ఒకసారి
ఒక వ్యాపారి దుకాణం తెరవగానే ఒక సాధువు వచ్చి ధర్మం అడిగాడు .. పోవయ్యా పో
అన్నాడు వ్యాపారి . మళ్ళి ఘంట తరువాత అదే సాధువు వచ్చి ధర్మం అడిగాడు .
మళ్ళి పోవయ్యా పో అన్నాడు వ్యాపారి ... ఇలా ఘంటకు ఒకసారి సాధువు వచ్చి
బిక్ష అడగటం వ్యాపారి పోవయ్యా పో అనడం రోజంతా జరిగింది .
వ్యాపారి దుకాణం మూసే టైం అయ్యింది . అప్పుడు కూడా చివరగా సాధువు బిక్ష అడిగేసరికి వ్యాపారి అన్నాడు నేను లేదు పోవయ్యా అని పొద్దున్నే చెప్పా .. నువ్వు అప్పుడే వెళ్లి పోయి మిగిలిన చోట్ల బిక్ష అడిగితె పోయేది కదా నీ జోలె నిండేది అన్నాడు .
అప్పుడు సాధువు నువ్వు బిక్ష ఇవ్వక పొతే పోనీలే కాని ఒక్క ప్రశ్న అడుగుతాను దానికి నీవు సమాధానం అయినా ఇవ్వు అన్నాడు .
? అని వ్యాపారి మొహం పెట్టాడు . సాధువు అన్నాడు నీవు ఏమీ తినకుండా ,కనీసం
కాఫీ నీళ్ళు అయినా తాగకుండా పొద్దున్న నుంచి జనాలను మోసం చేసి వ్యాపారం
చేస్తున్నావు ఇదంతా ఎవరి కోసం అన్నాడు ...
అప్పుడు వ్యాపారి నాకు
భార్య పిల్లలు ఉన్నారు వారి కోసం అన్నాడు . మరి నీవు చేసిన పాపలలో వారు
బాగం పంచుకుంటారా అని అన్నాడు .. అడిగి చెప్తాను అన్నాడు వ్యాపారి .
డిన్నర్ టైం లో వ్యాపారి భార్యా పిల్లలను అడిగాడు నేను మీ కొరకు సంపాదిస్తున్నాను కదా మరి నా పాపాలలో భాగం పంచుకుంటారా అని .
"నీవు తండ్రి కాబట్టి సంపాదిస్తున్నావు . అమ్మ వంట చేసి పెడుతుంది కాబట్టి
తింటున్నాము ఇంత కంటే మాకు ఏమీ తెలవదు .. మేమైతే మంచోల్లమే..నీ పాపాలు
మేము పంచుకోము" అన్నారు పిల్లలు .
"నీవు ఎలా సంపాదిస్తున్నావో
నాకు తెలవదు . నీవు ఎంత సంపాదించినా కూడా ఉన్న దాంట్లో adjust చేయడం మాత్రం
నాకు తెల్సు .నిన్ను పాపాలు చేయమని నేనెప్పుడు చెప్పలేదు . నేను
మంచిదాన్నే . కాబట్టి నీ పాపాలు నేను పంచుకోను "అని చెప్పింది భార్య ..
ఇప్పుడు వ్యాపారి ఆలోచించే సరికి దేవుడి దృష్టిలో భార్య పిల్లలు మంచోల్లే
..కాని ఆకలి ఉన్న మనిషి దగ్గరికి వచ్చి బిక్ష అడిగితె వేయనందుకు , జనాలను
మోసం చేసి సంపాదించిన సంపద వల్ల తాను పాపాత్ముడు అయ్యాడు .
నీతి::: నీకు ఎన్ని భాద్యతలు ఉన్నా , అప్పులు ఉన్నా న్యాయాన్ని విడిచి
పెట్టకు . ఇప్పుడు కాకపోయినా next జన్మలో అయినా కర్మ ఫలాన్ని
అనుభవించాల్సిందే . పంచుకోడానికి ఎవరు ఉండరు . నీ భాగస్వామి నీవు జీవించి
ఉన్నంత వరకు జీవితాన్ని పంచుకుంటుంది కాని పాపాలను కాదు
No comments:
Post a Comment