నాతిచరామి..!! అని ప్రమాణాలు చేసుకొని ఒకటి అవుతున్నారు... మరి చిన్న చిన్న కారణాలకి ఎందుకు విడాకుల వరకు వెళుతున్నారు...!

ధర్మేచ, అర్థేచ, కామేచ, మోక్షేచ, నాతిచరామి..!!
అని ప్రమాణాలు చేసుకొని ఒకటి అవుతున్నారు...
మరి చిన్న చిన్న కారణాలకి ఎందుకు విడాకుల
వరకు వెళుతున్నారు...! 

నాలుగు గోడల మధ్య ఉండవలసిన భార్యా భర్తల
తగాదాలను సర్ది చెప్పే పెద్దవారితో కాకుండా,
అహంకారం కోసం ఆదిపత్యం కోసం ఆజ్యం పోసే వారితో పంచుకొని,
వారి సలహలు స్వీకరించి తమ జీవితాలను చేజేతుల నాశనం చేసుకోవడంతో పాటు, మనతోపాటే జీవితం అనుకున్న వారిని దుఖః సాగరంలో ముంచుతున్నారు...

ప్రపంచంలో ఏ రెండు గడియారాలు ఒకే సమయాన్ని చూపించవు,
అలాగే 100% ఒకే అభిప్రాయాలున్న
మనుషులు ఎవరు ఉండరు కాబట్టి ఇద్దరి మద్య బేధాలు సహజం..
కాని వాటిని సర్దుకొని పోవడంలోను, ఒకరినొకరు అర్థం చేసుకోవడంలోను,
అభిప్రాయాలను, భావాలను మరొకరు గౌరవించుకోవడంలోనే
ఆనందంకరమైన జీవితం ఉంది.. రెండు చేతులు కలిస్తేనే చప్పట్లు...
కాబట్టి ఒకరు మూర్ఖంగానో కోపంగానో
ఉన్నప్పుడు మరొకరు శాంతంగా ఉండగలిగితే చాలు భార్యా
భర్తల జీలితం సజావుగా సాగుతుంది.......


స్త్రీల బాదల పట్ల స్పందించినంతగా పురుషుల పట్ల అటు సమాజం కానీ , ఇటు చట్టాలు కానీ స్పందించవు.
పురుషుడు పెట్టే హింస పైకి కనపడుతుంది కాబట్టి
స్త్రీలు దానిని చూపించి జాలీ, సాను భూతి పొందగలుగుతున్నారు. 
అదే పురుషులను స్త్రీలు పెట్టే హింస పైకి కనప
డదు. ఉదాహరణకు భర్తను రోజూ తిట్లతో లేక సనుగుడుతో సతాయించే పోరును తట్టుకోలేక ఒక దెబ్బ కొడితే , ఆ కొట్టిన దెబ్బ కనపడుతుంది.
కానీ వారం రోజులుగా సనుగుడుతో సతాయించిన స్త్రీ వేదింపు ఎవరిక్ కనపడుతుంది? స్త్రీలు బోరున ఏడ్చి తమలో ఏ మాత్రం స్ట్రెస్ లేకుండా చేసుకోగలుగుతారు. కానీ ఈ పురుష అహంకార సమాజం మగవాడిని ఏద్వనీయకుండా చేస్తుంది...

Saturday, December 13, 2014

వైవాహిక జీవితంలో స్నేహం పాత్ర

ఈ మధ్య యువత పెళ్లి చేసుకోడానికి చాలా ఆలోచిస్తున్నారు. అంతే కాక పెరుగుతున్న విద్యాధికుల శాతం పెరుగుతుంది. అంతే కాక వివాహ వయసు కూడా ముప్పైలకు చేరింది. ఒకప్పుడు పద్దెనిమిది ఇరవై ఏళ్ళకు పెళ్లిలు చేసేసే వారు కాని ఇప్పుడు తలిదండ్రులు కూడా ఆ నిర్ణయాన్ని పిల్లలకే వదిలేశారు.
పెళ్ళికి ఎక్కువమంది యువత సుముఖత చూపకపోవడం ఈ మధ్య మనం ఎక్కువగా చూస్తున్నాం. లివ్ ఇన్ రిలేషన్ షిప్ లాంటి పద్దతులు కలిసి బ్రతకడాలని హాయిగా భావిస్తున్న యువత పెళ్లి ప్రస్తావన వచ్చేప్పటికి ఎందుకు అంతగా ఆలోచిస్తున్నారు ?? చాలా సమాధానాలే చెప్తారు అడిగితే అయితే వాటిలో ముఖ్యంగా మనం గమనిస్తే వాళ్ళ స్వేచ్ఛను కోల్పోయే సంభావ్యత ఎక్కువగా ఉందనే ఆలోచన ఒకటైతే పెళ్లి కొత్తలో బాగా ఉండి పెళ్లి అయినతరువాత మారిపోయే భాగస్వాముల గూర్చి తమ మిత్రులు అప్పటికే పెళ్ళయిన స్నేహితులు చెబుతున్న మాటలు వినడం వల్ల ఏర్పరచుకునే భయం మరో కారణం అనుకోవచ్చు.
పెళ్లయ్యాక ఏవైనా మనస్పర్ధలు వచ్చినప్పుడు చాలా మంది ఫామిలీ కౌన్సిలర్ ల దగ్గరికి పరుగెత్తుతారు. ఫామిలీ కౌన్సిలర్లు కూడా భార్య భర్తల మధ్య స్నేహం శాతం అంచనా వేసి వాళ్లకి ముందు స్నేహితులుగా ఉండమనే సలహానిచ్చి పంపుతున్నారు. ఏ వివాహమైతే స్నేహపు పునాదులపై నిర్మించబడుతుందో అది ఫలభరితమైనదై ఉంటుంది అని రుజువు కాబడ్డది.
వైవాహిక జీవితంలో దంపతుల మధ్య స్నేహం ప్రధాన పాత్ర పోషిస్తున్నప్పుడు ఇదో ఇలాంటి లాభాలను మనం చూస్తాం .
1. Friendship creates fun: దాంపత్య జీవితంలో మనం ఎంచుకునే భాగస్వామి మనతో స్నేహంగా ఉండేప్పుడు వాళ్ళ మాటల ద్వారా వాళ్ళ చేతలలోని దగ్గర తనం ద్వారా లేదంటే అన్యోయత ప్రతిబింబించే మనస్తత్వాన్ని కలిగి ఉండేలా స్నేహం ఉపయోగపడుతుంది. పెళ్ళికి ముందు మీ భాగస్వామిని మిమ్మల్ని ఎలా నవ్విస్తూ ఆహ్లాదంగా ఉండగలిగే పరిస్తితులు కలుగజేసారో లెక్కబెట్టుకోండి.
2. Communication is easier: భార్యా భర్తల మధ్య సంభాషణ సులభతరం అవడానికి స్నేహం చాలా ఉపకరిస్తుంది. మన కుటుంబాలలోనే , బంధువులు, స్నేహితుల లోనే మనం చూస్తాం పెళ్లవ్వగానే మారిపోయి భాద్యతలన్నీ మోస్తున్నట్టు ప్రవర్తిస్తూ తమ భాగస్వామి చెప్పే మాటలకు కొంచెం కూడా సమయమివ్వని వాళ్ళను ఏదో ఒక responsibility గా ఫీల్ అయ్యి ఉదయం మధ్యాహ్నం రాత్రుళ్ళు గుర్తుపెట్టుకుని భోజనం అయ్యిందా ?? పిల్లలెలా ఉన్నారు అన్న మాటలు మాత్రం అడిగి సమాధానం వచ్చాక సాంతం మాట్లాడకుండా వారి పనుల్లో వారు బిజీగా ఉండే భర్తలు ... ఇంట్లో పనంతా నేనే చేస్తున్నా అన్న భావనతోనో , తనను పట్టించుకోవడం లేదు అన్న నిరుత్సాహంతోనో భర్త ఏదడిగినా అలకలకు పోతూ పొడి పొడి మాటలు చెప్పే భార్యల ప్రవర్తన
భర్తలను మాట్లాడకుండా చేయడం లాంటివి సంభాషణను కట్ చెస్తాయి. అలా సంభాషణ వంతెన ఇద్దరి మధ్య తెగిపోయినప్పుడు అన్యోయతకి బదులు అపోహలు చోటు చేసుకుంటాయి . అందుకే వాళ్ళు స్నేహంగా ఉన్నప్పుడు ఈ సంభాషణ బలపడే అవకాశాలు అపోహలు దూరం చేసుకునేందుకు ఉపయోగపడతాయి. his means no secrets and no lies. This builds trust which is an important element of any relationship.
3. You will never be lonely: స్నేహం తో కూడిన దాంపత్య జీవితం భార్యని గాని భర్తను గాని ఒంటరిగా ఫీల్ అయ్యేలా చెయ్యదు. There is always someone special to share beautiful things and sorrows with you. You are around someone with whom you can be yourself and pour your heart out any time you want. So develop a beautiful friendship out of your marriage and you will never have to live alone.
4. Makes your life richer: స్నేహం మీ కుటుంబ జీవన విధానాన్ని , భార్యా భర్తల మధ్య అన్యోయతని పెంచి మిమ్మల్ని కుటుంబవిలువలు గల గొప్ప వారిగా ఆదర్శ దంపతులుగా నిలబడగలగడానికి ఉపయోగపడుతుంది.
ఇక ఎందుకు ఆలస్యం .. ఒకవేళ ఇప్పటికే పెళ్ళయి ఉంటె ఇక ముందు నుంచైనా మీ భార్యతోనో భర్తతోనో స్నేహంగా ఉండే ప్రయత్నం మొదలు పెట్టండి. లేదా పెళ్లి చేసుకోబోతున్న వారైతే మీ పార్టనర్ మీతో స్నేహంగా మెలగగలిగే పరిస్థితులను సంభాషణను సృష్టించుకుని స్నేహపూర్వక కుటుంభ జీవన విధానంలోకి అడుగుపెట్టండి.

Thursday, December 11, 2014

॥ పవిత్ర బంధానికి / పండంటి కాపురానికి - పన్నెండు సూత్రాలు॥

శ్రీరస్తూ శుభమస్తూ !!!
ఒకప్పుడు arranged marriages ఎక్కువగా ఉండేవి. ఇప్పుడు ప్రేమ పెళ్ళిళ్ళు ఎక్కువ అవుతున్నాయి. పెళ్ళికి ముందు అబ్బాయి అయినా అమ్మాయి అయినా ఒకలా జీవిస్తారు. ఎలా నడుచుకున్నా తల్లిదండ్రులు భరిస్తారు, బుజ్జగించుకుంటారు, భయపెడతారు, నాలుగు తిట్లు తిట్టి మన ఆలోచనలతో పాటు మనల్నీ సరైన దారిలో పెడతారు. అదే భావం మన తోడబుట్టిన వాళ్ళతో ఉండదు. వారితో మనం ప్రేమగా ఉన్నా, కీచులాటలు, పోట్లాటలు, అసూయలు అవ్వి కూడా చాలానే ఉంటూ ఉంటాయి. కొన్ని కుటుంబాలలో ఎక్కువ, మరి కొందరి విషయాల్లో తక్కువ. ఇక్కడ ఈ వ్యత్యాసం మన age difference వల్ల వస్తుంది. అమ్మ నాన్న అంటే గౌరవం ప్లస్ ఒక జనరేషన్ ముందు వారు కాబట్టి, ప్లస్ మనకి నమ్మకం... వారు మన మంచికే చెబుతారు అని. వినడం వినకపోవడం మన మీదనే ఆధార పడి వుంటుంది. అదే మన తోబోట్టువు అయితే? ఇంచు మించు ఒకే వయసు కాబట్టి ప్రేమ ఆప్యాయతలతో బాటు ఈర్హ్స్యా అసూయలు, చిన్ని చిన్ని గిల్లికజ్జాలు, పోట్లాటలు, ఒకొర్నకరు పోల్చుకోడాలు సహజం.
ఇప్పుడు అసలు topicకి వద్దాం. పెళ్లి అయ్యాక జంటల పరిస్థితి ఎలా ఉంటుందో. ఇక్కడ కూడా భార్యా భర్తలిద్దరూ ఇంచుమించు ఒక వయసు పరిధిలోని వారే. సో మన తోబోట్టువులతో ఉండే problems ఇక్కడా ఉంటాయి. ఇక పోతే major difference ఎక్కడా అంటే, వారిద్దరి పెంపకం, ఇంట్లో అలవాట్లు, పెరిగిన వాతావరణం, చుట్టూ ఉన్న ఆత్మీయుల, బంధువుల ఆచార వ్యవహారాలూ, వారితో అనుబంధాలు, etc. మరి అలాంటప్పుడు భార్య భర్తలిద్దరి బంధం అన్ని బంధాల కంటే కూడా చాలా సెన్సిటివ్ అంటే సుకుమారమైనది అని గ్రహించాలి. Completely ఒక వేరే గ్రహం నుండి ఇంకో గ్రహానికి వచ్చినట్టు భావించాలి. ఇది ప్రేమించి పెళ్లి చేసుకున్నా వర్తిస్తుంది, పెద్దలు కుదిర్చిన పెళ్లికైనా వర్తిస్తుంది. మనం ఒకరి ఆలోచనలను, వ్యక్తిత్వాన్ని అలవాట్లను గౌరవించనపుడు ఇబ్బందులు మొదలవుతాయి. పెళ్లి అయిన వెంటనే తల్లిదండ్రుల ప్రమేయాలు, పెళ్ళిలో ఆచరించలేదని చెప్పే ఏవో సాకులు, మా అమ్మాయో అబ్బాయో తన భార్య లేక భర్తకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారనే insecured feeling వల్లనో బేధాభిప్రాయాలు తప్పకుండా వస్తాయి. అక్కడే అసలైన చిక్కు. ఇవన్ని చినికి చినికి గాలి వానయ్యి చివరికి పోట్లాటలకి దారి తీస్తాయి. ఇక అక్కడి నుండి మొదలండి అహంభావం, ఆత్మనూన్యత , అబద్రతాభావం, అపార్ధాలు, miscommunication, etc, etc
ఇలాంటివి మొదటి సారి అనుభవంలోకి వస్తాయి కాబట్టి ఒకోసారి ఎలా స్పందించాలో తెలియక, మన మిడిమిడి జ్ఞానంతోనో, స్నేహితుల అనుభవాలతోనో, లేక వాళ్ళ కోణంలో నుండి చూసి ఆలోచించే మన తల్లిదండ్రులతోనో, తోబుట్టువులతోనో, చుట్టాలతోనో చర్చించి మనం స్పందిస్తాము. చాలా మట్టుకు ఇదే పధ్ధతి పాటిస్తారు కొత్త దంపతులంతా. అది సరైన పధ్ధతి కాదు. ఎందుకంటే వాళ్ళు ఎదుర్కొన్న సందర్భాలు వేరు, ఆలోచనలు, వ్యవహారాలూ అన్నీ వేరు. ప్రతి గుండెకి ఒక కథ ఉన్నట్టే, ప్రతి జంటకి ఒకో problem ఒకో విధంగా ఉంటుంది. అన్నిటికి ఒకే మంత్రం, ఒకే మందు అంటే ఎలా? రోగిని చూసి, రోగాన్ని పరికించి మందో మాకో, మంత్రమో తంత్రమో వెయ్యాలి. దంపతుల విషయంలోనూ అంతే. ఒకోజంటకి ఒకో పద్ధతి.
మొదటి సంవత్సరం చాలా కష్టపడాలి భార్యా భర్తలిద్దరూ. ఈ మొదటి సంవత్సరంలోనే ఉంటుంది అసలు మసాలా అంతా. అన్ని అడ్డంకులు ఎదుర్కొని, ఒకరినొకరు అర్ధం చేసుకోవడానికి సమయం ఇచ్చుకొని, ప్రతి సామరస్యంగా పరిష్కారాలు వెతుక్కొన్నాకనే, భవిష్యత్తులో అన్యోన్యతకి అంకురార్పణ అప్పుడు జరుగుతుంది. ఇప్పటి స్థితిని బట్టి ఏ నిర్ణయాలు తీసుకోవద్దు. మనం ఆలోచించాల్సింది ఒక్కటే. భార్యా భర్తలిద్దరూ ఎప్పటికీ అన్యోన్యంగా ఉండడం. అదే మన డెస్టినీ, మన గమ్యం. అందుకు అందరిని, అన్ని పరిస్థితులని ఎదుర్కోవాలి.
1. ముందు ఇద్దరు ఒక్కటి కాదు, వేరు వేరు అని గ్రహించాలి. ప్రేమతోనే ఒకరిని ఒకరు అన్ని విషయాలు అడిగి తెలుసుకోవాలి వాటిల్లో. ఎవరు ఏయే పనులు చూసుకోవాలి ఇంట్లో. ఇద్దరూ ఉద్యోగస్తులైతే, ఎవరు దేనికి ఖర్చు పెట్టాలి అని సీరియస్ గా కాదండోయ్.... నవ్వుతూ వర్క్ అండ్ మనీని విభజించుకోవాలి. మానవులం కదా, మతిమరుపు సహజం. సో డివిజన్ అఫ్ వర్క్ అండ్ మనీ రాసి పెట్టుకోవడం బెటర్.
2. తరువాత భార్యాభర్తలిద్దరూ సమానం అన్న విషయం గ్రహించాలి. భర్త మగవాడు, కాబట్టి తానే గొప్ప అనో. భార్య కట్నం తెచ్చింది, భర్త కంటే నాలుగాకులు ఎక్కువ చదివింది కాబట్టి తానే గొప్ప అనో అన్న అపోహలు మానుకోవాలి. ఎవరి జీతం ఎక్కువైతే ఏంటి? ఎవరి చదువు, అనుభవం ఎక్కువయితే ఏంటి? మనిషి మనిషికీ వ్యత్యాసం ఉండడం సహజం. మన అమ్మా నాన్న కాలం కాదు ఇది. మారుతున్న కాలాన్ని బట్టి మనం కూడా మారాలి. మన తోటి మానవులంతా సమానమే అన్న దృక్పథాన్ని అలవర్చుకొని నరనరాల్లో జీర్ణింపచేసుకోవాలి.
3. ఒకరినొకరు ముందు గౌరవించుకోవాలి. మీ భాగస్వామి ఇష్టాయిష్టాలని గౌరవించండి, వారి వృత్తిని గౌరవించండి. వారి తలిదండ్రులని, బంధువులని, స్నేహితులని గౌరవించండి. వారు ఇంటికొస్తే ఎందుకు వచ్చారురా బాబు అనుకోకుండా మీ వంతు సహాయం మీ భాగస్వామికి అందివ్వండి. మీ చుట్టాలుగా మీరిద్దరూ కలిసి ప్రవర్తించండి. వారిలో ఏ విషయమైనా నచ్చకపోతే, పోట్లాడకుండా ఇద్దరు చర్చించుకోండి. సమస్యకి పరిష్కారం ఆలోచించుకోండి.
4. ప్రతి ఒక్కరికి అలవాట్లు తప్పకుండా ఉంటాయి. మీ భాగస్వామి ఏదైనా చెబితే విసురుగా కాకుండా నమ్రతగా వినండి. మంచి అలవాట్లను కొత్తగా మనం పాటిస్తే తప్పులేదుగా. చెడ్డ అలవాట్లను వదులుకుంటే మంచిదే కదా. ఆచరించడం ఆచరించకపోవడం తరువాత విషయం. ఎవరి అలవాట్లు వాళ్ళవి. వారి అలవాట్ల వల్ల మీకు కాని మరెవరికైనా కాని ఇబ్బంది లేకపోతే పట్టించుకోకండి. ఎవరి అలవాట్లు వాళ్ళనే పాటించనివ్వండి. కొన్ని బుద్ధులు పుట్టకతో వచ్చినవి, పుల్లలేసినా పోవు. మరి ఈ విషయంలో దెబ్బలాటలు ఎందుకు? పెద్దమనసుతో వదిలెయ్యండి. అందరికి individuality కావాలి. నాకిష్టం వచ్చినట్లే ఉండాలి, ఇష్టం వచ్చినట్లే ప్రవర్తించాలి అన్న వితండ వాదం వదులుకోండి. ప్రేమ ఉంటే ఇలా ప్రవర్తించు అలా ప్రవర్తించు అని అడగక్ఖర్లేదు. వాళ్ళే మీకు అనుగుణంగా ప్రవర్తిస్తారు. మీ గౌరవించి ఇష్టపడడం మొదలు పెడతారు. కాని మీరు మిమ్మల్ని ప్రేమించనివ్వాలిగా. అంత space and time మీరు తనకి ఇవ్వాలి మరి.
5. వారి దుఃఖంలో ఓదార్పు మీరే కావాలి. వారి భయానికి మీరే ధైర్యం కావాలి. వారి నిస్సత్తువకి మీరే శక్తి కావాలి. వారి ఆలోచనకి మీరే ప్రేరణ కావాలి, వారికి తోడు నీడ, వారి నమ్మకం మీరే కావాలి. ఎప్పుడు వారిని మాటలతో, చేతలతో మోసం చెయ్యకండి. మీరు అనే మాట ముందు ప్రవర్తించే ముందు తనవైపు ఆలోచించి ముందడుగు వెయ్యండి.
6. పెళ్లి అవ్వగానే ప్రేమ అంతం కాదు. రోజు రోజుకి పెరిగేలా చూడండి. చిన్న చిన్న outings కి మీరిద్దరే వెళ్ళండి. మీ జీవిత భాగస్వామిని ఎప్పుడు స్నేహితులుగా చూడండి. మీరిద్దరూ ఏకాంతంగా గడపడానికి సమయం తీసుకోండి. అన్ని విషయాలు దాపరికం లేకుండా పంచుకోండి. కలిసి భోజనం చెయ్యండి, ఇంట్లో అత్తమామలో, మరుదులో, పిల్లలో ఉండి, తినే సమయాలు వేరే అయినా మీ ఇద్దరు కలిసి భుజించడం విషయంలో మాత్రం no reservations. ఈ విషయంలో ఎవ్వరు ఏమనుకున్నా పరవాలేదు. తరువాత అందరు మీ అన్యోన్యత గురించే చర్చించుకుంటారు, అసూయ పడితే పడతారు. That is their problem.
7. నవ్వు మహా ఔషదం. ఇల్లాలు వంటపని, ఆఫీసు ఉంటే ఆఫీసు పని, భర్త ఆఫీసు పనితో సతమతమయ్యి ముఖం వేల్లాడదీసుకొని ఇంట్లో ఉండకండి. ఫ్రెష్ అయ్యి నవ్వు మొహంతో మీ బెటర్ హాఫ్ కి కనపడండి. ఇదొక మాజిక్ టానిక్.
8. అహంభావాలు, పోల్చుకోవడాలు, చిన్న దెబ్బలాటలకే చెయ్యి చేసుకోవడాలు, తానూ మాట్లాడితే కాని నేను మాట్లాడను అనే పంతాలు, పట్టింపులు భార్య భర్తల బంధంలో పనికి రావు. ఇద్దరు ఒకోసారి అడ్జస్ట్ అవ్వాలి. ఎప్పుడు ఒకరి పంతమే నెగ్గితే, అది అనారోగ్య బంధమే.
9. చాల ముఖ్యమైన విషయం. భార్య భర్తల మధ్య మూడో వ్యక్తికి తావు ఇవ్వ కూడదు. వారు మీ తల్లిదండ్రులైనా, తోబోట్టువులైనా, ప్రాణ స్నేహితులైనా. మన జీవిత భాగస్వామి అతిగా ప్రవర్తిస్తే తప్పకుండా చెప్పుకోవాలి, కాని మన వాళ్ళ దగ్గర మాత్రమే. మనవాళ్ళు సలహా ఇస్తే వినండి, కాని వివేకంగా ఆలోచించి, సమయం సందర్భాన్ని బట్టి మీ నిర్ణయం మీరే తీసుకోండి. అత్తమామలను అమ్మా నాన్నా అని సంబోధించి చూడండి ఆప్యాయతలు పెరుగుతాయి. ఆడబిడ్డలతో, మరుదులు, మరదల్లతో, సోదరసోదరీ భావంతో మెలగండి. మూతివిరుపులు, చెవి కోరుక్కోవడాలు ఉండవు. అందరిని "నా కుటుంబం" అనుకోని ప్రవర్తించండి. అప్పుడు చుడండి "ది రియల్ వండర్స్ అఫ్ మారీడ్ లైఫ్".
10. ఎట్టి పరిస్థితుల్లోను మన జీవిత భాగ స్వామి ఎంత పెద్ద తప్పు చేసినా నలుగురిలో అవమాన పరచకండి, ముఖ్యంగా వారి తోబోట్టువుల దగ్గరో, మీ అమ్మానాన్నల దగ్గరో, తోటికోడలో, తోడల్లుడి దగ్గరో, పిల్లలముందో, స్నేహితులముందో. ఆ నాలుగు గోడల మధ్యే మీరు ఎం మాట్లాడుకున్నా, పోట్లాడుకున్నా. నలుగురికి మాత్రం మీ ఇద్దరు ఒక్కరే. మీ ఇద్దరిది ఒక్క మాటే. మీకు సంబంధించిన ఏ బాధాకరమైన, సంతోషకరమైన, ఏదైనా వార్తా, విషయం ఉంటె ముందు తెలపాల్సింది మీ జీవిత భాగ స్వామికే. తరువాతే మిగితా అందరు.
11. ముఖ్యంగా పక్కింటి పిన్ని గారో, ఆఫీస్ లో కొల్లీగ్ దగ్గరో ఇంట్లో విషయాలు అనవసరం. ప్రేమగా పలకరించిన వాళ్ళందరి దగ్గరా ఇంటి విషయాలు చర్చించుకోకూడదు. ఎంత అమ్మా నాన్న అయినా, ప్రాణ స్నేహితుడైనా, ఇంట్లో మీ భార్య / భర్త తరువాతనే అన్న విషయం గ్రహించండి.
12. ఈరోజుల్లో ముఖపుస్తకాల వంటి సోషల్ మీడియాల్లో పరిచయాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. అందరు ఎంతో ప్రేమగానే ఆప్యాయంగానే మాట్లాడతారు. ఇక్కడ పరిచయం అయిన వాళ్లకి ఇంటి విషయాలు అస్సలు చెప్పకూడదు. వారు ఎంతటి మహామహులైనా సరే, మీకు ఎంత దగ్గరైనా సరే. తరువాత వారి ముందు తల దించుకోవాల్సింది మీరే. ఇంట్లో గుట్టు బయట పెట్టినందుకు మూల్యం చెల్లించాల్సిందీ మీరే. సోషల్ మీడియాని మితంగా వాడండి. మీ సమయాన్ని మీ వాళ్ళతో ఎక్కువగా కేటాయించండి. వాళ్ళు మాత్రమే మీ వాళ్ళు. మీ జీవితం చరమాంకంలో తోడుగా ఉండేవాళ్ళు. ముందు మీరు మీ కుటుంబం, మీ స్నేహితులు, బంధువులు, తరువాతే మీ సోషల్ మీడియా మిత్రులు. ఇక్కడ మంచి చేసేవారికంటే, హితోక్తులు, మంచి మాటలు, నీతులు చెప్పే వాళ్ళే ఎక్కువ. అందరు మంచి మనుషుల్లానే ఉంటారు. మరి వారి వారి ఇంట్లో, మనస్తత్వాల్లో ఎట్లాంటివారో మనకి తెలియదు కదా. మంచి చెబితే వినడం వరకే. కాని అతి దేనిలోనూ పనికి రాదు. ఎవ్వరిని ఎంతలో ఉంచాలో అంతలోనే ఉంచండి. ఈ మధ్య విడాకులు, హత్యలు, మోసాలు, మానసిక రుగ్మతలు, నిద్రలేమి, etc వీటన్నిటికి ముఖ్య కారణం ది గ్రేట్ మాయ విశ్వం మన FB వంటి మాయా ప్రపంచం. సో తస్మాత్ జాగ్రత్త. ఇవి మీ జీవితభాగస్వామి పట్ల ప్రేమని తగ్గించడమే కాక దూరం కూడా చేస్తుంది
ఇవన్ని పెళ్లి మొదటి సంవత్సరంలో మీరు పాటిస్తే, మీ జీవితభాగస్వామిని అర్ధం చేసుకోవడానికి ప్రయత్నిస్తే, మీ జీవితం ఒక గమనాన్ని ఏర్పరుచుకుంటుంది. మీ ఇద్దరి జీవితాలతో పాటు మీ చుట్టూ వున్నా వారి జీవితం కూడా ఆనందంగా ఉంటుంది. అప్పుడే మీరు నలుగురికి ఆదర్శంగా నిలిచి, ఆదర్శ దంపతులవుతారు.
----------------సర్వే జనః సుఖినోభవంతు----------------
-...

నమ్మకం

ఒక వ్యక్తి తన జుట్టు సమంగా కత్తిరించుకోవడానికి క్షవరసాలకి వెళ్లాడు. అక్కడ మంగలి, పని మొదలుపెట్టగానే ఇద్దరూ చాలా విషయాలు మాట్లాడుకోవడం ప్రారంభించారు. భగవంతుడి గురించి మాట్లాడడం మొదలుపెట్టేసరికి, మంగలి"నాకు భగవంతుడు ఉన్నాడు అని నమ్మకం లేదు" అన్నాడు.
"ఎందుకు అలా అంటున్నావు"అని ఆ వ్యక్తి ఆడిగాడు.
మంగలి ఇచ్చిన సమాధానం." బైటకి వెళ్ళి చూస్తే, భగవంతుడు ఉన్నాడు అని నమ్మకం కలగదు. నిజంగానే భగవంతుడు ఉంటే, ఎందుకు మనుషులు సుస్తీతో బాధ పడుతున్నారు? ఇంతమంది అనాధపిల్లలు ఉంటారా? ఎవరయినా బాధ పడతారా? నిజంగా భగవంతుడికి ప్రేమ ఉంటే ఇవన్నీ చుస్తూ ఊరుకుంటాడా?
ఆ వ్యక్తి కాసేపు ఆలోచించి, ఏమీ సమాధానం చెప్పలేదు. అనవసరంగా వాదన చేయడం ఇష్టం లేక. మంగలి పని ముగించగానే, ఆ వ్యక్తి బయటికి వెళ్ళిపోయాడు. రోడ్డు మీద
ఒక మనిషిని చూసాడు. పొడుగు జుట్టుతో సమంగా కత్తిరిచుకోకుండా, చూడడానికి అసహ్యంగా ఉన్నాడు. అప్పుడు, ఆ వెంటనే, మంగలి కొట్టుకి వెళ్ళి ఇలా అన్నాడు. "నీకు తెలుసా, మంగలి ఉన్నాడు అని నాకు నమ్మకం లేదు"
అప్పుడు, మంగలి, "అలా ఎలా అనగలువు, నేను ఇప్పుడే నీకు పని చేశాను కదా"
అప్పుడు ఆ వ్యక్తి ఇలా అన్నాడు, "నిజంగానే మంగలి ఉంటే, బయట ఆ మనిషి అలా, అంత జుట్టుతో అసహ్యంగా ఉండడు."
అప్పుడు మంగలి "నా దగ్గరికి రాకపోతే నేను ఏమి చేయ గలను" అని అన్నాడు.
దానికి ఆ వ్యక్తి, "మనుషులు భగవంతుడి సహాయం కోసం, దగ్గరికి వెళ్ళాలి. ఎప్పుడు అయితే భగవంతుడికి దగ్గర అవుతామో ,అప్పుడు సంతోషంగా ఉంటాము. భగవంతుడు ఉన్నాడు."
నీతి:
------
భగవంతుడు కావాలి అని అనుకునే వాడికి, భగవంతుడు తప్పకుండా ఉంటాడు. భగవంతుడు ఎక్కడ లేడు? నీ మొహంలో చిరునవ్వు, ఎదుటి వాడు బాధ పడుతుంటే జాలి చూపించటం, మన దగ్గర వాళ్ళకి ప్రేమగా ఉండడం,అన్ని కూడా, భగవంతుడు మనలో ఉండి చేయిస్తున్నాడు. భగవంతుడి కోసం మన హృదయంలో దృష్టి పెడితే నవ్వుతూ
కనిపిస్తాడు.