Friday, March 7, 2014

భగవదనుగ్రహం

ఒక ఊరిలో పూజారి ఉండేవారు. అతను తప్పనిసరి పనిమీద ఊరు వెళ్ళవలసివచ్చింది.ఆ ఊరిలో పూజ చేసేవాళ్ళు ఇంకెవరూ లేకపొవడంతో ఆ బాధ్యతని, పన్నెండేళ్ళ వయసున్న తన కొడుకు ఉన్నికి అప్పచెప్పి వెళ్ళేరు. దేవుడికి నైవేద్యం పెట్టడానికి అన్నం తీసుకుని ఉన్ని గుడికి వెళ్ళేడు.దేవుడు నిజంగా వచ్చి తింటాడు అనుకుని ఎదురుచూస్తున్నాడు. విగ్రహం కదలకపోవడంతో అన్నం నచ్చలేదేమో అని బైటికి వెళ్ళి మామిడి పళ్ళు , పెరుగు కొని తెచ్చాడు.తినమని బ్రతిమాలాడు, బెదిరించాడు, ఎన్ని చేసినా దేవుడు కదలలేదు. తండ్రి ఊరినుండి వచ్చాక దేవుడు అన్నం తినలేదని తెలిస్తే తనని కొడతాడని భయపడి పెద్దగా ఏడవసాగేడు. అది చూసిన దేవుడి మనసు కరిగి నిజంగా నైవేద్యం స్వీకరించాడు.గిన్నెలు ఖాళీ అవ్వడంతో దేవుడు తిన్నాడని ఉన్ని సంతోషంగా ఇంటికి వెళ్ళేడు. ఊరినుండి వచ్చిన పూజారి గిన్నెలు ఖాళీగా ఉండడం చూసి ఉన్నిని ప్రశ్నించాడు. దేవుడు అన్నం తిన్నాడని ఉన్ని సంతోషంగా చెప్పేడు. పుజారి , ఉన్ని అబద్ధం చెప్తున్నాడని భావించి కోపంతో కొట్టబోయాడు. ఇంతలో ఒక అశరీరవాణి ఈ విధంగా పలికింది ” ఉన్ని అమాయకుడు, నేను అన్నం తిన్నాను”. అది విన్న అవి పూజారి దేవుడి మాటలు అని గ్రహించి సంతోషించాడు. ఉన్నిని కాపాడడానికి స్వయంగా భగవంతుడే వచ్చాడు
.నీతి: ప్రేమ అనే బంధం భక్తులని భగవంతుడుతో కట్టి ఉంచుతుంది.భగవంతుడు భక్తుల ప్రేమకి వశపడి ఉంటాడు. భక్తులని రక్షించడానికి ఏమి చెయ్యడానికి అయినా సిద్ధపడతాడు.

No comments:

Post a Comment