ప్రార్థించే పెదవుల కన్నా, సాయం చే సే చేతులు మిన్న
చాలా మంది మనుషులకి అనిపిస్తుంది, ఎంత ప్రార్థించినా కష్టాలు తీరట్లేదు,
భగవంతుని కృప లేదు అని. శ్రీ రామాయణంలో ఒక కధ చదివితే అర్థమౌతుంది.
విభీషణుడు ఒక రోజు హనుమంతునితో ఇలా అన్నారు. 'హనుమాన్ నీవు కోతివి అయినా
కూడా, నీ మీద భగవంతుని కృప ఉంది, నేను ఎంత రాముడి ధ్యానంలో ఉన్నా, ఆ కృప
నాకు రాలేదు'.
అప్పుడు హనుమంతులవారు ఇలా అన్నారు, విభీషణా! మీరు నిజంగానే, శ్రీరాముడి
ధ్యానంలో ఉన్నారు, కానీ, శ్రీ రాముని కార్యంలో ఎంత పాల్గొన్నారు? కేవలం,
శ్రీరాముని నామం ధ్యానం చెయ్యటం వల్ల, కృప రాదు. మీ అన్న
రావణుడు,సీతమ్మవారిని, తీసుకుని వచ్చినప్పుడు, సీతాదేవికి ఏమి సహాయము
చేశారు. కొంచెమైనా, శ్రీరాముని బాధ తగ్గించే ప్రయత్నం చేసేరా....
నీతి :
కేవలం భగవంతుని మీద, గురువు మీద, భక్తి, ప్రేమ ఉంటే సరిపోదు. వారు
నేర్పించినవి, సాధనలో పెట్టాలి. వాటిలో ఒక మార్గం, మనుషులని ప్రేమించటం,
సేవ చెయ్యటం.
No comments:
Post a Comment