Thursday, May 1, 2014

దేవుడు ఎప్పుడు సహాయం చేస్తాడు ?


 రామయ్య అనే వ్యక్తి ఉండే వాడు, అతడు చాలా దైవ భక్తుడు. ఒక సారి పనిమీద పక్క ఊరికి వెళ్లి పని ముగించుకొని , ఎద్దుల బండిలో ఇంటికి బయలుదేరాడు.
రాత్రి అయ్యింది, వర్షం మెదలైంది. అతని బండి చక్రం ఒక గుంతలో పడింది. అతను దాన్ని తీసే ప్రయత్నం చెయ్యలేదు.
పక్కన ఒక చెట్టుకిందకు వెళ్ళి నిలుచొని,
దేవుడా చక్రం బయటకి తియ్యి, నన్ను ఇంటికి చేర్చు అని ప్రార్ధించాడు.దేవుడు రాలేదు.
దేవుడా నీకు ఎన్ని పూజలు చేసాను,అయినా నా మీద కరుణ లేదా అని ప్రార్ధించాదు..
అలా ఎన్ని సార్లు ప్రార్ధించినా దేవుడు కరుణించలేదు.
ఇక దేవుడు రాడని నిర్ణయించుకొని....తనే వెళ్ళి ఆ చక్రం తీయడానికి ప్రయత్నించాడు. ఆశ్చర్యంగా చాలా తేలికగా చక్రం బయటకి వచ్చింది.. అప్పుడు దేవుడు ప్రత్యక్షమై " రామయ్య నువ్వు అసలు చక్రం బయటకు తియ్యడానికి ప్రయత్నం కూడా చెయ్యకుండా నన్నే తీయమంటే నేనేం చేసేది, నువ్వు ప్రయత్నించి ఉండి ఉంటే నేను సహాయం చేసి ఉండే వాడిని " అన్నాడు... చివరకు రామయ్య క్షేమంగా ఇంటికి చేరాడు.
అంటే "మానవ ప్రయత్నానికి దైవ సహాయం అందుతుంది" అంతే కానీ మెత్తం దేవుడే చెయ్యాలి అంటే ఎలా ?

No comments:

Post a Comment