నమ్మకం
ఒక రోజు నేను అందర్నీ వదిలి వెళ్ళిపోవాలని నిశ్చయించుకున్నాను.
నా ఉద్యోగం, నాకు ఉన్న అనుబంధాలు,ఆధ్యాత్మికత పట్ల నాకున్న శ్రద్ధ అన్నీ
వదిలెయ్యాలనిపించింది.
చివరిసారిగా భగవంతుడితో మాట్లాడదామని అడవిలోకి వెళ్ళేను.
దేవుడా ! "వీటినుండి వెళ్ళిపోకుండా నిలబడడానికి నాకు ఒక కారణం చూపించగలవా" అని అడిగాను.
అప్పుడు భగవంతుడు , నీ చుట్టూ ఉన్న అడవిమొక్కలు మరియు వెదురుచెట్లను
ఒక్కసారి చూడు అన్నాడు. నేను చూసానని చెప్పేక ఈ విధంగా చెప్పడం
మొదలుపెట్టేడు. నేను అడవిమొక్కల విత్తనాలు, వెదురు విత్తనాలు ఒక్కసారే
పాతేను. రెండింటికి నీరు,వెలుగు అందేలాగ సమంగా శ్రద్ధ
తీసుకున్నాను.అడవిమొక్కలు తొందరగా ఎదగడం ప్రారంభించాయి.వాటి పచ్చదనంతో
నేలంతా ఎంతో అందంగా కనిపించసాగింది.వెదురు విత్తనాలు అలాగే వున్నాయి.వాటిలో
ఏమాత్రం ఎదుగుదల లేదు, అయినా నేను నిరాశ పడలేదు. ఒక సంవత్సరం
గడిచింది, అడవిమొక్కలు ఇంకా బాగా ఎదిగి నేలంతా పరచుకుంటున్నాయి, కాని
వెదురు విత్తనాలు అలాగే వున్నాయి, అయినా నేను నిరాశపడలేదు. మూడవ సంవత్సరంలో
కూడా వెదురు విత్తనాల్లో మొలక రాలేదు, అయినా నేను నిరాశపడలేదు, నాలుగవ
సంవత్సరంలో కూడా ఎలాంటి ఎదుగుదల లేదు ఐదవసంవత్సరంలో చిన్న
మొలక కనిపించింది. అడవిమొక్కలతో పోలిస్తే చాల తక్కువనే చెప్పాలి,కాని
6నెలలు గడిచేసరికి 100 అడుగుల ఎత్తు వెదురు చెట్లు లేచాయి.5 సంవత్సరాలుగా
వెదురు విత్తనాలు భూమిలో వుండి , చెట్టుగా మారేక నిలబడడానికి అవసరమైన
వేళ్ళను బలంగా తయారుచేసుకున్నాయి. నా సృష్టిలో ఏ ప్రాణికీ అది
చెయ్యలేని పనిని నేను ఇవ్వను. ఇన్ని సంవత్సరాలుగా నువ్వు పడుతున్న ఒత్తిడి
వల్ల జీవితాన్ని ఎదుర్కొందుకు అవసరమైన ధైర్యం నీలో పెరుగుతోంది.వెదురు
చెట్ల విషయంలో నిరాశపడి వాటిని వదిలిపెట్టలేదు, అలాగే నిన్ను కూడా
వదిలిపెట్టను.
నిన్ను నువ్వు ఇతరులతో పోల్చుకుని తక్కువ చేసుకోకు.
అడవిమొక్కలు, వెదురుచెట్ల లక్ష్యం ఒకటికాదు, కాని ఆరెండుకలిసి అడవిని
అందంగా చేస్తున్నాయి. నీకు కూడా మంచికాలం వస్తుంది. అప్పుడు నువ్వు
కూడా జీవితంలో పైకి ఎదుగుతావు. నీ ఎదుగుదల ద్వారా నా కీర్తిని
వ్యాపింపచెయ్యి అని చెప్పేడు. దేవుడు నన్ను వదిలిపెట్టడన్న నమ్మకంతో నేను
ఇంటికి తిరిగివచ్చేను. భగవంతుడు ఈ విశ్వానికే తండ్రి కాబట్టి తన
పిల్లలవిషయంలో అశ్రద్ధ ఎప్పుడూ చూపడు. ఒత్తిడి తట్టుకోలెక మనమే ఆయన్ని
అపార్థం చేసుకుంటాము. మంచి రోజులు సంతోషాన్ని ఇస్తే , చెడ్డ రోజులు అనుభవాల్ని ఇస్తాయి. జీవితంలో రెండెంటి విలువ తెలుసుకోవడం మన కర్తవ్యం
.
నీతి: ఇతరులతో పొల్చుకోవడం మానేసి మన పనిమీద దృష్టి పెట్టగలిగితే విజయం
సాధించడం సులభం అవుతుంది. మన కర్తవ్యం నిర్వహించి మిగిలినది భగవతుడికి
వదిలెయ్యాలి. అడవిమొక్కలు, వెదురుచెట్లలాగే మనుషులందరి జీవితాలకి
విభిన్నమైన లక్ష్యాలు ఉంటాయి. నమ్మకంతో ప్రయత్నం చేసి వాటిని చేరుకోవడం మన
కర్తవ్యం.
No comments:
Post a Comment