ఒక
సామాన్య రైతు కుటుంబం లో పుట్టిన ఒక రైతు తన కొడుకుని ఒక గొప్ప వ్యక్తి గా
చూడాలి అనుకున్నాడు..!! రేయి అనక, పగలు అనక కష్టపడి చదివించాడు..!! నాన్న
నెను చదవటానికి పుస్తకం లేదు..!! కొనడానికి డబ్బులు లేవు అని అడిగితే ఆ
తండ్రి కష్టపడి చేస్తున్న వ్యవసాయం తో పాటు ఒక చిన్న ఉద్యోగం లో చేరి తన
కొడుక్కి కావల్సిన ప్రతీది ఇస్తూ, సౌకర్యం గా పెంచాడు..!!
'కొన్ని సంవత్సరాలు తరువాత ఆ కొడుకు ఒక గొప్ప వ్యక్తి గా ఎదిగాడు..!!
ఒక పెద్ద ఇంజినీర్ అయ్యాడు.. అంచలు అంచలు గా ఎదిగి ఒక కంపెనీ
స్థాపించాడు..!! ఇంత స్థాయి కి తన కొడుకుని తీసుకు రావడానికి ఒక కిడ్నీ తో
పాటు తన తండ్రి కి అయిన ఖర్చు "సుఖం లేని జీవితం, నిద్ర మరచిన రాత్రులు,
అలుపు ఎరుగని కష్టం
అసలు కష్టమే లేని జీవితం చుస్తున్నాడు
కొడుకు..!! తన చదువు కోసం కిడ్నీ అమ్మి చదివించిన తన తండ్రి అంటే ఆ
కొడుకుకి ప్రాణం..!! తన తండ్రి ని ఎంతో ప్రేమ గా చూసుకుంటున్నాడు..!! వయసు
పైబడింది..!! తండ్రి ఆరోగ్యం క్షీనించింది..!! 6 సంవత్సరాల బబు కి 60
సంవత్సరాల వృద్ధుడికి తేడా వుండదు అంటారు..!! ఎందుకో తెలుసా?? వాళ్ళ
ఇద్దరికి కూడా ఒకరి సహకారం కావాలి..!! కాని అదే కొడుకు తనకి నడక నేర్పిన
తండ్రి చివరి రోజుల్లో నడవలేక అవస్త పడుతుంటే గాలికి వదిలేసాడు..!!
తన మీద తన కొడుకుకి ప్రేమ ఎందుకు కరువు అయ్యింది అని ఆ తండ్రి బాధపడని
రోజు లేదు..!! తాగి ఇంటికి వచ్చే వాడు..!! చివరి రోజుల్లో చెడిపోతున్న
కొడుకుని చూసి ఏడవని రోజు లేదు ఆ తండ్రికి..!!
చివరికి ఒక రొజు ఆ
కొడుకు తన తండ్రి ని ఎంత వద్దు అని మొత్తుకుంటున్నా బలవంతం గా తీసుకుని
వెళ్ళి ఒక వృద్ధాశ్రమం లో చేర్చాడు..!! కాలం గడిచింది, 6 నెలలు గడిచిన కూడా
తన కొడుకు నుండి ఒక్క ఫోన్ రాలేదు...!! ఇప్పటికి ఆ కొడుకు తనకి ఇస్తున్న
విలువకి ఒక పక్క బాధపడుతూనే ఇంకొకపక్క ఆ కొడుకు కోసం తను పడిన కష్టాన్ని
తలుచుకుంటూ గర్వ పడుతున్నాడు..!! వున్నట్టు ఉండి ఒక ఫోన్ కాల్, దగ్గరలో
వున్న హాస్పిటల్ లో ప్రానాపాయ స్తితి లో తన కొడుకు వున్నాడు అని..!! తనని ఏ
మాత్రం పట్టించుకోని తన కొడుకు చావు బ్రతుకుల్లో వున్నాడని తెలిసిన ఆ
తండ్రి పరుగు పరుగున వెళ్ళి తన కొడుకుని కలుసుకున్నాడు..!!
అప్పుడు ఆ కొడుకు తన తండ్రి తో పలికిన మాటలు..!!
"నేను చచ్చిపోతున్నాను నాన్న..!! పుట్టిన ప్రతి వ్యక్తి ఒక రోజు చనిపొతాడు
కాని ఎప్పుడు చనిపోతాడు అనేది ఎవరికి తెలీదు..!! కాని నాకు దేవుడు ఆ
అవకాశం ఇచ్చాడు.. నేను చనిపోతాను అని నాకు 1 సంవత్సరం ముందె తెలుసు
నాన్న..!! అందుకే మిమ్మల్ని దూరం గా వుంచాను..!! నా మీద అసహ్యం పుడితే నేను
చనిపోయిన రోజు నన్ను చూసి నువ్వు ఏడవకుండా వుంటావు అని..!! కాని నా చివరి
శ్వాస నీ వడిలో పడుకుని వదలాలి అని వుంది నాన్న..!! నా చావు కన్నా ముందు
నేను చుపించిన ద్వేషానికి పశ్చ్యాతాపం గా నీ వడిలో నా శ్వాస వదలాలి అని
వుంది నాన్న...!! " అంటూ తన తండ్రి వడిలోనే ప్రానాలు విడిచాడు.. !!
చనిపోయిన కొడుకుని చూస్తు "పిచ్చోడా!! నువ్వు నన్ను ద్వేషిస్తే నీ మీద
అసహ్యం పెంచుకోడానికి నువ్వు నా శత్రువు కాదు నాన.!!. నా కొడుకువి..!! "
అని బరువెక్కిన గుండెతో పలికిన మాటలు ఇంకా నా చెవిలో
మారుమ్రోగుతున్నాయి...!!
కొడుకు చనిపోయిన తరువాత ఎంతో మంది
అనాధలను దత్తతు తీసుకుని వాళ్ళని పెంచి పోషిస్తూ, చదివిస్తూ ఆ తండ్రి కూడా
ఒక రోజు ప్రాణం విడిచాడు.....!!
ఇదే సమాజం లో రోడ్ మీద పడి వున్న
కొంత మంది పిల్లల్ని దత్తతు తీసుకుని వాళ్ళని చదివిస్తున్న గొప్ప వాళ్ళు
వున్నారు... వాళ్ళకి ప్రేమ విలువ తెలీదా?? లేక అసలు వాళ్ళలో ప్రేమ లేదు
అంటారా??
ప్రతీ బంధాన్ని చివరి బంధం గా భావించు.. అప్పుడే నీకు ప్రేమించడం తెలుస్తుంది...
ప్రతీ క్షణాన్ని చివరి క్షణం గా భావించు.. అప్పుడే నీకు ప్రేమ విలువ, మనిషి విలువ, కాలం విలువ ఏంటో తెలుస్తుంది..
No comments:
Post a Comment