60 సంవత్సరాల నిరుపేద వృద్దుడు. పెద్ద వయస్సులో కష్టపడలేక - జైలులో ఉన్న తన కొడుకుకు ఒక లేఖ వ్రాసాడు.
" నాన్నా..! నువ్వు నిరాధార కేసులో ఇరుక్కుని జైలులో ఉన్నావు. ఇక్కడ నా
పరిస్దితి ఏం బాగోలేదు. ఒళ్ళు కూడా సహకరించడం లేదు. మన తోటలో కూరగాయలు సాగు
చేద్దాం అంటే.. పొలం భూమి చాలా గట్టిగా ఉంది రా.! మనుష్యులని పెట్టి సాగు
చేయిద్దాం అన్నా - చేతిలో అంత డబ్బు లేదు. నాకు సహాయంగా ఉండే నువ్వు కూడా
జైలులో ఉండి పోయావు. నాకు సహాయం చేసే వారు లేరు. చాలా బాధల్లో ఉన్నాను. త్వరగా వస్తే బాగుంటుంది. " ఇది ఆ లేఖ సారాంశం.
ఆ లేఖను తన కొడుకుకి క్షమాబిక్ష ఇవ్వడం కోసం రాష్ట్రపతికి పంపాడు.. అలాగే కొడుకుకి కూడా..
కొద్దిరోజులకు ఆ వృద్ధుడు తన కొడుకు దగ్గర నుంచి లేఖ అందుకున్నాడు..
అందులో " నాన్నగారు మీరు ఆ పొలం తవ్వోద్దు.. ఎందుకంటే - నేను హత్యకేసులో
ఇరుక్కున్న శవాలు ఆ భూమిలోనే ఉన్నాయి. నేను త్వరలోనే వచ్చేస్తా..! వచ్చాక ఆ
పని చూస్తా.." అని ఉంది.
అది చదివిన ముసలాయనకి ఏమీ అర్దం కాలేదు.
పక్కరోజు ఇంటికి పోలీస్ వాళ్ళు వచ్చారు. ఇళ్ళంతా సోదాలు చేసి.. ఆ లేఖని
చూసి - అనక ఆ పొలం అంతా తవ్వి తవ్వి అలసిపోయి, ఎటువంటి ఆధారం దొరకక
పొయేసరికి, " వీ ఆర్ రియల్లీ సారీ.." అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోయారు.
అదే రోజు తన కొడుకు దగ్గర నుంచి ఇంకొక లేఖ అందుకున్నాడు ముసలాయన. అందులో "
నాన్నా పొలంలో ఇప్పుడు - నువ్వు ఏం కావాలంటే అవి వేసుకో.. నేను లేని లోటు
పోలీస్ వాళ్ళు తీర్చారు.. అరోగ్యం జాగ్రత్త నాన్నా.."
అలా మన పోలీస్ వాళ్ళ సహాయంతో ఆ పెద్దాయన హ్యపీగా పొలం పండించుకున్నాడు..
నీతి : విన్నవన్నీ నిజాలు కాదు.. చూసేవన్ని సత్యాలు కావు.. తెలివనేది
బుర్రలోనే ఉంటే.. కష్టకాలంలో కూడా.. "బ్రతికేయొచ్చు.." "బ్రతికించొచ్చు.."
టేక్ కేర్.. ఫ్రెండ్స్..
No comments:
Post a Comment