ఇద్దరు
అన్నదమ్ములు నలభైయేళ్ల పాటు కలిసి సంతోషముగా ఉండేవారు. ఇద్దరు ఎదురెదురు
పొలాల్లోనివసించేవారు. యంత్రాలు వాడుకోవడం, వ్యాపారానికి కావలసిన
వస్తువులు, అన్నీ కలిసి పంచుకునే వారు.
ఇంతలో చిన్న మాట తేడా వల్ల,
ఇద్దరికి అభిప్రాయభేదాలు వచ్చాయి. కొన్ని రోజుల పాటు మౌనంగా ఉండేవారు.
తరువాత ఆ మౌనం, కఠినమైన మాటలుగా మారింది. తరువాత ఇద్దరు పూర్తిగా
మాట్లాడుకోలేదు.
ఒక రోజు జాన్ ఇంటి తలుపు ఎవరో తట్టేరు. తలుపు
తెరవగానే, ఒక వడ్రంగి, తన పనిముట్టు సామాన్లతో నుంచుని ఉన్నాడు.'ఒక రోజు
పని ఏమైన ఇప్పించ గలరా' అని వడ్రంగి అడిగేడు. నా దగ్గర ఒక పని ఉంది అని
జాన్ చెప్పాడు
.
ఎదురుగా ఉండేది, నా తమ్ముడే. కొద్దిరోజులుగా,
మేము మాట్లాడుకోవడం లేదు.కొన్ని రోజుల క్రితం పొలం దున్నడానికి, యంత్రం
తీసుకుని వెళ్లాడు. అప్పటి నుంచి మాకు గొడవ అయింది. అందుకని నేను ఏమైనా
చేసి వాడికి గుణపాఠం చెప్పాలి. అక్కడ ఉన్నసామాన్లతో ఒక ఎనిమిది అడుగుల గోడ,
రెండు పొలాలకి మధ్య కట్టమని అడిగేడు. అలాకట్టటం వల్ల, రేపటి నుంచి వాడి
మొహం చూడక్కర్లేధు, అని చెప్పాడు. వడ్రంగికి కావలిసిన సామాన్లు ఇచ్చి జాన్
పనిమీద, పట్టణం వెళ్లాడు.
వడ్రంగి రోజు అంతా కష్టపడి పని చేశాడు. సాయంకాలం జాన్ రాగానే, పని అయిపోయిందని చెప్పాడు.
ఆశ్చర్యంగా చూసాడు జాన్. గోడ లేదు, కానీ ఒక వంతెన ఉంది. ఆ వంతెన రెండు పొలాలకి మధ్య కట్టేడు వడ్రంగి. చూడడానికి అధ్భుతంగా ఉంది.
వంతెనకి అటువైపు నుంచి చూస్తే, తమ్ముడు, చేతులు చాచి అన్న దగ్గరికి
వస్తున్నాడు. ఇద్దరు అన్నదమ్ములు వంతెన మధ్యలో నుంచుని, చేతులు
పట్టుకున్నారు. వడ్రంగి తన సామాన్లు పట్టుకుని వెళ్ళి పోతున్నపుడు, అతన్ని
ఆపి, మాకు ఇంకా చాలా పనులు, చేసి పెట్టాలి అని అన్నారు. దానికి వడ్రంగి
,నాకు ఉండడం ఇష్టమే, కానీ ఇంకా చాలా వంతెనలు కట్టాలి అని అన్నాడు.
నీతి: మనుషులతో సంబంధాలు తెంచుకోవడం సులభం, కాని తిరిగి నిలబెట్టుకోవడం
చాలా కష్టం.ఏ ఇద్దరి మధ్య అయినా అభిప్రాయభేదాలు రావడం సహజం,వాటిని
పక్కనపెట్టి, అనుబంధం నిలుపుకునే ప్రయత్నం ఇద్దరూ చెయ్యాలి.అహంకారం ,
ద్వేషం అడ్డుగోడలుగా ఉన్నప్పుడు ప్రేమతో వాటిని దాటే ప్రయత్నం చెయ్యాలి.
ఎంత ఆడంబరంగా జీవించాము అన్నదానికన్న, ఎంతమందికి సహాయపడ్డాము అన్నది
ముఖ్యం. మనకి ఎంతోమంది స్నేహితులు ఉండచ్చు, అందులో ఎంతమంది మనని నిజమైన
స్నేహితులుగా భావిస్తున్నారో తెలుసుకోవాలి.అందం, డబ్బు, ఆడంబరాలు
మొదలైనవాటివల్ల మనిషికి గుర్తింపు రాదు, అహకారం వస్తుంది, అది మన
వ్యక్తిత్వాన్ని పాడుచేస్తుంది.
ఒక మనిషిగా ఎప్పటికీ గుర్తింపు పొందాలి అన్నా, సమజానికి ఉపయోగపడాలి అన్నా అది ఉన్నతమైన వ్యక్తిత్వం వల్ల మాత్రమే సాధ్యమౌతుంది.
No comments:
Post a Comment