Friday, November 6, 2015

" వివాహం అంటే ఒకే వ్యక్తితో చాలాసార్లు ప్రేమలో పడటం....."


*********************************************************
కొత్త కాపురాన్ని చూడటానికి వచ్చిన తండ్రిని బీచ్‌కి తీసుకెళ్ళాడు కొడుకు. 
అతడి భార్య కూడా వారితో వచ్చింది. ముగ్గురూ ఇసుకలో కూర్చుని మాట్లాడుకుంటున్నారు.
దూరంగా కొంత మంది పిల్లలు తడి ఇసుకతో ఇళ్ళు కట్టుకుంటున్నారు.
"ఎలా ఉంది కొత్త సంసారం?" అని అడిగాడు తండ్రి.
కొడుకు మాట్లాడలేదు. కోడలు మొహమాటంగా నవ్వింది.
ఇంతలో దూరంగా పిల్లల మధ్య గొడవ మొదలయింది. అందులో ఒక కుర్రవాడు పక్కవాడి గూటి మీద కాలు వేయటంతో ఆ ఇసుక ఇల్లు నేలమట్టం అయింది. మిగతావాళ్ళు అందరూ కలిసి వాణ్ణి కొట్టబోయారు. పెద్దలు వచ్చి వాళ్ళను విడిపించి సర్ది చెప్పారు.
“…నిన్న రాత్రి చాలాసేపు మీరు ఏదో విషయంలో గొడవ పడుతున్నారు.
అర్ధరాత్రి వరకూ మీ మాటలు నాకు వినిపిస్తూనే ఉన్నాయి” తండ్రి అన్నాడు.
"అబ్బే అదేo లేదు మామయ్యగారూ" అంది కోడలు.
ఆయన నవ్వేడు. "మీకన్నా పాతికేళ్ళు పెద్దవాణ్ణి. నా దగ్గర దాచవద్దు.
ఏ విషయంలో జరిగింది గొడవ?"
"నా కంప్యూటర్ ముట్టుకోవద్దని చెబుతూనే ఉంటాను. తనకి లాప్‌టాప్ ఉంది కదా. అనవసరంగా నా దాన్ని కెలుకుతూ ఉంటుంది. ఎంతో కష్టపడి తయారు చేసుకున్న ఫైలు మొన్న డిలిట్ అయిపోయింది" నిష్ఠూరంగా అన్నాడు కొడుకు.
కోడలు వెంటనే "ఎంతో నీట్‌గా సర్దుకున్న నా షెల్ఫ్‌లో బట్టలన్నీ మొన్న మీరు చిందర వందర చేయలేదా? అయినా మీ వాచీ నా పట్టుచీరల మధ్యన ఎందుకుంటుంది?" అంది కోపంగా.
"పట్టుచీరలు చిందరవందర చేయటం, కంప్యూటర్‌లో ఫైలు డిలిట్ చేయటం ఒకటేనా?" అన్నాడు మరింత కోపంగా కొడుకు.
ముసలాయన నవ్వాడు. "నిన్న కూడా మీరు మొదట్లో చిన్న స్వరంతోనే మాట్లాడుకొని, ఆవేశం పెరిగాక పక్క గదిలో నేనున్నానని కూడా మర్చిపోయి నాకు వినిపించేంత గట్టిగా మాట్లాడుకున్నారు."
ఇద్దరూ సిగ్గుతో తలదించుకున్నారు. ఈలోపు అప్పటి వరకూ ఆడుకుంటూన్న పిల్లలు అక్కడ నుండి వెళ్ళిపోయారు. పెద్దాయన అటే చూస్తూ "ఆ పిల్లలు కొట్టుకోవడం చూశారు కదా. మీకేమైనా అర్థం అయిందా?" అని అడిగాడు.
అర్థం కానట్టు చూశారు ఇద్దరూ.
“ఎలాగూ కూలిపోయే ఇసుక గూళ్ళ కోసం, పిల్లలందరూ కొట్టుకున్నారు. చీకటి పడేసరికి, గూళ్ళని అలాగే వదిలేసి వెళ్ళిపోయారు. మన జీవితాలు కూడా అంతే.
కొంతకాలం బ్రతుకుతాం. ఆపై అన్నీ వదిలేసి వెళ్ళిపోతాం. ఈ కొద్దికాలం ‘ఎంత సంతోషంగా ఉండాలి? ఎలా సంతోషంగా ఉండాలి’ అని ఆలోచించాలి తప్ప, డెలీటయిపోయిన ఫైళ్ళ కోసం, నలిగిపోయిన పట్టు చీరల కోసం కొట్టుకుని మనసులూ, జీవితాలూ పాడుచేసుకోకూడదు."
" వివాహం అంటే ఒకే వ్యక్తితో చాలాసార్లు ప్రేమలో పడటం....."

Thursday, October 29, 2015




ప్రయాణికులతో పూర్తిగా నిండి , రద్దీగా ఉన్న విమానంలోకి ఒక అందమైన ప్రయాణికురాలు ప్రవేశించి తన సీటు కోసం వెతుకసాగింది. రెండు చేతులు లేని ఒక వ్యక్తి ప్రక్క తన సీటు ఉండడాన్ని చూసి, అతని ప్రక్కన కూర్చోవడానికి సందేహించింది. ఆ "అందమైన స్త్రీ "ఎయిర్ హోస్టెస్ ను పిలిచి .. " నేను ఇక్కడ కూర్చుని సుఖంగా ప్రయాణం చేయలేను. నా సీటును మార్చగలరా?'' అని అడిగింది. "మేడమ్! దయచేసి కారణం తెలుసుకోవచ్చా?" అడిగింది ఎయిర్ హోస్టెస్. " ఇలాంటి వారంటే నాకు పరమఅసహ్యం.వీరి ప్రక్కన కూర్చుండి ప్రయాణించడం నాకు ఇష్టం ఉండదు." అంది ఆ అందమైన స్త్రీ. చూడడానికి హుందాగా - అందంగా - నాగరికంగా కనిపిస్తున్న ఆమె నోటి నుండి వచ్చిన ఈ మాటలను విని ఎయిర్ హోస్టెస్ చాలా ఆశ్చర్యపోయి చూసింది. ఆ అందమైన స్త్రీ మళ్లి తనకు "ఈ సీటు వద్దు. మరో సీటు కావాలని డిమాండ్ చేసింది." "కొద్దిసేపు ఓపిక పట్టండి. నేను మీకోరికను నెరవేర్చే ప్రయత్నం చేస్తాను." అని ఎయిర్ హోస్టెస్ ఎక్కడైనా సీటు ఖాళిగా ఉందేమోనని వెతికింది. కాని ఎక్కడా దొరకలేదు. కొంత మంది ప్రయాణికులను సీటు ఎక్చేంజ్ కోసం మర్యాదగా అడిగి చూసింది.కాని, రూపం అందంగా ఉన్నా మనసు అందవిహీనమైన ఆమె ప్రక్కన కూర్చుని ప్రయాణించడానికి ఎవరూ ఓప్పుకోలేదు. ఆ ఎయిర్ హోస్టెస్ తిరిగి వచ్చి "మేడమ్! ఈ ఎకనామి క్లాస్ లోని సీట్లన్నీ పూర్తిగా నిండిపోయాయి. అయినా మా విమానంలో ప్రయాణించే వ్యక్తుల కంఫర్ట్ కోసం పూర్తి స్థాయిలో ప్రయత్నించడం మా ఫాలసి. కెప్టెన్తో మాట్లాడి వచ్చి చెబుతాను కాస్త ఓపిక పట్టండి." అంటూ కెప్టెన్ దగ్గరికి వెళ్లింది. కొన్ని క్షణాల తరువాత తిరిగి వచ్చి " మేడమ్! మీకు కలిగిన అసౌఖర్యానికి చింతిస్తున్నాము. ఈ విమానం మొత్తంలో ఫస్ట్ క్లాసులోని ఒకే ఒక సీటు ఖాళిగా ఉంది.మావాళ్లతో మాట్లాడి ఒక అసాధారణమైన నిర్ణయం తీసుకున్నాము. ఒక ఎకనామి క్లాస్ లోని వ్యక్తిని ఫస్ట్ క్లాసులోకి పంపడం మా కంపని చరిత్రలోనే మొదటిసారి.ఇక మీరొక్కరే ఆనందంగా ప్రయాణం చేయండి!" ఆ అందమైన స్త్రీ ఆనందంగా ఏదో చెప్పబోయే లోపల .... ఎయిర్ హోస్టెస్ సీట్లో కూర్చున్న వ్యక్తితో... " సార్! దయచేసి ఎకనామి క్లాస్ నుండి ఫస్ట్ క్లాసులోకి రాగలరా? ఒక హృదయం లేని వ్యక్తి ప్రక్క, సంస్కారం తెలియని వ్యక్తి ప్రక్కన కూర్చుండి ప్రయాణించవలసిన దురదృష్టాన్ని మేము తప్పించాలనుకుంటున్నాము." అంది. ఎయిర్ హోస్టెస్ మాటలను విన్న మిగతా ప్రయాణికులందరూ గట్టిగా చప్పట్లు చరుస్తూ ఆ నిర్ణయాన్ని స్వాగతించసాగారు. ఆ అందమైన స్త్రీ ముఖం పాలిపోయింది. అప్పుడా వ్యక్తి లేచి నిలుచుని ... "నేనొక మాజి సైనికుడిని.కార్గిల్ యుద్ధంలో జరిగిన బాంబ్ బ్లాస్ట్ లో నా రెండు చేతులను కోల్పోయాను. మొదట ఈమె మాటలు విన్న తరువాత 'ఇలాంటి వాళ్ల కోసమా మా జీవితాన్ని ఫణంగా పెట్టింది.' అనిపించింది. కాని, మీ అందరి ప్రతిస్పందన చూశాకా దేశం కోసం నా రెండు చేతులను కోల్పోయినందుకు గర్వపడుతున్నాను." అని ఆ వ్యక్తి అందమైన స్త్రీ వైపు తిరిగి "అమ్మా ! నీ అందమైన మొఖానికి కొద్దిగా అందమైన హృదయం అనే పౌడర్ ను కూడా అద్దుకో తల్లి!" అంటూ ప్రయాణికుల చప్పట్ల మధ్య ఫస్ట్ క్లాసులోకి వెళ్లిపోయాడు. ఆ అందమైన స్త్రీ రెండు సీట్లలోనూ ఒక్కతే సిగ్గుతో కూలబడిపోయింది...........

Sunday, October 25, 2015

Dear All దయచేసి చదవండి...చేయడానికి ప్రయత్నించండి..............

దయచేసి చదవండి...చేయడానికి
ప్రయత్నించండి..............
ఎండాకాలంలో అనేకరకాలైన పండ్లు
దొరుకుతుంటాయి కదా! మామిడి
పండ్లు......నేరేడు పండ్లు....
పనస పండ్లు మొదలైనవి. నా మనవి
ఒక్కటే.........దయచేసి మీరు ఈ పండ్లను
తిన్న తరువాత
వాటి విత్తనాలను బయట పడేయకండి.....వాటిని
శుభ్రంగా కడిగి ఓ బ్యాగులో వుంచండి......వీలైతే
మీ కారులో కానీ......మీ వాహనాలు ఏవైనా
కానివ్వండి అందులో ఉంచండి.......
మీరు కాస్త దూరం ప్రయాణం చేసేటప్పుడు
మీరు వెళ్ళే దారిలో రోడ్డుకు పక్కగా ఈ
విత్తనాలను చల్లండి,,
ఎండాకాలం తరువాత వర్షాకాలం వస్తుంది
కదా! మీరు చల్లిన విత్తనాల్లో కొన్నైనా
మొలకెత్తుతాయి..
ఒక్క మొక్క మొలిచినా అది పెరిగి పెద్దదై
చెట్టుగా మారి ఫలాలనిస్తుంది........మీ
భావితరానికి మీ వల్ల ఒక్క చెట్టైనా ఇచ్చిన వారు
అవుతారు..
ఇది ఒక ఆలోచన మాత్రమే కాదు........మహారాష్ట్రాలోని సతారా.......రత్నగిరి ప్రాంతాలలో
దీన్ని అమలు చేస్తూ మంచి ఫలితాలను....ప్రజలలో అవగాహనను పెంచుతున్నారు పది సంవత్సరాలనుండి.
చాలా అద్భుతమైన ఆలోచనకదా! మనం కూడా
దీన్ని అమలు చేద్దామా మిత్రమా!
మీరు ఈ విషయాన్ని మీ ఫ్రెండ్స్కు షేర్చేయండి......వీలైతే మీరూ పాటించండి......
భావితరానికి మనమూ ఓ చెట్టును అందించినవారమవుదo.

విమానం లో భోజనం .

నా సీట్ లో కూర్చున్నాను. ఢిల్లీ నుంచి ఆరేడు గంటల ప్రయాణం . మంచి పుస్తకం చదువుకోవడం , ఒక గంట నిద్ర పోవడం --- ఇవీ నా ప్రయాణం లో నేను చేయ్యాలనుకున్నవి . 
సరిగ్గా టెక్ ఆఫ్ కి ముందు నా చుట్టూ ఉన్న అన్ని సీట్ల లోనూ సైనికులు కొందరు వచ్చి ఆక్రమించుకున్నారు . అన్నీ నిండి పోయాయి . కాలక్షేపంగా ఉంటుంది అని పక్కన కూర్చున్న అతడిని అడిగాను . " ఎక్కడకి వెడుతున్నారు ?" అని 
" ఆగ్రా సర్ ! అక్కడ రెండు వారాలు శిక్షణ తర్వాత ఆపరేషన్ కి పంపిస్తారు " అన్నాడు అతను .
ఒక గంట గడిచింది . అనౌన్సమెంట్ వినబడింది . కావలసిన వారు డబ్బులు చెల్లించి లంచ్ చేయవచ్చు అని . సరే ఇంకా చాలా టైం గడపాలి అని లంచ్ చేస్తే ఓ పని అయిపోతుంది కదా అని అనిపించింది . నేను పర్సు తీసుకుని లంచ్ బుక్ చేద్దామనుకుంటూ అనుకుంటుండగా మాటలు వినిపించాయి 
.
" మనం కూడా లంచ్ చేద్దామా ?" అడిగాడు ఆ సైనికులలో ఒకరు 
" వద్దు ! వీళ్ళ లంచ్ ఖరీదు ఎక్కువ . సరుకు తక్కువ . విమానం దిగాక తిందాం లే ! " 
" సరే ! " 
నేను ఫ్లైట్ అటెండెంట్ దగ్గరకి వెళ్ళాను . ఆమెతో " వాళ్ళందరికీ కూడా లంచ్ ఇవ్వండి . " అని డబ్బులు మొత్తం పది లంచ్ లకి ఇచ్చాను . 
.
" ఆమె కళ్ళల్లో నీరు " నా తమ్ముడు కార్గిల్ లో ఉన్నాడు సర్ ! వాడికి మీరు భోజనం పెట్టినట్టు అనిపిస్తోంది సర్ ! " అంటూ నాచేతులు రెండూ పట్టుకుంది .
నేను నా సీట్ లోకి వచ్చి కూర్చున్నాను . 
అరగంటలో అందరికీ లంచ్ బాక్స్ లు ఇచ్చేసింది 
నేను భోజనం ముగించి విమానం వెనక్కి రెస్త్ రూం కి వెడుతున్నాను . 
వెనుక సీట్ లో నుండి ఒక ముసలాయన వచ్చాడు .
నేను అంతా గమనించాను . మీకు అభినందనలు . 
అందులో నాకూ భాగస్వామ్యం ఇవ్వండి అంటూ చేతిలో చేయి కలిపారు 
ఆ చేతిలో 500 రూపాయలు నా చేతికి తగిలాయి . మీ ఆనందం లో నా వంతు అన్నారాయన .
నేను వెనుకకు వచ్చేశాను . .నా సీట్ లో కూర్చున్నాను . ఒక అరగంట గడిచింది. విమానం పైలట్ సీట్ నెంబర్లు వెతుక్కుంటూ నా దగ్గరకి వచ్చాడు . నావేపు చూసి చిరునవ్వు నవ్వాడు . 
" మీకు షేక్ హ్యాండ్ ఇద్దామనుకుంటున్నాను అన్నాడు ." 
నేను సీట్ బెల్ట్ విప్పి లేచి నిలబడ్డాను . అతడు షేక్ హేండ్ ఇస్తూ " నేను గతం లో యుధ్ధవిమాన పిలట్ గా పనిచేశాను . అపుడు ఎవరో ఒకాయన మీలాగే నాకు భోజనం కొని పెట్టారు . అది మీలోని ప్రేమకు చిహ్నం . నేను దానిని మరువలేను " అన్నాడు 
విమానం లోని పాసింజర్లు చప్పట్లు కొట్టారు . నాకు కొంచెం సిగ్గు గా అనిపించింది . నేను చేసినది ఒక మంచి పని అని చేశాను అంతే కానీ నేను పొగడ్త కోసం చెయ్యలేదు . 
.
నేను లేచి కొంచెం ముందు సీట్ల వైపు వెళ్లాను . ఒక 18 సంవత్సరాల కుర్రాడు నా ముందు చెయ్యి చాపాడు . షేక్ హేండ్ ఇస్తూ ఒక నోటు పెట్టాడు . 
ప్రయాణం ముగిసింది .
.
నేను దిగడం కోసం డోర్ దగ్గర నిలబడ్డాను . ఒకాయన మాట్లాడకుండా నా జేబులో ఏదో పెట్టి వెళ్లి పోయాడు . ఇంకో నోటు 
.
నేను దిగి బయటకు వెల్లేలోగా నాతో పాటు దిగిన సైనికులు అందరూ ఒక చోట కలుసుకుంటున్నారు. నేను గబగబా వాళ్ళ దగ్గరకి వెళ్లాను నాకు విమానం లోపల తోటి పాసింజర్లు ఇచ్చిన నోట్లు జేబులో నుండి తీసి వాళ్ళకు ఇస్తూ " మీరు మీ ట్రైనింగ్ చోటుకి వెళ్ళే లోపులో ఈ డబ్బు మీకు సాండ్ విచ్ తినడానికి పనికి వస్తాయి . మీరు మాకిచ్చే రక్షణ తో పోలిస్తే ఏమి ఇచ్చినా తక్కువే ! మీరు ఈ దేశానికి చేస్తున్న పనికి మీకు ధన్య వాదాలు . భగవంతుడు మిమ్మల్ని , మీ కుటుంబాలనూ ప్రేమతో చూడు గాక ! " అన్నాను . నా కళ్ళలో చిరు తడి . 
.
ఆ పది మంది సైనికులు విమానం లోని అందరు ప్రయాణికుల ప్రేమను వాళ్ళతో తీసుకు వెడుతున్నారు . నేను నా కారు ఎక్కుతూ తమ జీవితాలను ఈ దేశం కోసం ఇచ్చేయ్యబోతున్న వారిని దీర్ఘాయువులుగా చూడు స్వామీ ! అని దేవుడిని కోరుకున్నాను. 
ఒక సైనికుడు అంటే 
తన జీవితాన్ని ఇండియా కు చెల్లించబడే బ్లాంక్ చెక్కు లాంటి వాడు . 
" బ్రతికినంత కాలమూ, జీవితాన్ని చెల్లించే ఖాళీ చెక్కు " 
.
వారి గొప్పతనాన్ని తెలియని ఎందఱో ఉన్నారు ఇంకా !
( shared from Soumendra Bandopadhyay )
అని శోభన్ రాయ్ గారు చెబితే ఆయన పోస్టును నేను అనువాదం చేశాను . 
మీరు షేర్ చేసినా సరే , కాపీ పేస్ట్ చేసినా సరే ! మీ ఇష్టం !

భగవంతుడే మనకు సహాయం చేశాడు

కారు ఆగిపోయింది . అందులోంచి దిగిన ఆమెకు 35 సంవత్సరాలు ఉంటాయి . దిగి చూసింది టైర్ పంక్చర్ అయ్యింది . స్టేఫినీ ఉంది కానీ తనకు వెయ్యడం రాదు . రోడ్డు పక్కకు తీసి సహాయం కోసం చూస్తోంది . ఒక్కరూ ఆగడం లేదు . సమయం చూస్తే సాయంత్రం ఆరు అవుతోంది . నెమ్మదిగా చీకట్లు కమ్ముకుంటున్నాయి . మనసులో ఆందోళన . ఒక్కర్తే ఉంది . తోడు ఎవరూ లేరు . చీకటి పడితే ఎలా ? 
దగ్గరలో ఇళ్ళు లేవు . సెల్ పనిచెయ్యడం లేదు ( సిగ్నల్స్ లేవు ) 
.
ఎవరూ కారునూ , పక్కనే నిలబడిన ఆమెనూ చూసినా ఆపడం లేదు . అప్పటికే దాదాపు ఒక గంట గడిచింది . ఎలారా దేవుడా అనుకుంటూ భయపడడం మొదలయ్యింది . చలి కూడా పెరుగుతోంది . 
.
అటుగా వెడుతున్న ఒక పాత కారు ముందుకు వెళ్లి పక్కకు తిప్పి వెనక్కు వచ్చింది . అందులో నుండి ఒక వ్యక్తి దిగాడు . అతడు ఈమె దగ్గరకు రావడం చూసింది . ఆమె బెదిరిపోతోంది . ఏమి జరుగుతుంది ఎందుకు వస్తున్నాడు ? ఏమి చేస్తాడు .? ఆందోళన !
.
అతను దగ్గరకి నవ్వుతూ వచ్చాడు ? టైర్ లో గాలి లేదని చూశాడు . ఆమె బెదిరిపోతోందని గ్రహించాడు .
" భయపడకండి . నేను మీకు సహాయం చెయ్యడానికి వచ్చాను . బాగా చలిగా ఉంది కదా ! మీరు కారులో కూర్చోండి . నేను స్టేఫినీ మారుస్తాను" అన్నాడు 
ఆమె భయపడుతూనే ఉంది .
" నా పేరు బ్రియాన్ అండెర్సన్ . ఇక్కడ దగ్గరలో మెకానిక్ షాప్ లో పని చేస్తాను " అన్నాడు .
అతను డిక్కీ తెరిచి కావలసిన సామాను తీసుకుని కారు కిందకి దూరి జాకీ బిగించాడు . తారు రోడ్డు గీసుకుని చేతులు రక్తం కారాయి . జాకీ బిగించి టైరు తీసి టైర్ మార్చాడు . సామాను తిరిగి కారులో పెట్టాడు . 
.
ఆమె డబ్బులు తీసి ఇవ్వబొయింది . వద్దు అన్నాడు . 
" ఎంత అయినా ఇస్తాను . మీరు కనక కనబడి ఈ సహాయం చెయ్యక పోతే నా పరిస్థితిని తలుచుకుంటే నాకు భయం వేస్తోంది" అంది 
.
" నేను ఇలాంటి పరిస్థితి లో ఉన్నప్పుడు , కష్టాల్లో ఉన్నప్పుడు ఎందఱో సహాయ పడ్డారు . మీకు సహాయం చెయ్యాలనిపిస్తే ఎవరైనా కష్టాల్లో ఉన్నారని మీకు అనిపించినపుడు నా పేరు తలచుకుని వారికి సహాయం చెయ్యండి " అని వెళ్లి పోయాడు 
.
.
మనసులోనే కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఆమె కారు నడుపుకుంటూ వెడుతోంది . అప్పుడు ఆమెకు ఆకలి గుర్తుకు వచ్చింది . తను వెళ్ళ వలసిన దూరం చాలా ఉంది . ఆకలీ చలీ ఆమెను రోడ్డుపక్కన ఉన్న హోటల్ దగ్గరకి వెళ్ళేలా చేశాయి .
.
.
అదొక చిన్న హోటల్ . కస్టమర్ల టేబుల్స్ దగ్గరకి ఒక గర్భిణీ మహిళ సర్వ్ చేస్తోంది . ఆమెను చూస్తుంటే నిండు గర్భిణీ అనిపించింది . డెలివరీ రోజులు దగ్గరకి వచ్చేసి ఉంటాయి అనిపించింది . బరువుగా నడుస్తోంది . అన్ని టేబుల్స్ దగ్గరకీ వెళ్లి కావలసిన ఆర్డర్ తీసుకోవడం , సర్వ్ చెయ్యడం బిల్ తీసుకుని చిల్లర ఇవ్వడం అన్నీ తనే చేస్తోంది . ఆమె ముఖం లో ప్రశాంత మైన చిరునవ్వు 
.
ఆమె తన టేబుల్ దగ్గరకి వచ్చింది . చిరు నవ్వుతో ఏమి కావాలండి ? అని అడిగింది . అంత శ్రమ పడుతూ కూడా చెరిగిపోని చిరు నవ్వు ఆమె ముఖం లో ఎలా ఉందొ ? అని ఆశ్చర్య పడుతోంది తను తన మనసులో భోజనం ఆర్డర్ ఇచ్చింది . భోజనం చేసి ఆమెకు 1000 నోటు ఇచ్చింది . ఆమె చిల్లర తేవడానికి వెళ్ళింది . 
తిరిగి వచ్చేటప్పటికి ఈమె కనబడలేదు . 
.
ఈమె కూర్చున్న టేబుల్ మీద ఉన్న గ్లాసు క్రింద ఒక కాగితమూ దానికింద నాలుగు 1000 నోట్లూ ఉన్నాయి . ఆ కాగితం చదివిన హోటల్ మెయిడ్ కి కన్నీళ్లు ఆగలేదు .
అందులో ఇలా ఉంది .
.
" చిరు నవ్వుతో ఉన్న నీ ముఖం నీకు బాధలు లేవేమో అన్నట్టు ఉంది . నువ్వు నిండు నెలలతో పని చేస్తున్నావు అంటే నీకు డబ్బు అవసరం అని అనిపిస్తోంది . నాకు నా అవసరం లో ఒక మిత్రుడు సహాయ పడినట్టే అతడిని తలచుకుంటూ నేను నీకు సహాయ పడుతున్నాను
. ఈ గొలుసు ఇంతటితో తెగిపోకూడదు . నువ్వూ ఇతరులకు సహాయపడు . " అని రాసి ఉంది 
.
.
ఇంటికి వచ్చింది . అప్పుడే ఇంటికి వచ్చి అలసి పోయి పడుకున్న భర్త చేతి కేసి చూసింది . గీసుకు పోయిన చేతులు రక్తం గడ్డకట్టినట్టు ఉంది .
అతడి పక్కన మంచం మీదకు చేరుతూ మనం బెంగపడుతున్నాము కదా ! డెలివరీ ఎలాగా అని . ఇక ఆ బెంగ తీరిపోయిందిలే బ్రియాన్ అండెర్సన్ !
భగవంతుడే మనకు సహాయం చేశాడు . ఆయనకి కృతజ్ఞతలు అంది
ప్రశాంతంగా నిద్రపోయింది.

థామస్ ఆల్వా ఎడిసన్ స్కూల్లో జరిగిన సంఘటన.

ఒకరోజు టీచర్ ఓ చీటీ ఇచ్చి ఇంటికెళ్ళి నేరుగా అమ్మకివ్వు
నువ్వు ఎట్టిపరిష్తితులలోనూ తీసి చూడకు అని చెప్పారట.
అతి విధేయతతో ఎడిసన్ ఆ చీటీని అమ్మకిచ్చి ఆమె అందులో ఏముందో
చెబుతుందిగదా అని ఎదురు చూసాడట.
వాళ్ళమ్మగారు చీటీలోని విషయాలను పెద్దగా చదివి వినిపిస్తూ.
"మీ అబ్బాయి చాలా తెలివైన వాడు. ఈ పాఠశాల అతని మేధకు
పదునుపెట్టగల సామర్ధ్యంలేనిది,కావునా మీరతన్ని ఏదయినా
మంచి బడిలో చేర్పించి చక్కగా సానపట్టగలరని మా విన్నపం."
అతన్ని ఇంకో బడిలో చేర్పించారు.వాళ్ళా అమ్మగారు పరమపదించాక
ఎడిసన్ పాత సామాన్లన్నింటినీ సర్దుతుంటే వాళ్ళమ్మగారి డైరీ
కనిపించింది అందులో ఓ పేజీలో మడతపెట్టిన ఓ కాగితం కనబడితే
తీసి చూసి నిరుత్తరురుడయాదు ఎడిసన్. అది ఆరోజు తన బదిలోనుంచి తను తెచ్చిన కాగితం. తీరా ఉత్తరం చదివాక ఎడిసన్ కళ్ళనీళ్ళపర్యంతమయాడు. ఆఉత్తరంలోని సారాంశం అమ్మ ఆరోజు చదివి వినిపించిన దానికన్నా భిన్నంగా వుంది.
'మీ అబ్బాయి మందమతి .అతన్ని బాగు చేయడం మా వల్లకాదు అతనివలన మిగతా పిల్లలుకూడా చెడిపోయేప్రమాదం వుంది.
మీరతన్ని వెంటనే మా బడినుంచి మానిపించగలరు!!"
అప్పుడు అశృపూరితనయనాలతో ఎడిసన్ అన్నమాటలు.
ఎడిసన్ మంద బుద్ధిగలవాడే కానీ వాళ్ళ అమ్మ ధీరోదాత్త అందుకే తనకొడుకును భిన్నంగా తీర్చిదిద్ది ఇలా ఓ శాస్త్రవేత్తగా నిలబెట్టగలిగింది.

పెళ్ళి ఉంగరం మన చేతి నాలుగో వేలికే ఎందుకు తొడుగుతారు. తెలుసుకుందామా.ఇది పెళ్ళయినవాళ్ళకి,పెళ్ళికాబోయేవాళ్ళకి ఉపయోగకరము.చూద్దామా సంగతేంటో.

* పెళ్ళి ఉంగరం మన చేతి నాలుగో వేలికే ఎందుకు తొడుగుతారు.
తెలుసుకుందామా.ఇది పెళ్ళయినవాళ్ళకి,పెళ్ళికాబోయేవాళ్ళకి
ఉపయోగకరము.చూద్దామా సంగతేంటో.
01. బొటనవేలు-తల్లితండ్రులకు ప్రతినిధి
02. చూపుడువేలు-తోబుట్టువులకు ప్రతినిధి
03. మధ్యవేలు-మనకోసం
04. ఉంగరంవేలు-జీవితభాగస్వామికి ప్రతినిధి
05. చిటికెనవేలు-పిల్లలకు ప్రతినిధి
ఆసక్తిగా ఉందికదా……..
ఈ విధంగా చేయండి.రెండు అర చేతులను తెరచి,మధ్య వేళ్లు
రెండూ మడిచి వెనకవైపునుండి దగ్గరగా పెట్టండి.ఇప్పుడు
మిగతా వేళ్లన్ని చివరలు కలిపి ఉంచండి.
మొదట బొటన వేళ్లు విడదీసి చూడండి.అవి విడిపోతాయి.
అంటే మానవులందరూ ఎదో ఒక రోజు చనిపోతారు.అలాగే
మన తల్లితండ్రులు కూడా మనల్ని వదలి వెళతారు.
ఇప్పుడు బొటన వేళ్లు కలిపి రెండో వేళ్లు విడదీయండి. అవి
కూడా విడిపోతాయి. అంటే మన తోబుట్టువులు కూడా వాళ్ల
సంసారాలలో తలమునకలై ఉండి మనతో ఉండరు.
ఇప్పుడు రెండో వేళ్లు కూడా కలిపి చిటికెన వేళ్లు విడదీయండి.
అవి విడిపోతాయి. అంటే మన పిల్లలు కూడా తమ స్వంత
జీవితాలకోసం మనల్ని వదలి వెళతారు.
ఇక చిటికెన వేళ్లు కూడా కలిపి నాలుగో వేళ్లు విడదీయండి.
ఆశ్చర్యం! ఇది నిజం అవి విడిపోవు.ప్రయత్నించినా మిగతా
వేళ్లు కలిసే ఉండాలి. ఎందుకంటే ఆ నాలుగో వేళ్లు భార్యా
భర్తల బంధానికి,ప్రేమకు ప్రతినిధులు. జీవితాంతం కలిసే
వుండాలని పెళ్లి ఉంగరాలను ఆ నాలుగో వేలికి తొడుగుతారు.
అందుకే నాలుగో వేలిని ఉంగరపువేలు అని అంటారు.
ప్రయత్నించి చూడండి.