Sunday, October 25, 2015

థామస్ ఆల్వా ఎడిసన్ స్కూల్లో జరిగిన సంఘటన.

ఒకరోజు టీచర్ ఓ చీటీ ఇచ్చి ఇంటికెళ్ళి నేరుగా అమ్మకివ్వు
నువ్వు ఎట్టిపరిష్తితులలోనూ తీసి చూడకు అని చెప్పారట.
అతి విధేయతతో ఎడిసన్ ఆ చీటీని అమ్మకిచ్చి ఆమె అందులో ఏముందో
చెబుతుందిగదా అని ఎదురు చూసాడట.
వాళ్ళమ్మగారు చీటీలోని విషయాలను పెద్దగా చదివి వినిపిస్తూ.
"మీ అబ్బాయి చాలా తెలివైన వాడు. ఈ పాఠశాల అతని మేధకు
పదునుపెట్టగల సామర్ధ్యంలేనిది,కావునా మీరతన్ని ఏదయినా
మంచి బడిలో చేర్పించి చక్కగా సానపట్టగలరని మా విన్నపం."
అతన్ని ఇంకో బడిలో చేర్పించారు.వాళ్ళా అమ్మగారు పరమపదించాక
ఎడిసన్ పాత సామాన్లన్నింటినీ సర్దుతుంటే వాళ్ళమ్మగారి డైరీ
కనిపించింది అందులో ఓ పేజీలో మడతపెట్టిన ఓ కాగితం కనబడితే
తీసి చూసి నిరుత్తరురుడయాదు ఎడిసన్. అది ఆరోజు తన బదిలోనుంచి తను తెచ్చిన కాగితం. తీరా ఉత్తరం చదివాక ఎడిసన్ కళ్ళనీళ్ళపర్యంతమయాడు. ఆఉత్తరంలోని సారాంశం అమ్మ ఆరోజు చదివి వినిపించిన దానికన్నా భిన్నంగా వుంది.
'మీ అబ్బాయి మందమతి .అతన్ని బాగు చేయడం మా వల్లకాదు అతనివలన మిగతా పిల్లలుకూడా చెడిపోయేప్రమాదం వుంది.
మీరతన్ని వెంటనే మా బడినుంచి మానిపించగలరు!!"
అప్పుడు అశృపూరితనయనాలతో ఎడిసన్ అన్నమాటలు.
ఎడిసన్ మంద బుద్ధిగలవాడే కానీ వాళ్ళ అమ్మ ధీరోదాత్త అందుకే తనకొడుకును భిన్నంగా తీర్చిదిద్ది ఇలా ఓ శాస్త్రవేత్తగా నిలబెట్టగలిగింది.

No comments:

Post a Comment