Thursday, March 6, 2014

అమ్మ

ఒక్క బాబు రోజు స్కూల్ కి వెళ్ళే వాడు దారి లో ఒక్క పార్క్ ఉండేది ఆ పార్క్ నీ చూస్తూ అలా తన స్కూల్ కి రోజు వెళ్ళేటప్పుడు వచేటప్పుడు చూస్తూ ఉండేవాడు...
ఐతే ఆ పార్క్ లో రోజు ఒక్క జంట ఆనందం గా కనిపించేది ఆ అబ్బాయి కి వాళ్ళని రోజు గమనించే వాడు...
అప్పుడపుడు సాయంత్రం వాళ్ళని చూస్తూ ఒక్కొక్క సారి ఇంటికి వెళ్ళటం లేట్ అయ్యేది బాబు కి ఐతే కొన్ని రోజుల తర్వాత చూస్తే అక్కడ జంట గా ఉండాల్సిన వాళ్ళు లేరు కొన్ని రోజులు వాళ్ళు కనిపించలేదు....
వాళ్ళని పార్క్ అంత వెతికాడు కానీ కనిపించలేదు....
సర్లే ఇంకా వాళ్ళు రారు అని అనుకుని బాబు ఇంటికి వెళ్ళిపోయాడు....
రోజు చూసే వాడు ఆయన వాళ్ళు మళ్ళి కనిపించలేదు కానీ ఒక్క రోజు సాయత్రం ఆ బాబు అక్కడ ఆ జంట లోని అబ్బాయి నీ చూసాడు....
చూడగానే ఆనందం తో పరిగేతుకు వెళ్ళాడు....
అక్కడ కూర్చున్న అబ్బాయి ఎం కావాలి అని అడిగాడు...??
బాబు ఎం అడగాలో తెలియక నీతో పాటు ఒక్క అక్క ఉండాలి కదా తను ఎక్కడ అని అడిగాడు...???

అప్పుడు అబ్బాయి తను నీకు ఎలా తెలుసా అని అడిగాడు...??
అప్పుడు బాబు చూసింది అంత చెప్పాడు...
అబ్బాయి అప్పుడు మీ అక్క నన్ను వదిలేసింది అందుకే నేను ఒంటరిగా ఇక్కడే కూర్చున్న మార్నింగ్ నుండి అని చెప్పాడు...
ఓహ్ అలా జరిగిందా సర్లే నేను వెలుతున్న అని చెప్పాడు...
అప్పుడు చూసావా నువ్వు కూడా నా గురించి అడగకుండా వెళ్ళిపోతున్నావ్ అన్నాడు....
అప్పుడు ఏమో బాబు అదంతా తెలియదు నేను త్వరగా ఇంటికి వెళ్ళకపోతే మా అమ్మ నా కోసం బెంగ పెట్టుకుంటుంది అందరిని అడుగుతుంది అందుకే నేను వెళ్ళాలి అని చెప్పా ఏ నీ కోసం మీ అమ్మ ఎదురు చుడదా ఏంటి మీ ఇంట్లో ఇక్కడ కుర్చునావ్ ఏడుస్తూ అని అడిగాడు....??
అంతే ఆ అబ్బాయి త్వరగా అక్కడి నుండి లేచి ఆ బాబు నీ వాళ్ళ ఇంటిదగ్గర దించి తను వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళిపోయాడు....
మంచి మాటలు చెప్పాలి అంటే పుస్తకాలూ చదవాల్సిన అవసరం లేదు పెద్ద పెద్ద వారితో మాట్లాడాల్సిన అవసరం లేదు చిన్న పిల్లల కల్మషం లేని మాటలు విన్న చాలు మనం ఎం తప్పు చేస్తున్నామో మనకి అర్ధం అవుతుంది...
మనకోసం ఎదురు చూసే ప్రియురాలు లేకపోవచు కానీ మనం ఎప్పుడు వస్తామా అని ఎదురు చూసే అమ్మ ప్రతి ఇంట్లో ఉంటుంది...

No comments:

Post a Comment