ధర్మేచ, అర్థేచ, కామేచ, మోక్షేచ, నాతిచరామి..!!
అని ప్రమాణాలు చేసుకొని ఒకటి అవుతున్నారు...
మరి చిన్న చిన్న కారణాలకి ఎందుకు విడాకుల
వరకు వెళుతున్నారు...!
నాలుగు గోడల మధ్య ఉండవలసిన భార్యా భర్తల
తగాదాలను సర్ది చెప్పే పెద్దవారితో కాకుండా,
అహంకారం కోసం ఆదిపత్యం కోసం ఆజ్యం పోసే వారితో పంచుకొని,
వారి సలహలు స్వీకరించి తమ జీవితాలను చేజేతుల నాశనం చేసుకోవడంతో పాటు, మనతోపాటే జీవితం అనుకున్న వారిని దుఖః సాగరంలో ముంచుతున్నారు...
ప్రపంచంలో ఏ రెండు గడియారాలు ఒకే సమయాన్ని చూపించవు,
అలాగే 100% ఒకే అభిప్రాయాలున్న
మనుషులు ఎవరు ఉండరు కాబట్టి ఇద్దరి మద్య బేధాలు సహజం..
కాని వాటిని సర్దుకొని పోవడంలోను, ఒకరినొకరు అర్థం చేసుకోవడంలోను,
అభిప్రాయాలను, భావాలను మరొకరు గౌరవించుకోవడంలోనే
ఆనందంకరమైన జీవితం ఉంది.. రెండు చేతులు కలిస్తేనే చప్పట్లు...
కాబట్టి ఒకరు మూర్ఖంగానో కోపంగానో
ఉన్నప్పుడు మరొకరు శాంతంగా ఉండగలిగితే చాలు భార్యా
భర్తల జీలితం సజావుగా సాగుతుంది.......
Wednesday, December 31, 2014
స్త్రీల బాదల పట్ల స్పందించినంతగా పురుషుల పట్ల అటు సమాజం కానీ , ఇటు చట్టాలు కానీ స్పందించవు.
పురుషుడు పెట్టే హింస పైకి కనపడుతుంది కాబట్టి
స్త్రీలు దానిని చూపించి జాలీ, సాను భూతి పొందగలుగుతున్నారు.
అదే పురుషులను స్త్రీలు పెట్టే హింస పైకి కనపడదు. ఉదాహరణకు భర్తను రోజూ తిట్లతో లేక సనుగుడుతో సతాయించే పోరును తట్టుకోలేక ఒక దెబ్బ కొడితే , ఆ కొట్టిన దెబ్బ కనపడుతుంది.
కానీ వారం రోజులుగా సనుగుడుతో సతాయించిన స్త్రీ వేదింపు ఎవరిక్ కనపడుతుంది? స్త్రీలు బోరున ఏడ్చి తమలో ఏ మాత్రం స్ట్రెస్ లేకుండా చేసుకోగలుగుతారు. కానీ ఈ పురుష అహంకార సమాజం మగవాడిని ఏద్వనీయకుండా చేస్తుంది...
Saturday, December 13, 2014
వైవాహిక జీవితంలో స్నేహం పాత్ర
ఈ మధ్య యువత పెళ్లి చేసుకోడానికి చాలా ఆలోచిస్తున్నారు. అంతే కాక పెరుగుతున్న విద్యాధికుల శాతం పెరుగుతుంది. అంతే కాక వివాహ వయసు కూడా ముప్పైలకు చేరింది. ఒకప్పుడు పద్దెనిమిది ఇరవై ఏళ్ళకు పెళ్లిలు చేసేసే వారు కాని ఇప్పుడు తలిదండ్రులు కూడా ఆ నిర్ణయాన్ని పిల్లలకే వదిలేశారు.
పెళ్ళికి ఎక్కువమంది యువత సుముఖత చూపకపోవడం ఈ మధ్య మనం ఎక్కువగా చూస్తున్నాం. లివ్ ఇన్ రిలేషన్ షిప్ లాంటి పద్దతులు కలిసి బ్రతకడాలని హాయిగా భావిస్తున్న యువత పెళ్లి ప్రస్తావన వచ్చేప్పటికి ఎందుకు అంతగా ఆలోచిస్తున్నారు ?? చాలా సమాధానాలే చెప్తారు అడిగితే అయితే వాటిలో ముఖ్యంగా మనం గమనిస్తే వాళ్ళ స్వేచ్ఛను కోల్పోయే సంభావ్యత ఎక్కువగా ఉందనే ఆలోచన ఒకటైతే పెళ్లి కొత్తలో బాగా ఉండి పెళ్లి అయినతరువాత మారిపోయే భాగస్వాముల గూర్చి తమ మిత్రులు అప్పటికే పెళ్ళయిన స్నేహితులు చెబుతున్న మాటలు వినడం వల్ల ఏర్పరచుకునే భయం మరో కారణం అనుకోవచ్చు.
పెళ్లయ్యాక ఏవైనా మనస్పర్ధలు వచ్చినప్పుడు చాలా మంది ఫామిలీ కౌన్సిలర్ ల దగ్గరికి పరుగెత్తుతారు. ఫామిలీ కౌన్సిలర్లు కూడా భార్య భర్తల మధ్య స్నేహం శాతం అంచనా వేసి వాళ్లకి ముందు స్నేహితులుగా ఉండమనే సలహానిచ్చి పంపుతున్నారు. ఏ వివాహమైతే స్నేహపు పునాదులపై నిర్మించబడుతుందో అది ఫలభరితమైనదై ఉంటుంది అని రుజువు కాబడ్డది.
వైవాహిక జీవితంలో దంపతుల మధ్య స్నేహం ప్రధాన పాత్ర పోషిస్తున్నప్పుడు ఇదో ఇలాంటి లాభాలను మనం చూస్తాం .
1. Friendship creates fun: దాంపత్య జీవితంలో మనం ఎంచుకునే భాగస్వామి మనతో స్నేహంగా ఉండేప్పుడు వాళ్ళ మాటల ద్వారా వాళ్ళ చేతలలోని దగ్గర తనం ద్వారా లేదంటే అన్యోయత ప్రతిబింబించే మనస్తత్వాన్ని కలిగి ఉండేలా స్నేహం ఉపయోగపడుతుంది. పెళ్ళికి ముందు మీ భాగస్వామిని మిమ్మల్ని ఎలా నవ్విస్తూ ఆహ్లాదంగా ఉండగలిగే పరిస్తితులు కలుగజేసారో లెక్కబెట్టుకోండి.
2. Communication is easier: భార్యా భర్తల మధ్య సంభాషణ సులభతరం అవడానికి స్నేహం చాలా ఉపకరిస్తుంది. మన కుటుంబాలలోనే , బంధువులు, స్నేహితుల లోనే మనం చూస్తాం పెళ్లవ్వగానే మారిపోయి భాద్యతలన్నీ మోస్తున్నట్టు ప్రవర్తిస్తూ తమ భాగస్వామి చెప్పే మాటలకు కొంచెం కూడా సమయమివ్వని వాళ్ళను ఏదో ఒక responsibility గా ఫీల్ అయ్యి ఉదయం మధ్యాహ్నం రాత్రుళ్ళు గుర్తుపెట్టుకుని భోజనం అయ్యిందా ?? పిల్లలెలా ఉన్నారు అన్న మాటలు మాత్రం అడిగి సమాధానం వచ్చాక సాంతం మాట్లాడకుండా వారి పనుల్లో వారు బిజీగా ఉండే భర్తలు ... ఇంట్లో పనంతా నేనే చేస్తున్నా అన్న భావనతోనో , తనను పట్టించుకోవడం లేదు అన్న నిరుత్సాహంతోనో భర్త ఏదడిగినా అలకలకు పోతూ పొడి పొడి మాటలు చెప్పే భార్యల ప్రవర్తన
భర్తలను మాట్లాడకుండా చేయడం లాంటివి సంభాషణను కట్ చెస్తాయి. అలా సంభాషణ వంతెన ఇద్దరి మధ్య తెగిపోయినప్పుడు అన్యోయతకి బదులు అపోహలు చోటు చేసుకుంటాయి . అందుకే వాళ్ళు స్నేహంగా ఉన్నప్పుడు ఈ సంభాషణ బలపడే అవకాశాలు అపోహలు దూరం చేసుకునేందుకు ఉపయోగపడతాయి. his means no secrets and no lies. This builds trust which is an important element of any relationship.
3. You will never be lonely: స్నేహం తో కూడిన దాంపత్య జీవితం భార్యని గాని భర్తను గాని ఒంటరిగా ఫీల్ అయ్యేలా చెయ్యదు. There is always someone special to share beautiful things and sorrows with you. You are around someone with whom you can be yourself and pour your heart out any time you want. So develop a beautiful friendship out of your marriage and you will never have to live alone.
4. Makes your life richer: స్నేహం మీ కుటుంబ జీవన విధానాన్ని , భార్యా భర్తల మధ్య అన్యోయతని పెంచి మిమ్మల్ని కుటుంబవిలువలు గల గొప్ప వారిగా ఆదర్శ దంపతులుగా నిలబడగలగడానికి ఉపయోగపడుతుంది.
ఇక ఎందుకు ఆలస్యం .. ఒకవేళ ఇప్పటికే పెళ్ళయి ఉంటె ఇక ముందు నుంచైనా మీ భార్యతోనో భర్తతోనో స్నేహంగా ఉండే ప్రయత్నం మొదలు పెట్టండి. లేదా పెళ్లి చేసుకోబోతున్న వారైతే మీ పార్టనర్ మీతో స్నేహంగా మెలగగలిగే పరిస్థితులను సంభాషణను సృష్టించుకుని స్నేహపూర్వక కుటుంభ జీవన విధానంలోకి అడుగుపెట్టండి.
Thursday, December 11, 2014
॥ పవిత్ర బంధానికి / పండంటి కాపురానికి - పన్నెండు సూత్రాలు॥
శ్రీరస్తూ శుభమస్తూ !!!
ఒకప్పుడు arranged marriages ఎక్కువగా ఉండేవి. ఇప్పుడు ప్రేమ పెళ్ళిళ్ళు ఎక్కువ అవుతున్నాయి. పెళ్ళికి ముందు అబ్బాయి అయినా అమ్మాయి అయినా ఒకలా జీవిస్తారు. ఎలా నడుచుకున్నా తల్లిదండ్రులు భరిస్తారు, బుజ్జగించుకుంటారు, భయపెడతారు, నాలుగు తిట్లు తిట్టి మన ఆలోచనలతో పాటు మనల్నీ సరైన దారిలో పెడతారు. అదే భావం మన తోడబుట్టిన వాళ్ళతో ఉండదు. వారితో మనం ప్రేమగా ఉన్నా, కీచులాటలు, పోట్లాటలు, అసూయలు అవ్వి కూడా చాలానే ఉంటూ ఉంటాయి. కొన్ని కుటుంబాలలో ఎక్కువ, మరి కొందరి విషయాల్లో తక్కువ. ఇక్కడ ఈ వ్యత్యాసం మన age difference వల్ల వస్తుంది. అమ్మ నాన్న అంటే గౌరవం ప్లస్ ఒక జనరేషన్ ముందు వారు కాబట్టి, ప్లస్ మనకి నమ్మకం... వారు మన మంచికే చెబుతారు అని. వినడం వినకపోవడం మన మీదనే ఆధార పడి వుంటుంది. అదే మన తోబోట్టువు అయితే? ఇంచు మించు ఒకే వయసు కాబట్టి ప్రేమ ఆప్యాయతలతో బాటు ఈర్హ్స్యా అసూయలు, చిన్ని చిన్ని గిల్లికజ్జాలు, పోట్లాటలు, ఒకొర్నకరు పోల్చుకోడాలు సహజం.
ఇప్పుడు అసలు topicకి వద్దాం. పెళ్లి అయ్యాక జంటల పరిస్థితి ఎలా ఉంటుందో. ఇక్కడ కూడా భార్యా భర్తలిద్దరూ ఇంచుమించు ఒక వయసు పరిధిలోని వారే. సో మన తోబోట్టువులతో ఉండే problems ఇక్కడా ఉంటాయి. ఇక పోతే major difference ఎక్కడా అంటే, వారిద్దరి పెంపకం, ఇంట్లో అలవాట్లు, పెరిగిన వాతావరణం, చుట్టూ ఉన్న ఆత్మీయుల, బంధువుల ఆచార వ్యవహారాలూ, వారితో అనుబంధాలు, etc. మరి అలాంటప్పుడు భార్య భర్తలిద్దరి బంధం అన్ని బంధాల కంటే కూడా చాలా సెన్సిటివ్ అంటే సుకుమారమైనది అని గ్రహించాలి. Completely ఒక వేరే గ్రహం నుండి ఇంకో గ్రహానికి వచ్చినట్టు భావించాలి. ఇది ప్రేమించి పెళ్లి చేసుకున్నా వర్తిస్తుంది, పెద్దలు కుదిర్చిన పెళ్లికైనా వర్తిస్తుంది. మనం ఒకరి ఆలోచనలను, వ్యక్తిత్వాన్ని అలవాట్లను గౌరవించనపుడు ఇబ్బందులు మొదలవుతాయి. పెళ్లి అయిన వెంటనే తల్లిదండ్రుల ప్రమేయాలు, పెళ్ళిలో ఆచరించలేదని చెప్పే ఏవో సాకులు, మా అమ్మాయో అబ్బాయో తన భార్య లేక భర్తకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారనే insecured feeling వల్లనో బేధాభిప్రాయాలు తప్పకుండా వస్తాయి. అక్కడే అసలైన చిక్కు. ఇవన్ని చినికి చినికి గాలి వానయ్యి చివరికి పోట్లాటలకి దారి తీస్తాయి. ఇక అక్కడి నుండి మొదలండి అహంభావం, ఆత్మనూన్యత , అబద్రతాభావం, అపార్ధాలు, miscommunication, etc, etc
ఇలాంటివి మొదటి సారి అనుభవంలోకి వస్తాయి కాబట్టి ఒకోసారి ఎలా స్పందించాలో తెలియక, మన మిడిమిడి జ్ఞానంతోనో, స్నేహితుల అనుభవాలతోనో, లేక వాళ్ళ కోణంలో నుండి చూసి ఆలోచించే మన తల్లిదండ్రులతోనో, తోబుట్టువులతోనో, చుట్టాలతోనో చర్చించి మనం స్పందిస్తాము. చాలా మట్టుకు ఇదే పధ్ధతి పాటిస్తారు కొత్త దంపతులంతా. అది సరైన పధ్ధతి కాదు. ఎందుకంటే వాళ్ళు ఎదుర్కొన్న సందర్భాలు వేరు, ఆలోచనలు, వ్యవహారాలూ అన్నీ వేరు. ప్రతి గుండెకి ఒక కథ ఉన్నట్టే, ప్రతి జంటకి ఒకో problem ఒకో విధంగా ఉంటుంది. అన్నిటికి ఒకే మంత్రం, ఒకే మందు అంటే ఎలా? రోగిని చూసి, రోగాన్ని పరికించి మందో మాకో, మంత్రమో తంత్రమో వెయ్యాలి. దంపతుల విషయంలోనూ అంతే. ఒకోజంటకి ఒకో పద్ధతి.
మొదటి సంవత్సరం చాలా కష్టపడాలి భార్యా భర్తలిద్దరూ. ఈ మొదటి సంవత్సరంలోనే ఉంటుంది అసలు మసాలా అంతా. అన్ని అడ్డంకులు ఎదుర్కొని, ఒకరినొకరు అర్ధం చేసుకోవడానికి సమయం ఇచ్చుకొని, ప్రతి సామరస్యంగా పరిష్కారాలు వెతుక్కొన్నాకనే, భవిష్యత్తులో అన్యోన్యతకి అంకురార్పణ అప్పుడు జరుగుతుంది. ఇప్పటి స్థితిని బట్టి ఏ నిర్ణయాలు తీసుకోవద్దు. మనం ఆలోచించాల్సింది ఒక్కటే. భార్యా భర్తలిద్దరూ ఎప్పటికీ అన్యోన్యంగా ఉండడం. అదే మన డెస్టినీ, మన గమ్యం. అందుకు అందరిని, అన్ని పరిస్థితులని ఎదుర్కోవాలి.
1. ముందు ఇద్దరు ఒక్కటి కాదు, వేరు వేరు అని గ్రహించాలి. ప్రేమతోనే ఒకరిని ఒకరు అన్ని విషయాలు అడిగి తెలుసుకోవాలి వాటిల్లో. ఎవరు ఏయే పనులు చూసుకోవాలి ఇంట్లో. ఇద్దరూ ఉద్యోగస్తులైతే, ఎవరు దేనికి ఖర్చు పెట్టాలి అని సీరియస్ గా కాదండోయ్.... నవ్వుతూ వర్క్ అండ్ మనీని విభజించుకోవాలి. మానవులం కదా, మతిమరుపు సహజం. సో డివిజన్ అఫ్ వర్క్ అండ్ మనీ రాసి పెట్టుకోవడం బెటర్.
2. తరువాత భార్యాభర్తలిద్దరూ సమానం అన్న విషయం గ్రహించాలి. భర్త మగవాడు, కాబట్టి తానే గొప్ప అనో. భార్య కట్నం తెచ్చింది, భర్త కంటే నాలుగాకులు ఎక్కువ చదివింది కాబట్టి తానే గొప్ప అనో అన్న అపోహలు మానుకోవాలి. ఎవరి జీతం ఎక్కువైతే ఏంటి? ఎవరి చదువు, అనుభవం ఎక్కువయితే ఏంటి? మనిషి మనిషికీ వ్యత్యాసం ఉండడం సహజం. మన అమ్మా నాన్న కాలం కాదు ఇది. మారుతున్న కాలాన్ని బట్టి మనం కూడా మారాలి. మన తోటి మానవులంతా సమానమే అన్న దృక్పథాన్ని అలవర్చుకొని నరనరాల్లో జీర్ణింపచేసుకోవాలి.
3. ఒకరినొకరు ముందు గౌరవించుకోవాలి. మీ భాగస్వామి ఇష్టాయిష్టాలని గౌరవించండి, వారి వృత్తిని గౌరవించండి. వారి తలిదండ్రులని, బంధువులని, స్నేహితులని గౌరవించండి. వారు ఇంటికొస్తే ఎందుకు వచ్చారురా బాబు అనుకోకుండా మీ వంతు సహాయం మీ భాగస్వామికి అందివ్వండి. మీ చుట్టాలుగా మీరిద్దరూ కలిసి ప్రవర్తించండి. వారిలో ఏ విషయమైనా నచ్చకపోతే, పోట్లాడకుండా ఇద్దరు చర్చించుకోండి. సమస్యకి పరిష్కారం ఆలోచించుకోండి.
4. ప్రతి ఒక్కరికి అలవాట్లు తప్పకుండా ఉంటాయి. మీ భాగస్వామి ఏదైనా చెబితే విసురుగా కాకుండా నమ్రతగా వినండి. మంచి అలవాట్లను కొత్తగా మనం పాటిస్తే తప్పులేదుగా. చెడ్డ అలవాట్లను వదులుకుంటే మంచిదే కదా. ఆచరించడం ఆచరించకపోవడం తరువాత విషయం. ఎవరి అలవాట్లు వాళ్ళవి. వారి అలవాట్ల వల్ల మీకు కాని మరెవరికైనా కాని ఇబ్బంది లేకపోతే పట్టించుకోకండి. ఎవరి అలవాట్లు వాళ్ళనే పాటించనివ్వండి. కొన్ని బుద్ధులు పుట్టకతో వచ్చినవి, పుల్లలేసినా పోవు. మరి ఈ విషయంలో దెబ్బలాటలు ఎందుకు? పెద్దమనసుతో వదిలెయ్యండి. అందరికి individuality కావాలి. నాకిష్టం వచ్చినట్లే ఉండాలి, ఇష్టం వచ్చినట్లే ప్రవర్తించాలి అన్న వితండ వాదం వదులుకోండి. ప్రేమ ఉంటే ఇలా ప్రవర్తించు అలా ప్రవర్తించు అని అడగక్ఖర్లేదు. వాళ్ళే మీకు అనుగుణంగా ప్రవర్తిస్తారు. మీ గౌరవించి ఇష్టపడడం మొదలు పెడతారు. కాని మీరు మిమ్మల్ని ప్రేమించనివ్వాలిగా. అంత space and time మీరు తనకి ఇవ్వాలి మరి.
5. వారి దుఃఖంలో ఓదార్పు మీరే కావాలి. వారి భయానికి మీరే ధైర్యం కావాలి. వారి నిస్సత్తువకి మీరే శక్తి కావాలి. వారి ఆలోచనకి మీరే ప్రేరణ కావాలి, వారికి తోడు నీడ, వారి నమ్మకం మీరే కావాలి. ఎప్పుడు వారిని మాటలతో, చేతలతో మోసం చెయ్యకండి. మీరు అనే మాట ముందు ప్రవర్తించే ముందు తనవైపు ఆలోచించి ముందడుగు వెయ్యండి.
6. పెళ్లి అవ్వగానే ప్రేమ అంతం కాదు. రోజు రోజుకి పెరిగేలా చూడండి. చిన్న చిన్న outings కి మీరిద్దరే వెళ్ళండి. మీ జీవిత భాగస్వామిని ఎప్పుడు స్నేహితులుగా చూడండి. మీరిద్దరూ ఏకాంతంగా గడపడానికి సమయం తీసుకోండి. అన్ని విషయాలు దాపరికం లేకుండా పంచుకోండి. కలిసి భోజనం చెయ్యండి, ఇంట్లో అత్తమామలో, మరుదులో, పిల్లలో ఉండి, తినే సమయాలు వేరే అయినా మీ ఇద్దరు కలిసి భుజించడం విషయంలో మాత్రం no reservations. ఈ విషయంలో ఎవ్వరు ఏమనుకున్నా పరవాలేదు. తరువాత అందరు మీ అన్యోన్యత గురించే చర్చించుకుంటారు, అసూయ పడితే పడతారు. That is their problem.
7. నవ్వు మహా ఔషదం. ఇల్లాలు వంటపని, ఆఫీసు ఉంటే ఆఫీసు పని, భర్త ఆఫీసు పనితో సతమతమయ్యి ముఖం వేల్లాడదీసుకొని ఇంట్లో ఉండకండి. ఫ్రెష్ అయ్యి నవ్వు మొహంతో మీ బెటర్ హాఫ్ కి కనపడండి. ఇదొక మాజిక్ టానిక్.
8. అహంభావాలు, పోల్చుకోవడాలు, చిన్న దెబ్బలాటలకే చెయ్యి చేసుకోవడాలు, తానూ మాట్లాడితే కాని నేను మాట్లాడను అనే పంతాలు, పట్టింపులు భార్య భర్తల బంధంలో పనికి రావు. ఇద్దరు ఒకోసారి అడ్జస్ట్ అవ్వాలి. ఎప్పుడు ఒకరి పంతమే నెగ్గితే, అది అనారోగ్య బంధమే.
9. చాల ముఖ్యమైన విషయం. భార్య భర్తల మధ్య మూడో వ్యక్తికి తావు ఇవ్వ కూడదు. వారు మీ తల్లిదండ్రులైనా, తోబోట్టువులైనా, ప్రాణ స్నేహితులైనా. మన జీవిత భాగస్వామి అతిగా ప్రవర్తిస్తే తప్పకుండా చెప్పుకోవాలి, కాని మన వాళ్ళ దగ్గర మాత్రమే. మనవాళ్ళు సలహా ఇస్తే వినండి, కాని వివేకంగా ఆలోచించి, సమయం సందర్భాన్ని బట్టి మీ నిర్ణయం మీరే తీసుకోండి. అత్తమామలను అమ్మా నాన్నా అని సంబోధించి చూడండి ఆప్యాయతలు పెరుగుతాయి. ఆడబిడ్డలతో, మరుదులు, మరదల్లతో, సోదరసోదరీ భావంతో మెలగండి. మూతివిరుపులు, చెవి కోరుక్కోవడాలు ఉండవు. అందరిని "నా కుటుంబం" అనుకోని ప్రవర్తించండి. అప్పుడు చుడండి "ది రియల్ వండర్స్ అఫ్ మారీడ్ లైఫ్".
10. ఎట్టి పరిస్థితుల్లోను మన జీవిత భాగ స్వామి ఎంత పెద్ద తప్పు చేసినా నలుగురిలో అవమాన పరచకండి, ముఖ్యంగా వారి తోబోట్టువుల దగ్గరో, మీ అమ్మానాన్నల దగ్గరో, తోటికోడలో, తోడల్లుడి దగ్గరో, పిల్లలముందో, స్నేహితులముందో. ఆ నాలుగు గోడల మధ్యే మీరు ఎం మాట్లాడుకున్నా, పోట్లాడుకున్నా. నలుగురికి మాత్రం మీ ఇద్దరు ఒక్కరే. మీ ఇద్దరిది ఒక్క మాటే. మీకు సంబంధించిన ఏ బాధాకరమైన, సంతోషకరమైన, ఏదైనా వార్తా, విషయం ఉంటె ముందు తెలపాల్సింది మీ జీవిత భాగ స్వామికే. తరువాతే మిగితా అందరు.
11. ముఖ్యంగా పక్కింటి పిన్ని గారో, ఆఫీస్ లో కొల్లీగ్ దగ్గరో ఇంట్లో విషయాలు అనవసరం. ప్రేమగా పలకరించిన వాళ్ళందరి దగ్గరా ఇంటి విషయాలు చర్చించుకోకూడదు. ఎంత అమ్మా నాన్న అయినా, ప్రాణ స్నేహితుడైనా, ఇంట్లో మీ భార్య / భర్త తరువాతనే అన్న విషయం గ్రహించండి.
12. ఈరోజుల్లో ముఖపుస్తకాల వంటి సోషల్ మీడియాల్లో పరిచయాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. అందరు ఎంతో ప్రేమగానే ఆప్యాయంగానే మాట్లాడతారు. ఇక్కడ పరిచయం అయిన వాళ్లకి ఇంటి విషయాలు అస్సలు చెప్పకూడదు. వారు ఎంతటి మహామహులైనా సరే, మీకు ఎంత దగ్గరైనా సరే. తరువాత వారి ముందు తల దించుకోవాల్సింది మీరే. ఇంట్లో గుట్టు బయట పెట్టినందుకు మూల్యం చెల్లించాల్సిందీ మీరే. సోషల్ మీడియాని మితంగా వాడండి. మీ సమయాన్ని మీ వాళ్ళతో ఎక్కువగా కేటాయించండి. వాళ్ళు మాత్రమే మీ వాళ్ళు. మీ జీవితం చరమాంకంలో తోడుగా ఉండేవాళ్ళు. ముందు మీరు మీ కుటుంబం, మీ స్నేహితులు, బంధువులు, తరువాతే మీ సోషల్ మీడియా మిత్రులు. ఇక్కడ మంచి చేసేవారికంటే, హితోక్తులు, మంచి మాటలు, నీతులు చెప్పే వాళ్ళే ఎక్కువ. అందరు మంచి మనుషుల్లానే ఉంటారు. మరి వారి వారి ఇంట్లో, మనస్తత్వాల్లో ఎట్లాంటివారో మనకి తెలియదు కదా. మంచి చెబితే వినడం వరకే. కాని అతి దేనిలోనూ పనికి రాదు. ఎవ్వరిని ఎంతలో ఉంచాలో అంతలోనే ఉంచండి. ఈ మధ్య విడాకులు, హత్యలు, మోసాలు, మానసిక రుగ్మతలు, నిద్రలేమి, etc వీటన్నిటికి ముఖ్య కారణం ది గ్రేట్ మాయ విశ్వం మన FB వంటి మాయా ప్రపంచం. సో తస్మాత్ జాగ్రత్త. ఇవి మీ జీవితభాగస్వామి పట్ల ప్రేమని తగ్గించడమే కాక దూరం కూడా చేస్తుంది
ఇవన్ని పెళ్లి మొదటి సంవత్సరంలో మీరు పాటిస్తే, మీ జీవితభాగస్వామిని అర్ధం చేసుకోవడానికి ప్రయత్నిస్తే, మీ జీవితం ఒక గమనాన్ని ఏర్పరుచుకుంటుంది. మీ ఇద్దరి జీవితాలతో పాటు మీ చుట్టూ వున్నా వారి జీవితం కూడా ఆనందంగా ఉంటుంది. అప్పుడే మీరు నలుగురికి ఆదర్శంగా నిలిచి, ఆదర్శ దంపతులవుతారు.
----------------సర్వే జనః సుఖినోభవంతు-----------------...

నమ్మకం
ఒక వ్యక్తి తన జుట్టు సమంగా కత్తిరించుకోవడానికి క్షవరసాలకి వెళ్లాడు. అక్కడ మంగలి, పని మొదలుపెట్టగానే ఇద్దరూ చాలా విషయాలు మాట్లాడుకోవడం ప్రారంభించారు. భగవంతుడి గురించి మాట్లాడడం మొదలుపెట్టేసరికి, మంగలి"నాకు భగవంతుడు ఉన్నాడు అని నమ్మకం లేదు" అన్నాడు.
"ఎందుకు అలా అంటున్నావు"అని ఆ వ్యక్తి ఆడిగాడు.
మంగలి ఇచ్చిన సమాధానం." బైటకి వెళ్ళి చూస్తే, భగవంతుడు ఉన్నాడు అని నమ్మకం కలగదు. నిజంగానే భగవంతుడు ఉంటే, ఎందుకు మనుషులు సుస్తీతో బాధ పడుతున్నారు? ఇంతమంది అనాధపిల్లలు ఉంటారా? ఎవరయినా బాధ పడతారా? నిజంగా భగవంతుడికి ప్రేమ ఉంటే ఇవన్నీ చుస్తూ ఊరుకుంటాడా?
ఆ వ్యక్తి కాసేపు ఆలోచించి, ఏమీ సమాధానం చెప్పలేదు. అనవసరంగా వాదన చేయడం ఇష్టం లేక. మంగలి పని ముగించగానే, ఆ వ్యక్తి బయటికి వెళ్ళిపోయాడు. రోడ్డు మీద
ఒక మనిషిని చూసాడు. పొడుగు జుట్టుతో సమంగా కత్తిరిచుకోకుండా, చూడడానికి అసహ్యంగా ఉన్నాడు. అప్పుడు, ఆ వెంటనే, మంగలి కొట్టుకి వెళ్ళి ఇలా అన్నాడు. "నీకు తెలుసా, మంగలి ఉన్నాడు అని నాకు నమ్మకం లేదు"
అప్పుడు, మంగలి, "అలా ఎలా అనగలువు, నేను ఇప్పుడే నీకు పని చేశాను కదా"
అప్పుడు ఆ వ్యక్తి ఇలా అన్నాడు, "నిజంగానే మంగలి ఉంటే, బయట ఆ మనిషి అలా, అంత జుట్టుతో అసహ్యంగా ఉండడు."
అప్పుడు మంగలి "నా దగ్గరికి రాకపోతే నేను ఏమి చేయ గలను" అని అన్నాడు.
దానికి ఆ వ్యక్తి, "మనుషులు భగవంతుడి సహాయం కోసం, దగ్గరికి వెళ్ళాలి. ఎప్పుడు అయితే భగవంతుడికి దగ్గర అవుతామో ,అప్పుడు సంతోషంగా ఉంటాము. భగవంతుడు ఉన్నాడు."
నీతి:
------
భగవంతుడు కావాలి అని అనుకునే వాడికి, భగవంతుడు తప్పకుండా ఉంటాడు. భగవంతుడు ఎక్కడ లేడు? నీ మొహంలో చిరునవ్వు, ఎదుటి వాడు బాధ పడుతుంటే జాలి చూపించటం, మన దగ్గర వాళ్ళకి ప్రేమగా ఉండడం,అన్ని కూడా, భగవంతుడు మనలో ఉండి చేయిస్తున్నాడు. భగవంతుడి కోసం మన హృదయంలో దృష్టి పెడితే నవ్వుతూ
కనిపిస్తాడు.

Saturday, September 13, 2014
నా గుండెలో వున్నది నీ ప్రాణమే !!
ఒక అమ్మాయి తన లవర్ నీ ఇలా అడిగింది - "
వచ్చేవారం నా బర్త్డే
కదా ఏ గిఫ్ట్ ఇస్తున్నావురా?. ." అని
అడిగింది.
తన లవర్ ఇలా అన్నాడు " ఇంకా వారం వుంది
కదా అప్పుడే
అడుగుతే ఎలా చెప్పనురా బంగారం ? అయినా
సరే చెప్తున్నా..
ఇప్పటి వరకు ఎవరు ఇవ్వని గిఫ్ట్
నీకు నేను ఇస్తా..!" అని మాట
ఇచ్చాడు..
అమ్మాయి బర్త్డే కి
మూడు రోజులు ముందు ఆ అమ్మాయి సృహ
తప్పి
పడిపోయింది. వెంటనే హస్పిటల్
కు తీసుకు వెళ్ళారు.
డాక్టర్ ఆ అమ్మాయిని చెకప్ చేసి, తన
కుటుంబ సభ్యులతో ఇలా
చెప్పాడు " తను ఎక్కువ రోజులు బ్రతకదు.
తనకు వెంటనే సేమ్
బ్లడ్ గ్రూప్ వున్నవారు ఎవరైన వారి గుండెని
డోనేట్చేయాలి లేకపోతే
చనిపోతుంది.. " అని చెప్పాడు.
అది విని ఆ అమ్మాయి తన లవర్
చేతులు పట్టుకొని ఏడుస్తూ - ఇలా
చెప్పింది " రేయ్!! నేను కొద్దిరోజుల్లో
చనిపోతానంట.
నువ్వు నన్ను మర్చిపోరా!.. ప్లీజ్ రా..! నా
చివరి కోరిక ఇదేరా.
నువ్వు ఇక్కడి నుంచి నాకు దూరముగా
వెళ్ళిపోరా!! నా కంటికి
కనిపించనంత దూరంగా వెళ్ళిపోరా.. " అని అంది.
ఆ అబ్బాయి ఓ చిరునవ్వు నవ్వి "
నువ్వు ఎక్కడకి పోతావురా
బంగారం. నన్ను వదిలి నీకు ఏమి కాదురా
నేను ఉన్నాను కదా.."
ఆ అమ్మాయి ఏడుస్తూ అంది - "
నువ్వు అంత నమ్మకంగా ఎలా
చెబుతున్నావురా నేను బ్రతుకుతాననీ ?"
ఆ అబ్బాయి - అమ్మాయి నుదుటి మీద
ముద్దు పెట్టి, " నీకు బర్త్డే
గిఫ్ట్ ఇవ్వలేదు కదా..! నీకు వచ్చే గిఫ్ట్
చూడు..
నువ్వు బ్రతుకుతావు.." అని చెప్పి అక్కడి
నుంచి వెళ్ళిపోయాడు.
రెండు రోజులు తర్వాత ఆపరేషన్ జరిగింది.
కొద్దిరోజుల తరవాత ఆ
అమ్మాయి డిశ్చార్జ్ అయ్యి ఇంటికి
వెళ్ళిపోయింది.. తన బెడ్రూంలో ఒక
లెటర్ వుంది. ఆ లెటర్లో ఇలా వ్రాసి వుంది -
ప్రియమైన బుజ్జిబంగారం..
నీవు ఈ ఉత్తరంని చదువుతున్నావు కదా!
నువ్వు బ్రతుకుతావుని చెప్పాను కదా !!
నా ప్రాణం వున్నంత వరకు నువ్వు ఎలా
చనిపోతావు రా ?
నా ఆఖరి శ్వాస వరకు నీ కోసమే బ్రతకాలి
అనుకున్నా..
నా ప్రాణం ఇచ్చైనా బ్రతికించుకోవాల నీ
అనుకున్నా.
"బుజ్జి" - నువ్వు మొన్న అడిగావు కదా - నా
బర్త్డేకి ఏ గిఫ్ట్
ఇస్తావనీ..!!
నీకు అప్పుడు చెప్పాను కదా..
నీకు ఎవరు ఇవ్వని గిఫ్ట్ నేను ఇస్తాననీ,
నీకు ఎవ్వరు ఇవ్వలేనీ గిఫ్ట్ గా - నా గుండెని
నీకు కానుకగా
ఇచ్చా!
బంగారం.. ఏడవకు రా..
నేను చనిపోయినా నా గుండె - నీ దగ్గరే వుంది
కదరా!!

Sunday, July 27, 2014
yagnopaneetham aug Monthly Magazine Aug2014
Online లో చదవడానికి క్రింది లింక్ క్లిక్ చేయండి | Click Below Link to View / Read Online.

క్రింది నుండి డౌన్లోడ్ చేసుకోండి | Download From The Below Link
Saturday, July 12, 2014
మానవ జన్మ ఎంతో విలువైనది - ఒక రాయి కథ
రాళ్ళు కొట్టుకుని జీవించే ఒక అతను ఒక రోజున తన
పని చేసుకుంటూ ఉండగా కను చూపులో ఒక రాయి ఎంతో ఆకర్షణీయంగా కనిపించింది.
దానికి మురిసి అతను ఆ రాయిని గుడ్డలో కట్టుకుని ఇంటికి తీసుకుని వెళ్లి
భార్యకు ఇచ్చాడు. ఆమె దాన్ని గూట్లో
పెట్టింది. కొన్ని రోజుల తరువాత కుంకుడు కాయలు కొట్టడానికి రాయి దొరక్క
దాన్ని ఉపయోగించుకుంది తరువాత తరువాత ఆ రాయిని అదే పనికి చాలా సార్లు
వాడుకున్నది. ఒక రోజున వాళ్ళ పిల్లాడు రాళ్ళ ఆట ఆడుకోటానికి ఆ రాయిని
తీసుకుని బయటకి వెళ్ళాడు. కొద్ది సేపటికి అటుగా మిఠాయిలు అమ్ముకునే అతను
వచ్చేటప్పటికి పిల్లలు అందరు ఆ మిఠాయి బండి చుట్టూ మూగారు. ఈ పిల్లాడు
కూడా రాళ్ళు చేతిలో పట్టుకుని వెళ్ళాడు. ఆ రాయి మిఠాయి వ్యాపారిని
ఆకర్షించింది. అతను బాబుతో ఆ రాయి నాకు ఇస్తావా .. నీకు ఒక చిక్కీ
(పల్లీ పట్టీ) ఇస్తాను అన్నాడు. పిల్లాడు సంతోషంతో ఆ రాయి అతనికి
ఇచ్చేశాడు.
సాయంత్రం చెత్త వస్తువులు ఏరుకునే అతని స్నేహితుడు చూసి ఆ రాయి గురించి అడిగితే అతను ఎవరో పిల్లాడి చేతిలో ఉంటె బాగుంది కదా అని ఒక చిక్కీ ఇచ్చి తీసుకున్నాను అని చెప్పాడు. ఆ స్నేహితుడు ఆ రాయిని కోరగా అతనికి ఇచ్చేశాడు. అతను ఆ రాయిని మిగతా చెత్త వస్తువులతో కలిపి చెత్త వస్తువులు కొనే వ్యాపారి వద్దకి పోయి వస్తువులని వివిధ రకాలుగా విభజించి అతనికి అమ్మగా అతను ఈ రాయిని చూసి అది ఏమిటి ఇవ్వవా అని అడిగాడు. దానికి అతను కొంత రొక్కము తీసుకుని ఆ రాయి వ్యాపారి కి ఇచ్చేశాడు. బాగుంది కదా అని వ్యాపారి దాన్ని బల్ల పైన పేపర్ వెయిట్ గా వాడ సాగాడు. కొన్ని రోజులకి ఒక టోకు వ్యాపారి ఇతని దుకాణానికి వచ్చి ఆ రాయిని చూసి, అతనికి కొంత రొక్కం ఇచ్చి ఆ రాయిని తీసుకున్నాడు. దాన్ని వజ్రాల వ్యాపారి వద్దకి తీసుకుని వెళ్లి పరీక్ష చేయిస్తే అది కొన్ని కోట్లు విలువ చేసే మేలిమి వజ్రం అని తేలింది.
నీతి --- అదే రాయి ని ఒకళ్ళు కుంకుడు కాయలు కొట్టుకో డానికి వాడుకున్నారు. ఒకళ్ళు రాళ్ళ ఆట ఆడుకోటానికి వాడుకున్నారు. ఒకళ్ళు ఒక చిక్కీ కోసం దాన్ని ఇతరులకి ఇచ్చేశాడు. ఒకళ్ళు దాన్ని పేపర్ వెయిట్ గా వాడుకున్నారు. నిజంగా దాని గురించి తెలిసిన వ్యక్తి దాని విలువ రాబట్టుకున్నాడు. అట్లాగే ఈ మానవ జన్మ ఎంతో విలువైనది. ఎంతో అరుదుగా లభించేది. దాన్ని దేనికోసం వాడుకోవాలి అన్నది వారి వారి బుద్ధి ప్రచోదనానికి లోబడి ఉంటుంది. మానవ జీవిత పరమార్థం తెలిసికొనినవారు ఈ జన్మను సరిగా వాడుకుంటూ జీవన్ముక్తి పొంద గలుగుతున్నారు. లేని వారు ఈ జీవితాన్ని వృథా చేసుకొనుచున్నారు.

Thursday, May 29, 2014
నమ్మకం
నమ్మకం
ప్రేమ
ఒక రోజు ఒక చిన్న పాప, తన తండ్రి వంతెన దాటుతున్నారు. తండ్రి, తన పాప ఎక్కడ పడిపోతుందో నని, పాపతో ఇలా అన్నారు,'చిన్న తల్లి, నా చెయ్యి పట్టుకో, అప్పుడు నువ్వు, నదిలో పడిపోకుండా ఉంటావు.'
అప్పుడు ఆ పాప ఇలా అంది,'లేదు నాన్నగారు, మీరే నా చెయ్యి పట్టుకోండి'.
'ఏమిటి తేడా' అని తండ్రి ఆశ్చర్యంగా అడిగేరు.
'చాలా తేడా ఉంది నాన్నగారు' అని పాప సమాధానం చెప్పింది.
'నేను మీ చెయ్యి పట్టుకుని, నాకు ఏమైన అయితే, నేను మీ చెయ్యి వొదిలెయచ్చు కదా. కాని మీరు నా చెయ్యి పట్టుకుంటే నాకు ఖచ్చితంగా తెలుసు, ఏది ఏమైన, మీరు నా చెయ్యి వొదలరు అని'.
నీతి :-
భగవంతుడు మనందరికి తండ్రి. భగవంతుడిని మనం వదులుకోవాలి అని అనుకున్నాఆయన మనల్ని వదలరు.
భగవంతుడిని గట్టిగా పట్టుకోవాలి, ప్రేమతో, భక్తి తో కట్టెయ్యాలి.
Friday, May 16, 2014
ఆత్మవిశ్వాసం నమ్మకం
నమ్మకం
ఒక రోజు నేను అందర్నీ వదిలి వెళ్ళిపోవాలని నిశ్చయించుకున్నాను. నా ఉద్యోగం, నాకు ఉన్న అనుబంధాలు,ఆధ్యాత్మికత పట్ల నాకున్న శ్రద్ధ అన్నీ వదిలెయ్యాలనిపించింది.
చివరిసారిగా భగవంతుడితో మాట్లాడదామని అడవిలోకి వెళ్ళేను.
దేవుడా ! "వీటినుండి వెళ్ళిపోకుండా నిలబడడానికి నాకు ఒక కారణం చూపించగలవా" అని అడిగాను.
అప్పుడు భగవంతుడు , నీ చుట్టూ ఉన్న అడవిమొక్కలు మరియు వెదురుచెట్లను ఒక్కసారి చూడు అన్నాడు. నేను చూసానని చెప్పేక ఈ విధంగా చెప్పడం మొదలుపెట్టేడు. నేను అడవిమొక్కల విత్తనాలు, వెదురు విత్తనాలు ఒక్కసారే పాతేను. రెండింటికి నీరు,వెలుగు అందేలాగ సమంగా శ్రద్ధ తీసుకున్నాను.అడవిమొక్కలు తొందరగా ఎదగడం ప్రారంభించాయి.వాటి పచ్చదనంతో నేలంతా ఎంతో అందంగా కనిపించసాగింది.వెదురు విత్తనాలు అలాగే వున్నాయి.వాటిలో ఏమాత్రం ఎదుగుదల లేదు, అయినా నేను నిరాశ పడలేదు. ఒక సంవత్సరం గడిచింది, అడవిమొక్కలు ఇంకా బాగా ఎదిగి నేలంతా పరచుకుంటున్నాయి, కాని వెదురు విత్తనాలు అలాగే వున్నాయి, అయినా నేను నిరాశపడలేదు. మూడవ సంవత్సరంలో కూడా వెదురు విత్తనాల్లో మొలక రాలేదు, అయినా నేను నిరాశపడలేదు, నాలుగవ సంవత్సరంలో కూడా ఎలాంటి ఎదుగుదల లేదు ఐదవసంవత్సరంలో చిన్న మొలక కనిపించింది. అడవిమొక్కలతో పోలిస్తే చాల తక్కువనే చెప్పాలి,కాని 6నెలలు గడిచేసరికి 100 అడుగుల ఎత్తు వెదురు చెట్లు లేచాయి.5 సంవత్సరాలుగా వెదురు విత్తనాలు భూమిలో వుండి , చెట్టుగా మారేక నిలబడడానికి అవసరమైన వేళ్ళను బలంగా తయారుచేసుకున్నాయి. నా సృష్టిలో ఏ ప్రాణికీ అది చెయ్యలేని పనిని నేను ఇవ్వను. ఇన్ని సంవత్సరాలుగా నువ్వు పడుతున్న ఒత్తిడి వల్ల జీవితాన్ని ఎదుర్కొందుకు అవసరమైన ధైర్యం నీలో పెరుగుతోంది.వెదురు చెట్ల విషయంలో నిరాశపడి వాటిని వదిలిపెట్టలేదు, అలాగే నిన్ను కూడా వదిలిపెట్టను.
నిన్ను నువ్వు ఇతరులతో పోల్చుకుని తక్కువ చేసుకోకు. అడవిమొక్కలు, వెదురుచెట్ల లక్ష్యం ఒకటికాదు, కాని ఆరెండుకలిసి అడవిని అందంగా చేస్తున్నాయి. నీకు కూడా మంచికాలం వస్తుంది. అప్పుడు నువ్వు కూడా జీవితంలో పైకి ఎదుగుతావు. నీ ఎదుగుదల ద్వారా నా కీర్తిని వ్యాపింపచెయ్యి అని చెప్పేడు. దేవుడు నన్ను వదిలిపెట్టడన్న నమ్మకంతో నేను ఇంటికి తిరిగివచ్చేను. భగవంతుడు ఈ విశ్వానికే తండ్రి కాబట్టి తన పిల్లలవిషయంలో అశ్రద్ధ ఎప్పుడూ చూపడు. ఒత్తిడి తట్టుకోలెక మనమే ఆయన్ని అపార్థం చేసుకుంటాము. మంచి రోజులు సంతోషాన్ని ఇస్తే , చెడ్డ రోజులు అనుభవాల్ని ఇస్తాయి. జీవితంలో రెండెంటి విలువ తెలుసుకోవడం మన కర్తవ్యం
.
నీతి: ఇతరులతో పొల్చుకోవడం మానేసి మన పనిమీద దృష్టి పెట్టగలిగితే విజయం సాధించడం సులభం అవుతుంది. మన కర్తవ్యం నిర్వహించి మిగిలినది భగవతుడికి వదిలెయ్యాలి. అడవిమొక్కలు, వెదురుచెట్లలాగే మనుషులందరి జీవితాలకి విభిన్నమైన లక్ష్యాలు ఉంటాయి. నమ్మకంతో ప్రయత్నం చేసి వాటిని చేరుకోవడం మన కర్తవ్యం.

Saturday, May 3, 2014
నీ సమయాన్ని నేను కొనగలనా?
నీ సమయాన్ని నేను కొనగలనా?
ఒక వ్యక్తి చాల ఆలస్యం గా ఇంటికి వచ్చాడు. గుమ్మం ముందు తన కోసం ఎదురు చూస్తున్న తన కుమారుడిని చూసాడు.
కొడుకు: నాన్న నేను నిన్ను ఒక ప్రశ్న అడగొచ్చా?
తండ్రి: హ తప్పకుండ అడుగు..
కొడుకు: నాన్న నువ్వు గంటకి ఎంత సంపాదిస్తా
వ్?
తండ్రి: అది నీకు అనవసరమైనది. అయిన నీకు ఎందుకు?
కొడుకు: నాకు తెలుసుకోవాలని ఉంది , దయచేసి చెప్పండి నాన్న, నువ్వు గంటకి ఎంత సంపాదిస్తావ్?
తండ్రి: సరే, నేను గంటకి 1000 రూపాయలు సంపాదిస్తాను.
కొడుకు: అవునా, అని తన తలదించుకొని , నాన్న నాకు 500 ఇస్తావా?
తండ్రి: కోపంతో నీకు ఎందుకు అంత డబ్బు... నీకు కావాల్సిన ఆట బొమ్మలు, నీకు ఏది కావాలంటే అన్ని తెచ్చాను గా! ఇంకా ఏంటి ? నోరుముస్కోని నీ గదిలోకి వెళ్లి పడుకో.
ఆ పిల్లాడు బాధతో తన గదిలోకి వెళ్లి పడుకున్నాడు.
ఆ తండ్రి కాసేపు కూర్చొని, ఇంకా కోపంతో ఎందుకు నా కొడుకు ఇలాంటి ప్రశ్నలు అడుగుతున్నాడు. అయిన వాడికి ఎంత దైర్యం నన్నే డబ్బు అడుగుతున్నాడు అది 500 రూపాయలు.
ఒక గంట తర్వాత ఆ వ్యక్తి కొంచెం శాంత పడి , ఆలోచించటం మొదలెట్టాడు...
వాడికి బాగా అవసరమైతేనే ఇంత డబ్బు అడుగుతాడు. లేకపోతె అడిగేవాడు కాదు కదా.. అయిన నేను సంపాదిస్తుంది వాడి కోసమే కదా... ఛ అనవసరం గా నా పనిలోని కోపం అంతా వాడి మీద చూపించాను.
అని వాడి గదిలోకి వెళ్లి ,
తండ్రి: నిద్రపోతున్నావా నాన్నా!!!
కొడుకు: లేదు నాన్న మేలుకువతోనే ఉన్న.
తండ్రి: నన్ను క్షమించు రా నా పని లో కోపాన్ని నీ మీద చూపించ.. ఇదుగో నువ్వు అడిగిన 500 తీసుకో...
కొడుకు: ఆనందంతో, థాంక్స్ నాన్న..
అని తన దిండు కింద నలిగిపోయిన డబ్బులుని తీసి లేక్కపెడుతున్నాడు.
తన దగ్గర డబ్బులుండి కూడా అడిగిన తన కుమారుడి ఇంకా కోపం వచ్చి...
తండ్రి: అయిన నీ దగ్గర డబ్బు ఉండి కూడా నను ఎందుకు అడిగావు???
కొడుకు: నాన్న ఇప్పుడు నా దగ్గర మొత్తం 1000 రూపాయలు ఉన్నాయి. ఇప్పుడు " నేను నీ గంట సమయాన్ని కొనగలనా! దయచేసి మీరు రేపు కొంచెం తొందరగా వస్తే నేను మీతో భోజనం చేద్దాం అనుకుంటున్నా....
వెంటనే తండ్రి కొడుకుని తన చేతులతో కొడుకుని హత్తుకొని,
తండ్రి: నన్నూ క్షమించురా!! నేను ఇంకా ఎప్పుడు ఇలా చేయను...
అప్పటి నుండి తన కొడుకుతో కొద్ది సమయం గడుపుతూ ఉన్నాడు
ప్రియ మిత్రులారా, మీలో ఎంత మంది మీ కొడుకులతో సమయం గడుపుతున్నారు???

Thursday, May 1, 2014
ప్రార్థించే పెదవుల కన్నా, సాయం చే సే చేతులు మిన్న

చాలా మంది మనుషులకి అనిపిస్తుంది, ఎంత ప్రార్థించినా కష్టాలు తీరట్లేదు, భగవంతుని కృప లేదు అని. శ్రీ రామాయణంలో ఒక కధ చదివితే అర్థమౌతుంది.
విభీషణుడు ఒక రోజు హనుమంతునితో ఇలా అన్నారు. 'హనుమాన్ నీవు కోతివి అయినా కూడా, నీ మీద భగవంతుని కృప ఉంది, నేను ఎంత రాముడి ధ్యానంలో ఉన్నా, ఆ కృప నాకు రాలేదు'.
అప్పుడు హనుమంతులవారు ఇలా అన్నారు, విభీషణా! మీరు నిజంగానే, శ్రీరాముడి ధ్యానంలో ఉన్నారు, కానీ, శ్రీ రాముని కార్యంలో ఎంత పాల్గొన్నారు? కేవలం, శ్రీరాముని నామం ధ్యానం చెయ్యటం వల్ల, కృప రాదు. మీ అన్న రావణుడు,సీతమ్మవారిని, తీసుకుని వచ్చినప్పుడు, సీతాదేవికి ఏమి సహాయము చేశారు. కొంచెమైనా, శ్రీరాముని బాధ తగ్గించే ప్రయత్నం చేసేరా....
నీతి :
కేవలం భగవంతుని మీద, గురువు మీద, భక్తి, ప్రేమ ఉంటే సరిపోదు. వారు నేర్పించినవి, సాధనలో పెట్టాలి. వాటిలో ఒక మార్గం, మనుషులని ప్రేమించటం, సేవ చెయ్యటం.

చివరి బంధం
ఒక
సామాన్య రైతు కుటుంబం లో పుట్టిన ఒక రైతు తన కొడుకుని ఒక గొప్ప వ్యక్తి గా
చూడాలి అనుకున్నాడు..!! రేయి అనక, పగలు అనక కష్టపడి చదివించాడు..!! నాన్న
నెను చదవటానికి పుస్తకం లేదు..!! కొనడానికి డబ్బులు లేవు అని అడిగితే ఆ
తండ్రి కష్టపడి చేస్తున్న వ్యవసాయం తో పాటు ఒక చిన్న ఉద్యోగం లో చేరి తన
కొడుక్కి కావల్సిన ప్రతీది ఇస్తూ, సౌకర్యం గా పెంచాడు..!!
'కొన్ని సంవత్సరాలు తరువాత ఆ కొడుకు ఒక గొప్ప వ్యక్తి గా ఎదిగాడు..!! ఒక పెద్ద ఇంజినీర్ అయ్యాడు.. అంచలు అంచలు గా ఎదిగి ఒక కంపెనీ స్థాపించాడు..!! ఇంత స్థాయి కి తన కొడుకుని తీసుకు రావడానికి ఒక కిడ్నీ తో పాటు తన తండ్రి కి అయిన ఖర్చు "సుఖం లేని జీవితం, నిద్ర మరచిన రాత్రులు, అలుపు ఎరుగని కష్టం
అసలు కష్టమే లేని జీవితం చుస్తున్నాడు కొడుకు..!! తన చదువు కోసం కిడ్నీ అమ్మి చదివించిన తన తండ్రి అంటే ఆ కొడుకుకి ప్రాణం..!! తన తండ్రి ని ఎంతో ప్రేమ గా చూసుకుంటున్నాడు..!! వయసు పైబడింది..!! తండ్రి ఆరోగ్యం క్షీనించింది..!! 6 సంవత్సరాల బబు కి 60 సంవత్సరాల వృద్ధుడికి తేడా వుండదు అంటారు..!! ఎందుకో తెలుసా?? వాళ్ళ ఇద్దరికి కూడా ఒకరి సహకారం కావాలి..!! కాని అదే కొడుకు తనకి నడక నేర్పిన తండ్రి చివరి రోజుల్లో నడవలేక అవస్త పడుతుంటే గాలికి వదిలేసాడు..!!
తన మీద తన కొడుకుకి ప్రేమ ఎందుకు కరువు అయ్యింది అని ఆ తండ్రి బాధపడని రోజు లేదు..!! తాగి ఇంటికి వచ్చే వాడు..!! చివరి రోజుల్లో చెడిపోతున్న కొడుకుని చూసి ఏడవని రోజు లేదు ఆ తండ్రికి..!!
చివరికి ఒక రొజు ఆ కొడుకు తన తండ్రి ని ఎంత వద్దు అని మొత్తుకుంటున్నా బలవంతం గా తీసుకుని వెళ్ళి ఒక వృద్ధాశ్రమం లో చేర్చాడు..!! కాలం గడిచింది, 6 నెలలు గడిచిన కూడా తన కొడుకు నుండి ఒక్క ఫోన్ రాలేదు...!! ఇప్పటికి ఆ కొడుకు తనకి ఇస్తున్న విలువకి ఒక పక్క బాధపడుతూనే ఇంకొకపక్క ఆ కొడుకు కోసం తను పడిన కష్టాన్ని తలుచుకుంటూ గర్వ పడుతున్నాడు..!! వున్నట్టు ఉండి ఒక ఫోన్ కాల్, దగ్గరలో వున్న హాస్పిటల్ లో ప్రానాపాయ స్తితి లో తన కొడుకు వున్నాడు అని..!! తనని ఏ మాత్రం పట్టించుకోని తన కొడుకు చావు బ్రతుకుల్లో వున్నాడని తెలిసిన ఆ తండ్రి పరుగు పరుగున వెళ్ళి తన కొడుకుని కలుసుకున్నాడు..!!
అప్పుడు ఆ కొడుకు తన తండ్రి తో పలికిన మాటలు..!!
"నేను చచ్చిపోతున్నాను నాన్న..!! పుట్టిన ప్రతి వ్యక్తి ఒక రోజు చనిపొతాడు కాని ఎప్పుడు చనిపోతాడు అనేది ఎవరికి తెలీదు..!! కాని నాకు దేవుడు ఆ అవకాశం ఇచ్చాడు.. నేను చనిపోతాను అని నాకు 1 సంవత్సరం ముందె తెలుసు నాన్న..!! అందుకే మిమ్మల్ని దూరం గా వుంచాను..!! నా మీద అసహ్యం పుడితే నేను చనిపోయిన రోజు నన్ను చూసి నువ్వు ఏడవకుండా వుంటావు అని..!! కాని నా చివరి శ్వాస నీ వడిలో పడుకుని వదలాలి అని వుంది నాన్న..!! నా చావు కన్నా ముందు నేను చుపించిన ద్వేషానికి పశ్చ్యాతాపం గా నీ వడిలో నా శ్వాస వదలాలి అని వుంది నాన్న...!! " అంటూ తన తండ్రి వడిలోనే ప్రానాలు విడిచాడు.. !!
చనిపోయిన కొడుకుని చూస్తు "పిచ్చోడా!! నువ్వు నన్ను ద్వేషిస్తే నీ మీద అసహ్యం పెంచుకోడానికి నువ్వు నా శత్రువు కాదు నాన.!!. నా కొడుకువి..!! " అని బరువెక్కిన గుండెతో పలికిన మాటలు ఇంకా నా చెవిలో మారుమ్రోగుతున్నాయి...!!
కొడుకు చనిపోయిన తరువాత ఎంతో మంది అనాధలను దత్తతు తీసుకుని వాళ్ళని పెంచి పోషిస్తూ, చదివిస్తూ ఆ తండ్రి కూడా ఒక రోజు ప్రాణం విడిచాడు.....!!
ఇదే సమాజం లో రోడ్ మీద పడి వున్న కొంత మంది పిల్లల్ని దత్తతు తీసుకుని వాళ్ళని చదివిస్తున్న గొప్ప వాళ్ళు వున్నారు... వాళ్ళకి ప్రేమ విలువ తెలీదా?? లేక అసలు వాళ్ళలో ప్రేమ లేదు అంటారా??
ప్రతీ బంధాన్ని చివరి బంధం గా భావించు.. అప్పుడే నీకు ప్రేమించడం తెలుస్తుంది...
ప్రతీ క్షణాన్ని చివరి క్షణం గా భావించు.. అప్పుడే నీకు ప్రేమ విలువ, మనిషి విలువ, కాలం విలువ ఏంటో తెలుస్తుంది..

TAKE CARE OF MY EYES
అనగనగా ఒక గుడ్డి అమ్మయి,
తనకీ తను తన బాయ్ ప్రెండ్ తప్ప ఈ ప్రపంచంలో ఎవరూ ఇష్టంలేదు,
ఒక రోజు తన బాయ్ ప్రెండ్ తో మాట్లాడుతు నాకు కళ్లు వచ్చిన వెంటనే నిన్నుపెళ్లి చేసుకుంటా అని చేపింది,
అలా చెప్పిన కోన్ని రోజులకు తనకు కళ్లు ఎవరొ డోనేట్ చెసారు,తనకు కళ్లువచ్చిన ఆనందంలో తన బాయ్ ప్రెండ్ దగ్గరకు వెళ్ళింది.అక్కడ తను ఆశ్చర్యపోంది తన బాయ్ ప్రెండ్ కూడా గుడ్డివాడు.
అప్పుడు తన బాయ్ ప్రెండ్ అడిగాడు నికు కళ్లు వచ్చాయి కాదా మనం పెళ్లిచెసుకుందామా అన్నడు. కోంతసెపు అమ్మాయి ఆలోచించి ఇబ్బంది గానే చెపింది నేను నీను పెళ్లి చెసుకోలేనుఅని .
అ అబ్బాయి ఎమి మాట్లాడలేక పొయడు. కొంతసేపు అలొచించి ఏమి మాట్లాడకుండా వెళ్లిపోతూ ఇలా అన్నడు
~~~TAKE CARE OF MY EYES~~~

Wednesday, April 16, 2014
The lessons we have to learn from this story:
అవినాష్
ఒక సాఫ్ట్ వేర్ ఇంజనీర్... చీకు చింతా లేని జీవితం... తను కోరిన విధంగా
జీవితం చాల సంతోషంగా గడుపసాగాడు.. వారిది ప్రేమ వివాహం.. భార్య కూడా చాల
అణకువ కలిగినది.... వారిది మంచి అన్యోన్య దాంపత్యం.. జీవన క్రమంలో ...
అవినాష్ తండ్రి అయ్యాడు.. బాబు(విక్రం) కు 5 సంవత్సరాలు వస్తాయి... అవినాష్
కొత్తగా ఆడి కారును కొంటాడు... అది అతనికి కలల స్వప్నం... చాల రోజులకు
అతని కోరిక నెరవేరింది.... ఆ కారు అంటే
అవినాష్ కు చాలా చాలా ఇష్టం..... ప్రతి ఆదివారం తన కొత్త ఆడి కారు ను ఎంతో
ఇష్టంగా శుభ్రం చేసుకోవడం అలవాటు... ఆ రోజు కూడా దానిని శుభ్రం చేసే సమయంలో
.... అతని కుమారుడు విక్రం అక్కడికి వచ్చి ఒక రాయిని తీసుకుని కారు మీద
ఏమో చెక్క సాగాడు... ఆ చప్పుడుకు అవినాష్ ఏమి జరుగుతుందో గమనించీ
గమనించగానే... తట్టుకోలేనంత కోపం వస్తుంది... ఆ కోపం తనను తానూ
మర్చిపోతాడు... ఒక రేంచి తీసుకుని ఇష్టం వచ్చినట్లు ఆ చిన్నారి చేతుల మీద
కొడతాడు... మనిషి ఎంత మంచి వాడయిన ఒక దాని మీద ఇష్టం...మన కోపం
ఒక్కొక్కసారి మనని ఉన్మాదిగా మారుస్తుంది... ఆ స్థితిలో అవినాష్ ఉన్మాదిగా
మారాడు.. ఎదుట ఉన్నది తన చిన్నారి ముద్దుల కొడుకని కూడా మర్చిపోయాడు....
కొన్ని క్షణాల తర్వాత అర్ధం అయింది తానూ ఏం చేసాడో.. ...కానీ అప్పటికే
ఆలస్యమయింది... వెంటనే బాబును తీసుకుని ఆసుపత్రికి పరిగెడతాడు...
ఆసుపత్రిలో అన్ని పరీక్షల తర్వాత తెలుస్తుంది.. ఎముకలన్నీ తిరిగి
అతుక్కోలేనంత నుజ్జు నుజ్జు అయ్యాయని... బాబు చెయ్యి మామూలు స్థితికి
తిరిగి రాదని.... కన్నీరు మున్నీరయిన క్షణంలో .. బాబు అడుగుతాడు.. నాన్నా..
నా చేతులు తిరిగి రావా.... పరవాలేదులే బాధ పడకు.. ఇంకెప్పుడూ అలా చేయను..
అని దీనంగా అంటాడు... అవినాశ్ కు కన్నీటిని ఆపడానికి కాలేదు... తన చేసిన
తప్పుకు ప్రాయశ్చిత్తంగా ఆ కారును నాశనం చేయాలనీ, చేద్దామని.. కారు దగ్గరకు
వెళతాడు.. అప్పటి వరకూ తన కొడుకు కారు మీద ఏమి చెక్కాడు అనేది కనీసం చూడను
కూడా చూడలేదు... ఇంతకూ ఆ కారు మీద బాబు ఏం చెక్కాడో తెలుసా... ఐ లవ్ యు
డాడ్ .... అవినాశ్ తన మూర్ఖత్వానికి తన మీద తనకే అసహ్యం వేస్తుంది... కానీ
ఏమి చేస్తే ఆ చిన్నారిని బాగు చేయగలడు... చేసిన తప్పు తిరిగి
దిద్దుకోగాలడా.... ఎంత డబ్బు ఉంటే ప్రయోజనమేముంది... చితికేడంతావివేకం
ఉండాలి... వస్తువులపై వ్యామోహం ఉండకూడదు...
The lessons we have to learn from this story:
మనలో చాలా మందికి వస్తువుల మీద వ్యామోహం ఉంటుంది... కానీ అది మనుష్యుల కంటే ఎక్కువ కాకూడదు.. దేవుడు వస్తువులను వాడుకోవడానికి .. మనుష్యులను ప్రేమించడానికి సృష్టించాడు.. మనమే వస్తువులను ప్రేమిస్తూ.. మనుష్యులను వాడుకుంటూ లేని సమస్యలను సృష్టించుకుంటున్నాం.

Wednesday, April 9, 2014
తల్లితండ్రులని గౌరవించండి.
ఒక యువకుడు రెండు ఎత్తైన కొండల మధ్య ఫీట్స్ చేస్తున్నాడు ..
ఒక కొండ మీద నుండి ఇంకొక కొండ పైకి ఒక ఇనుప తీగ కట్టి ప్రజలందరూ చూస్తుండగా ఒక కర్ర ఆధారంగా తీగపై ఒక వైపు నుండి మరొక వైపుకు నడిచాడు
అక్కడున్న ప్రజలందరూ చప్పట్లు కొట్టారు ..
తర్వాత ఒక చక్రం ఉండే తోపుడు బండి తీస్కుని ఒక వైపు నుండి మరొక వైపుకి నడిచాడు ..
చూస్తున్న వారందరూ మరల కరతాళ ద్వనులు చేసారు,
తర్వతా ఆ యువకునితో కొంత మంది ఇలా అంటారు ..
ప్రాణం లేని బండి, కర్ర తో నడవడం కాదు ఒక మనిషిని ఆ బండి లో కూర్చో పెట్టుకుని తీగపై నడువు అప్పుడు నీవు గోప్పవాడివని నమ్ముతాం అంటారు ..
అప్పుడా యువకుడు "ఎవరైనా వచ్చి ఈ బండి లో కూర్చుంటే అలాగే చేస్తాను" ఎవరైనా ఉన్నారా అని అడుగుతాడు ..
అప్పుడు ఎవరు ముందుకు రారు, కాసేపటి తర్వాత ఒక ముసలి అతను వచ్చి బండి లో కూర్చుంటాడు ..
అక్కడున్న వారు ఎం తాత బ్రతుకు మీద ఆశ చచ్చి పోయిందా ఈ విధంగా ఫేమస్ అవ్వాలనుకుంటున్నావా, ఇంటి దగ్గర చెప్పి వచ్చావ" అని ఎగతాళి చేస్తారు ..
ఆ యువకుడు బండిలో ముసలి వ్యక్తిని కూర్చో పెట్టుకుని ఇవతలి నుండి అవతలికి సునాయాసంగా నడుస్తాడు.
అక్కడున్న కొందరు వచ్చి " ఎం తాత ఏ నమ్మకం తోటి ఆ అబ్బాయి మాటలు విని ఇంత పనికి తెగించావు " అని అడుగుతారు..??
ఎందుకంటే వాడు నా కొడుకు " అని అతను సమాధానం చెప్తాడు ..
ఫ్రెండ్స్.. ఈ ప్రపంచం మిమ్మల్ని నమ్మిన నమ్మకపోయినా మీ తల్లితండ్రులు మిమ్మల్ని నమ్ముతారు..
మీ ఔన్నత్యం కోసం ఎంత త్యాగానికైనా సిద్ద పడతారు....
అవమానాలని కూడా భరిస్తారు...
మీ తల్లి తండ్రులు మీమీద పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ముచేయకండి. తల్లితండ్రులని గౌరవించండి.

Wednesday, March 26, 2014
పెళ్లి ముడి
ఝామ్మున పెళ్లయిపోయింది. వధూవరులిద్దరూ హనీమూన్ బయలుదేరుతున్నారు. పెళ్లి
కూతురు తల్లి కుమార్తె చేతిలో ఓ బ్యాంక్ పాస్ బుక్ పెట్టి చెప్పింది.
‘సంసారం అన్నాక కష్ట సుఖాలు వుంటాయి. నీకు బాగా సంతోషం కలిగిన రోజున ఎంతో కొంత సొమ్ము బ్యాంకులో డిపాజిట్ చెయ్యి. ఆనందం కలిగించిన కారణాన్ని కూడా అందులో గుర్తుగా రాసుకో. పుస్తకం పారేసుకోకు. చెప్పింది మరచిపోకు’
గిర్రున ఏడాది తిరిగింది. పండంటి బాబు పుట్టాడు. ఆ సంతోషానికి గుర్తుగా కొంత డబ్బు డిపాజిట్ చేసింది.
నెలలు గడిచాయి. ఆమెకు జీతం పెరిగింది. పెరుగుతున్నఖర్చులకు తోడుగా జీతం పెరగడం కంటే ఆనందం ఏముంటుంది. దానికి గుర్తుగా మరికొంత సొమ్ము బ్యాంకులో చేరింది. మరి కొన్నాళ్ళకి అతడికి ప్రమోషన్. రెట్టింపు జీతం. కారు కొన్నారు. మంచి జరిగినప్పుడల్లా బ్యాంక్ డిపాజిట్ పెరుగుతూనే వుంది.
రోజులన్నీ ఒక్క మాదిరిగా వుండవు కదా.
కాపురంలో చిర్రుబుర్రులు మొదలయ్యాయి. సంభాషణల్లో అనురాగాల పాలు తగ్గి వాదాలు చోటుచేసుకోవడం ప్రారంభమయింది.
ఇద్దరి మధ్యా మాటలు తగ్గిపోయాయి. ఎప్పుడన్నా నోరు తెరిచినా అది చివరకు నోరు పారేసుకోవడం దాకా వెళ్ళేది.
తల్లిదగ్గర చెప్పుకుంది.
‘ఇతగాడిని భరించడం ఇక నా వల్లకాదు. నేను విడాకులు తీసుకుంటాను మమ్మీ. అతడు కూడా వొప్పుకున్నాడు. ఇష్టం లేని కాపురం కన్నా విడిపోయి విడిగా వుండడమే హాయి’
విన్న తల్లి గుండె గతుక్కుమంది. అయినా తమాయించుకుని చెప్పింది.
‘నీ ఇష్టాన్ని ఎప్పుడన్నా కాదన్నానా చెప్పు. అలాగే విడాకులు తీసుకుందురు కాని. కానీ నీ పెళ్ళిలో నీకొక బ్యాంక్ పాస్ బుక్ ఇచ్చాను కదా. అందులో యెంత వేసారో ఏమిటో. ముందు ఆ డబ్బు బయటకు తీసి ఒక్క పైసా మిగలకుండా అంతా ఖర్చుచేసేయ్యి. ఎందుకంటే ఈ దాంపత్యం తాలూకు ఏవీ నీకు గుర్తులుగా మిగిలి వుండకూడదు.’
అమ్మాయి పాస్ బుక్ తీసుకుని బ్యాంకుకు వెళ్ళింది. క్యూలో నిలబడివున్నప్పుడు అనుకోకుండా పుస్తకం తెరిచి చూసింది. అందులో డిపాజిట్ చేసింది తక్కువసార్లే అయినా ఆ ఎంట్రీల వద్ద రాసిపెట్టిన జ్ఞాపకాలు ఆమెను కదిలించాయి. పిల్లవాడు పుట్టడం, జీతాలు పెరగడం, ప్రమోషన్ రావడం – ఆ సందర్భాల్లో తమ నడుమ చోటుచేసుకున్న ఆహ్లాదకర క్షణాలు – ఓహ్ – జీవితమంటే యెంత ఆనందం.
ఇక అక్కడ నిలబడలేక ఇంటికి తిరిగి వచ్చింది. వచ్చి భర్తతో చెప్పింది. 'ఇదిగో. ఈ పాస్ బుక్ తీసుకుని బ్యాంకుకు వెళ్ళు. ఎంతవుంటే అంత తీసేసుకుని అంతా ఖర్చు చేసెయ్యి. ఆ తరవాతే ఇంటికి రా’
మర్నాడు వచ్చాడు. వచ్చి భార్య చేతిలో పాస్ బుక్ పెట్టాడు. అందులో కొత్త డిపాజిట్ వుంది. దానికి కింద ఇలా రాసాడు.
‘ఈ రోజు నా జీవితంలో గొప్పరోజు. నిన్ను నేను ఎంతగా ప్రేమించిందీ, ఇన్నేళ్ళ దాపత్యంలో నువ్వు నాకెంత సంతోషాన్ని అందించిందీ అన్నీ ఈ రోజే మళ్ళీ కొత్తగా తెలుసుకున్నాను.’
ఎవరు ముందో తెలియనంత వేగంగా వారిద్దరూ ఒకరినొకరు దగ్గరకు తీసుకున్నారు. ఆనంద భాష్పాలతో వారి కాపురం పునీతమైంది.
తరువాత వారు చేసిన మొట్టమొదటి పని – బ్యాంకు పాస్ బుక్ ను భద్రంగా బీరువాలో దాచిపెట్టడం.

Monday, March 24, 2014
అమ్మ ప్రేమ అద్భుతం వేల కట్ట లేనిది
మా అమ్మకు ఒక్క కన్నే ఉండేది. మా అమ్మంటే నాకు ఇష్టం ఉండేది కాదు. ఆమె
ఎక్కడికి వచ్చినా నాకు అవమానంగా తోస్తుండేది. ఆమె ఓ చిన్న కొట్టు
నడుపుతుండేది ఒక రోజు మా అమ్మ నాకు చెప్పకుండా నన్ను కలుసుకోవడానికి స్కూల్
కి వచ్చింది. ఇంక అప్పట్నించి చూడండి. ”మీ అమ్మ ఒంటి కన్నుది” అని
స్నేహితులందరూ ఒకటే వెక్కిరింతలు, అవహేళనలు.
అలా ఆమె ఎక్కడికి వచ్చినా నాకు అవమానాలే. అసలు ఈమె కడుపులో నేను ఎందుకు పుట్టానబ్బా అనిపించేది. ఒక్కోసారి నాకు.అసలామె ఈ లోకం నుంచే ఒక్కసారిగా అదృశ్యమైపోతే బావుణ్ణు.
“అమ్మా నీ రెండో కన్ను ఎక్కడికి పోయింది? నీవల్ల నేను అందరికీ చులకన అయిపోయాను. నువ్వు చచ్చిపో!” కోపంగా అరిచేసే వాణ్ణి. ఆమె మొహంలో నిర్లిప్తత తప్ప ఇంకేమీ కనిపించేదికాదు. నాకు మాత్రం చిర్రెత్తుకొచ్చేది. అయినా సరే అమ్మను అలా మాట్లాడినందుకు మాత్రం నాకు ఎక్కడలేని సంతోషంగా ఉండేది. ఆమె నన్ను ఎప్పుడూ దండించలేదు కాబట్టి ఆమెను నేను ఎంతగా భాధ పెట్టానో నాకు తెలియదు.
ఒక రోజు రాత్రి యధాప్రకారం అమ్మను నానా మాటలు అనేసి నిద్రపోయాను. మద్యలో దాహం వేసి మెలుకువ వచ్చింది. నీళ్ళు తాగడానికి వంటగదిలోకి వెళ్ళాను. అమ్మ అక్కడ ఒంటరిగా రోదిస్తోంది. మళ్ళీ ఆ దిక్కుమాలిన ఒక్క కంటిలోంచే నీళ్ళు. నా సహజ స్వభావం ఎక్కడికి పోతుంది? మొహం తిప్పుకుని వెళ్ళిపోయాను.
ఎక్కడికొచ్చినా నన్ను అవమానాలు పాలు చేసే మా అమ్మను, మా పేదరికాన్ని తిట్టుకుంటూ ఎప్పటికైనా నేను పెద్ద ధనవంతుణ్ణవ్వాలనీ, బాగా పేరు సంపాదించాలనీ కలలుగంటూ నిద్రపోయాను.
ఆ తరువాత నేను చాలా కష్టపడి చదివాను. పై చదువుల కోసం అమ్మను వదిలి వచ్చేశాను. మంచి విశ్వవిద్యాలయంలో సీటు సంపాదించి మంచి ఉద్యోగంలో చేరాను. బాగా డబ్బు సంపాదించాను. మంచి ఇల్లు కొనుక్కున్నాను. మంచి అమ్మాయిని చూసి పెళ్ళి చేసుకున్నాను. నాకిప్పుడు ఇద్దరు పిల్లలు కూడా. ఇప్పుడు నాకు చాలా సంతోషంగా జీవితం గడిచిపోతుంది. ఎందుకంటే ఇక్కడ మా ఒంటికన్ను అమ్మ లేదుకదా!
అలా ఎడతెరిపిలేని సంతోషాలతో సాగిపోతున్న నా జీవితంలోకి మళ్ళీ వచ్చింది మహాతల్లి. ఇంకెవరు? మా అమ్మ. ఆమె ఒంటి కన్ను చూసి రెండేళ్ళ నా కూతురు భయంతో జడుసుకుంది. “ఎవరు నువ్వు? ఎందుకొచ్చావిక్కడికి? నువ్వెవరో నాకు తెలియదు. నా ఇంటికొచ్చి నా కూతుర్నే భయపెడతావా?ముందు నువ్వెళ్ళిపో ఇక్కడ్నుంచి!!!” సాధ్యమైనంతవరకు తెలియనట్లే నటించాను.
“క్షమించండి బాబూ! తెలియక తప్పుడు చిరునామాకి వచ్చినట్లున్నాను” ఆమె అదృశ్యమైపోయింది. “హమ్మయ్య ఆమె నన్ను గుర్తు పట్టలేదు”. భారంగా ఊపిరి పీల్చుకున్నాను. ఇక ఆమె గురించి జీవితాంతం పట్టించుకోనవసరం లేదు అనుకున్నాను.
కానీ కొద్దిరోజులకు పాఠశాల పూర్వ విద్యార్థుల సమ్మేళనానికి రమ్మని ఒక ఆహ్వాన పత్రం అందింది నాకు. వ్యాపార నిమిత్తం వెళుతున్నానని మా శ్రీమతికి అబద్ధం చెప్పి అక్కడికి బయలు దేరాను. స్కూల్లో కార్యక్రమం అయిపోయిన తర్వాత నేను మా గుడిసె దగ్గరికి వెళ్ళాను. ఎంత వద్దకున్నా నా కళ్ళు లోపలి భాగాన్ని పరికించాయి. మా అమ్మ ఒంటరిగా కటిక నేలపై పడి ఉంది. ఆమె చేతిలో ఒక లేఖ. నా కోసమే రాసిపెట్టి ఉంది. దాని సారాంశం.
ప్రియమైన కుమారునికి,
ఇప్పటికే నేను బతకాల్సిన దానికన్నా ఎక్కువే బతికాను. నేనింక నీవుండే దగ్గరికి రాను. కానీ నువ్వైనా నా దగ్గరికి వచ్చిపోరా కన్నా! ఏం చేయమంటావు? నిన్ను చూడకుండా ఉండలేకున్నాను. కన్నపేగురా. తట్టుకోలేక పోతోంది. నువ్వు పాఠశాల పూర్వ విద్యార్థుల సమ్మేళనానికి వస్తున్నావని తెలిసిన నా ఆనందానికి పట్టపగాలు లేవు. కానీ నేను మాత్రం నీకోసం స్కూల్ దగ్గరికి రానులే. వస్తే నీకు మళ్ళీ అవమానం చేసినదాన్నవుతాను. ఒక్క విషయం మాత్రం ఇప్పటికి చెప్పక తప్పడం లేదు. చిన్నా! నీవు చిన్నపిల్లవాడిగా ఉన్నపుడు ఒక ప్రమాదంలో నీకు ఒక కన్నుపోయింది. నా ప్రాణానికి ప్రాణమైన నిన్ను ఒక కంటితో చూడలేకపోయాన్రా కన్నా! అందుకనే నా కంటిని తీసి నీకు పెట్టమన్నాను. నా కంటితో నువ్వు ప్రపంచం చూస్తున్నందుకు నాకు ఎంత గర్వంగా ఉందో తెలుసా? నువ్వు చేసిన పనులన్నింటికీ నేను ఎప్పుడూ బాధపడలేదు. ఒక్క రెండు సార్లు మాత్రం ” వాడు నా మీద కోప్పడ్డాడంటే నా మీద ప్రేమ ఉంటేనా కదా!” అని సరిపెట్టుకున్నాను. చిన్నప్పుడు నేను నీతో గడిపిన రోజులన్నీ నా హృదయంలో శాశ్వతంగా నిలిచిపోయే మధురానుభూతులు.
ఉత్తరం తడిసి ముద్దయింది. నాకు ప్రపంచం కనిపించడం లేదు.నవనాడులూ కుంగిపోయాయి. భూమి నిలువుగా చీలిపోయి అందులో చెప్పలేనంత లోతుకి వెళ్ళిపోయాను. తన జీవితమంతా నాకోసం ధారబోసిన మా అమ్మ కోసం నేను ఎన్ని కన్నీళ్ళు కారిస్తే సరిపోతాయి? ఎన్ని జన్మలెత్తి ఆమె ఋణం తీర్చుకోను?

Tuesday, March 18, 2014
ధర్మసూక్ష్మాలు
మంచి నీతి కథ...
ఓ బ్రాహ్మణుడు పితృకార్యము చేస్తున్నాడు. పాలు పెరుగు పోసే అమ్మాయి, తన ఇంటిని నుండి ఈయనకు పెరుగు పొయ్యాలని బయలుదేరింది. కాని తట్టలో పెట్టుకున్న పెరుగుకుండకు పైన పెట్టిన బట్ట గాలికి తొలిగింది. అదేసమయానికి ఒక గరుడపక్షి ఓపాముని భూమి నుండి ఎగరేసుకు పోయింది. పాము కక్కిన కాలకూట విషం ఈ పెరుగు కుండలో పడింది. ఇదేమి తెలియని ఆ గొల్లవనిత, బ్రాహ్మణుడి ఇంట్లో ఆ పెరుగు పోసి వెళ్ళింది. బ్రాహ్మణుడు పితృకార్యమునకు వచ్చిన వేదబ్రాహ్మణులు మృత్యువాత పడ్డారు. ఇది జరిగిన తరువాత ఆ గ్రామంలో ఈ విషయాన్ని పెద్దగా చర్చించటం మొదలుపెట్టారు. కొందరు " ఆ గొల్లవనితది" తప్పన్నారు. కొందరు పాముది తప్పుఅని, కొందరు గరుడపక్షిది తప్పు అని, కొందరు బ్రాహ్మణుడిది తప్పుఅని వాదించటం ఆరంభించారు. ఈ వాదప్రతివాదములు యమలోకం దాకా వెళ్ళినాయి. చిత్రగుప్తుడు, "ప్రభూ! పాపం ఎవరికి చెందుతుంది" అని తన ప్రభువైన యమధర్మరాజుని అడిగాడు. దానికా సమవర్తి "చిత్రగుప్తా! ప్రకృతిసిద్ధంగా జరిగిన విషయాలకు పాపం ఎవరికి చెందదు. ఆకలిగొన్న పక్షి తన ఆహారంకోసం పాముని తన్నుకెళ్ళటం సహజం. అది ప్రాణభయంతో విషం క్రక్కుట సహజం. గాలికి పెరుగుకుండ పైన బట్ట తొలగటం సహజం. ఇలా సహజముగా జరిగిన సంఘటనలకు పాపం అంటావేమిటి? ఎమైనా పాపం ఉంటే, అక్కడ భూలోకంలో ఈ ధర్మసూక్ష్మాలు తెలియకుండా "పాపం వీరిది, వారిది అని" ధర్మనిర్ణయం చేస్తున్నారే, వారికి పంచు" అని తీర్పునిచ్చాడు. కాబట్టి మనము ధర్మసుక్ష్మాలు తెలియకుండా వారిది తప్పు , వీరిది తప్పు అని నిర్ణయము చేస్తే, పాపము లో భాగము మనకు పంచుతారు. తస్మాత్ జాగ్రత్త!

Thursday, March 13, 2014
మూడు ఖర్చులు:
మంచి కరువు కాలాన ఒక పెద్దమనిషి ఒక చోటు నుంచి ఇంకో చోటుకు ప్రయాణం
పెట్టుకున్నాడు. కరువు రోజుల్లో చుట్టుపక్కలు ఎలా ఉంటాయో తెలిసిందే కదా.
ఎండిపోయిన పైర్లు, పగుళ్లిచ్చిన నేలలు, నీళ్లింకిపోయిన చెరువులు.
అల్లాడుతున్న జనం. ఆహా కలికాలం వచ్చేసిందిగదా అని అదంతా చూసుకుంటూ
వస్తున్నాడంట పెద్దమనిషి.
కొంత దూరం వచ్చాక ఆయనకు ఒక పొలం కనిపించింది. అది ఏపుగా ఉంది. పచ్చగా ఉంది. కళకళలాడుతూ ఉంది. దానిని చూసి ఆశ్చర్యపోయాడు పెద్దమనిషి. ఇంతలో బడబడమని ఒక నల్లటి మబ్బు కదిలివచ్చి ఆ పొలం ఎంతవరకు ఉందో అంత వరకే వచ్చి నిలబడింది. ఆ తర్వాత ఆ పైరుకు ఎంత వానకావాలో అంత వానా కురిపించి వెళ్లిపోయింది.
పెద్దమనిషికి మతిపోయింది.
యిదంతా పట్టించుకోకుండా పొలంలో దిగి పనులు చేసుకుంటున్న ఆ పొలం రైతు దగ్గరకు వెళ్లి “ఏమయ్యా! నేను యింత దూరం నుంచి వస్తున్నాను. ఎక్కడా పచ్చి గరిక మొలవలెదు. నీ పైరేమో విరగపండుతోంది. నీ పైనే వాన కురుస్తూ ఉంది. ఏమి ఈ మాయ?” అని అడిగాడు.
“ఏమో స్వామి. నాకేమి తెలుసు. నేను వ్యవసాయం చేయడం మొదలు పెట్టినప్పటి నుంచి ఎవరికి వానలు కురిసినా కురవకపోయినా నా చేనుకి వాన కురుస్తూనే ఉంది. ఎవరికి పండినా పండకపోయినా నా చేను పండుతూనే ఉంది” అన్నాడు రైతు.
“కాదు. యిందులో ఏదో పరమార్థం ఉంటుంది. నీ జమా ఖర్చుల సంగతి చెప్పు” అన్నాడు పెద్దమనిషి.
“ఏమిలేదు స్వామి. పంట పండించాక వచ్చిన సొమ్ముని నేను మూడు ఖర్చులుగా విడగొడతాను. ఒక ఖర్చు నా ఇంటికీ సంసారానికీ ఉంచుకుంటాను. ఒక ఖర్చుని పంటకీ విత్తనాలకీ పాడికీ పశువుకీ ఉంచుకుంటాను. మూడో ఖర్చుని పేదలికీ సాదలకీ పంచి పెడతాను” అన్నాడు రైతు.
“అదీ అలా చెప్పు. ఇంక నీకు కురవకపోతే ఇంకెవరికి కురుస్తుందయ్యా వాన” అని వెళ్లిపోయాడు ఆ పెద్దమనిషి.

దయామయుడు
భక్తి, నమ్మకం
కేరళ రాష్ట్రంలో ఉన్న గురువాయూర్ కృష్ణ దేవాలయం బాగా ప్రసిద్ధి చెందింది. అక్కడికి నిత్యం వేలమంది భక్తులు వచ్చి శ్రీకృష్ణ దర్శనం చేసుకుంటూ ఉంటారు.
ఒక భక్తుడు కాలునెప్పితో బాధపడుతూ ఉండేవాడు. 41 రోజుల పాటు నిత్యం గుడిదగ్గర స్నానం చేసి కృష్ణుణ్ణి దర్శించుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఈ 41 రోజులు పూర్తి అయ్యేసరికి కాలునెప్పి తగ్గించమని కృష్ణుణ్ణి వేడుకోసాగేడు. అతను డబ్బున్నవాడు కావడంతో , రోజు అతన్ని గుడికి తీసుకురావడానికి పనివాళ్ళని పెట్టుకున్నాడు. అలా శ్రద్ధగా 40 రోజులు పుర్తిచేసాడు. అయినా కాలునెప్పి తగ్గకపొవడంతో నిరాశపడసాగేడు.
గురువాయూర్ లోనే ఉన్న వేరొక భక్తుడు తన కుమార్తె పెళ్ళి కోసం కృష్ణ్ణుణ్ణి ప్రార్ధిస్తున్నాడు. పెళ్ళి కుదిరి నిశ్చితార్ధం జరిగింది. అతను బాగా పేదవాడు కావడంతో పెళ్ళికి కావలసిన డబ్బు, నగలు సమకూర్చుకోవడంలో ఇబ్బంది పడుతున్నాడు. ఒకరోజు రాత్రి కృష్ణుడు ఈ భక్తుని కలలోకి వచ్చి, రేపు పొద్దున్న గుడిదగ్గర చెరువుగట్టు మీద ఒకసంచి ఉంటుంది. అది తీసుకుని వెనక్కి తిరిగిచూడకుడా ఇంటికి వెళ్ళీపో అని చెప్పేడు.
కాలునెప్పి తగ్గించమని ప్రార్థిస్తున్న భక్తుడు , 41వ రోజు కృష్ణుడుకి కానుకగా ఇవ్వాలని ఒక సంచిలో బంగారునాణేలు పట్టుకుని గుడికివచ్చేడు. ఆ సంచి చెరువు గట్టుమీద పెట్టి స్నానానికి వెళ్ళేడు. ఇంతలో కృష్ణుడు చెప్పినట్లుగా పేదభక్తుడు చెరువు దగ్గరికి వచ్చి సంచి తీసు కుని వెనక్కి తిరిగిచూడకుండా పరిగెత్తసాగేడు. స్నానం చేస్తున్న భక్తుడు అది గమనించి తన సంచి ఎవరో దొంగ ఎత్తుకుపోతున్నాడని భావించి అతని వెనకాల పరిగెత్తేడు , కాని పట్టుకోలేకపోయేడు. తన దురదృష్టానికి బాధపడుతూ వెనక్కి వస్తూండగా ఒక్కసారిగా నడవగలుగుతున్న విషయం గమనించాడు. కాలునెప్పి తగ్గిపొవడమే కాకుండా ఇంతసేపు సంచి కోసం పరిగెత్తగలిగేనని తెలుసుకుని చాలా సంతోషించేడు.
ఈ విధంగా శ్రీ కృష్ణభగవానుడు ఇద్దరు భక్తుల కోరికలు సమయానుకులంగా తీర్చి సంతోషాన్ని అందించాడు.
నీతి: భగవంతుడు దయామయుడు. హృదయపూర్వకంగా చేసే ప్రార్థనకి తప్పకుండా స్పందిస్తాడు. ఆయనకి భక్తులందరు సమానమే, అయితే వాళ్ళ పరిస్థితిని బట్టి,సమయానుకూలంగా వాళ్ళని సంతోషపెట్టడం ఆయన ప్రత్యేకత. ఆయన అనుగ్రహించే పద్ధతులు వేరుగా ఉన్నా, అందరిపట్లా ఆయన ప్రేమ సమానంగా ఉంటుంది.

Saturday, March 8, 2014
జీవిత సత్యం
ఒక చిన్న గ్రామంలో ఒక ముసలి అవ్వ, ఆమె మనవడు కలిసి ఒక చిన్న గుడిసెలో
జీవించేవారు. ఒక రోజు ఆమె వంట చేస్తుండగా, మనవడు ఆమె దగ్గరికొచ్చాడు.
"నానమ్మ! ఈ మధ్య నాకు ఒంట్లో అస్సలు బావుండట్లేదు, తలనొప్పి, కడుపు నొప్పి,
జ్వరం అన్నీ ముకుమ్మడిగా బాధిస్తున్నాయి. స్కూల్‌లో కుడా నాకు మార్కులు
తక్కువుగా వస్తున్నాయి, ఉపాధ్యాయులు తిడుతున్నారు, స్నేహితులు నాతో సరిగా
మాట్లాడట్లేదు" అని తన బాధలన్నింటినీ ఏకరువు పెట్టసాగాడు.
నానమ్మ తన మనవడికి ఎలాగైనా జీవిత సత్యాన్ని వివరించాలని, "చూడు నాన్నా! నువ్వు ఈ ఉడకని, వండని బియ్యాన్ని అలాగే తినగలవా?" అని అడిగింది. "ఛీ. అస్సలు తినలేను" అన్నాడు మనవడు. "మరి కేవలం నీళ్ళు త్రాగి జీవించగలవా?" అని నానమ్మ అడగ్గా "లేదు" అని జవాబిచ్చాడు మనవడు. "కూరలో వేసే కారం ఒక్కదాన్నే తిని కడుపు నింపుకోగలవా? మళ్ళీ అడిగింది నానమ్మ. "అమ్మో! నావల్ల కాదు" చెప్పాడు మనవడు. "మరి ఉప్పు" అని అడిగిన నానమ్మను "లేదు నానమ్మ. కాని ఇవన్నీ ఎందుకడుగుతున్నావు?" అని ఎదురు ప్రశ్నించాడు మనవడు.
"బాబూ! బియ్యం, నీరు అన్నీ కలిస్తే అన్నం. ఉప్పు, కారం, కూరగాయలు కలిస్తే కూర అవుతాయి కదా! అదే విధంగా బాధ, సంతోషం, కోపం, శాంతం.... ఇలా అన్నీ కలిస్తేనే అది జీవితమవుతుంది. ఇదే జీవిత సత్యం. దేవుడికి ఎవరికి, ఏమి, ఎప్పుడు ఇవ్వాలో అన్నీ తెలుసు.
మనం మన జీవిత స్ధితి గతులను మెరుగుపరుచుకునేందుకు ప్రయత్నించాలి.
ప్రతిఫలం మాత్రం దేవుడికే వదిలేయాలి. ఆయన ఏది ఇస్తే దానికి తలవంచి స్వాగతించాలి.
మనకు ఇలాగే మంచి రోజులూ ఉంటాయి, చెడు రోజులూ ఉంటాయి"

" సంతృప్తి "
అనగా
అనగా ఒక రాజ్యం, ఆ రాజ్యంలో ఒక రాజు, ఖజానా నిండుగా డబ్బులు ఉండేవి, అయినా
రాజుకు తెలీని అసంతృప్తి. ఒక రోజు ఆ రాజు వేటకు వెళ్ళినాడు, వేటకు వెళ్ళి
జింక పిల్లలు, భల్లూకాలు, సింగాలు, వేటాడి అలసి నిద్రిస్తుంటే ఒక కల
వచ్చింది.
ఆ కలలో ఒక పురుషుడు కనపడి రాజా నీకు నేను అమూల్యమైన ధనం ఇస్తున్నాను. చక్కగా ఆనందించు అని చెప్పినాడు, కానీ దేనికైనా పైన నక్షత్రపు గుర్తు ఉండాలి కదా, అలాగే ఓ కండీషను కూడా పెట్టినాడు. నేను నీకు ఏడు పెద్ద కూజాలు ఇస్తాను వాటిలో ఆరు కూజాల నిండా ధనం, వజ్రాలు, వైడూర్యాలు అమూల్య రత్నాలు మొదలగునవి ఉంటాయి. ఏడవ కూజా మాత్రం సగం నిండి ఉంటుంది, సగం ఖాళీగా ఉంటుంది. నీవు నీ దగ్గర ఉన్న డబ్బుతో ఈ ఏడవ కూజా నింపితే ఆ తరువాత ఏడు కూజాలూ చక్కగా వాడుకోవచ్చు అని చెప్పి మాయం అవుతుంది.
రాజు ఆనందాశ్చర్యాలతో మేల్కొంటాడు. లేచి చూస్తే ఏముంది ధగ ధగ మెరుస్తూ ఏడు పెద్ద కూజాలు కనిపించినాయి, వాటిలో ధనం చూసి రాజుకు మూర్చ వచ్చినంత పని అయినది. ఆనందంతో వాటిని చూసి రాజు తన దగ్గర ఉన్న డబ్బులు అన్నీ, నగలు అన్నీ దానిలో వేసినాడు కానీ కూజా నిండుగా కాలేదు! ఇంకా సగం ఖాళీగానే ఉన్నది.
రాజ్యం వెళ్ళి ఒక్క రోజు ఆదాయం వేసినాడు కానీ ఇంకా కూజా ఖాళీగానే ఉన్నది. వారం రోజుల ఆదాయం వేసినాడు కానీ ఇంకా కూజా ఖాళీగానే ఉన్నది. ఒక్క నెల రోజుల ఆదాయం వేసినాదు కానీ ఇంకా కూజ ఖాళీగానే ఉన్నది. ఒక సంవత్సరం ఆదాయం వేసాడు ఇంకా ఖాళీగానే ఉన్నది. ఇహ పౌరుషం పొడుచుకొచ్చి ఆవేశంతో ఖజానా మొత్తం వేయడానికి సిద్ధం అయినాడు, కానీ తెలివి గల మంత్రి వచ్చి రాజు ఆవేశాన్ని చల్లార్చి రాజా! ఈ ఏడవ కూజా ఉన్నది చూసినారా అది మీ మనస్సు లాంటిది, అది ఎప్పటికీ తృప్తి పొందదు మీరు కొద్దిగా తెలివిగా ఆలోచించండి అని చెప్పాడు.
మనిషికి " సంతృప్తి "అనేది ముఖ్యము, లేకుంటే అసంతృప్తితో ఉన్నదంతా పోగొట్టుకోవాల్సి ఉంటుంది

"నోరు జారిన మాటలు"
చాలా సంవత్సరాల క్రితం ఒక ఊరిలో చారుమతి అనబడే ఒక అమ్మాయి వుండేది. ఆ
అమ్మాయి రోజంతా గాలి కబుర్లు చెప్పుకుంటూ గడిపేసేది. తను ఇక్కడ మాట అక్కడా,
అక్కడి మాట ఇక్కడా చెబుతూ వుంటే చూశి వాళ్ళ అమ్మ చాలా బాధ పడేది. ఇలా గాలి
కబుర్లు చెప్పడం తప్పని అమ్మ యెంత చెప్పినా చారుమతి మట్టుకు
పట్టించుకునేది కాదు.
ఒక రోజు ఆ ఊరికి తీర్థ యాత్రలు చేస్తూ ఒక సాధువు వచ్చాడు. ప్రసంగంకు వెళ్ళిన అమ్మ తన బాధ సాధువుకు చెప్పుకుంది. చారుమతికి తన తప్పు అర్ధమయ్యేలా చెప్పమని ఆ సాధువును కోరుకుంది. ఆ సాధువు మన్నాడు చారుమతిని తన దెగ్గరికి తీసుకు రమ్మని చెప్పాడు.
మన్నాడు పొద్దున్నే అమ్మ చారుమతిని ఆ సాధువు దెగ్గిరకు తీసుకుని వెళ్ళింది. ఆ సాధువు చారుమతికి ఒక కోడిని చూపించి రోజంతా ఆ కోడి ఈకలు తీసి వూరు మొత్తం జల్లమని చెప్పాడు.
“ఇంతేనా?” అనుకుంటూ అమ్మ చారుమతిని కోడి ఈకలతో వూరంతా చుట్టుకుని రమ్మంది. చారుమతి సంతోషంగా ఊరంతా తిరుగుతూ కనిపించిన వారందరికి కబుర్లు చెపుతూ ఇక్కదో ఈక, అకాడో ఈక విసిరేసింది.
సాయంత్రం సూర్యోస్తమం అవుతుంటే అమ్మ, చారుమతి మళ్ళీ ఆ సధువుదెగ్గిరకు చేరారు. ఈ రాత్రి నిద్రపోయి మళ్ళి తెల్లవారగానె ఇద్దరినీ రమ్మన్నాడు సధువు.
మొన్నాడు పొద్దున్నే సాధువు, “నిన్న రోజంతా విసిరేసిన కోడి ఈకలు వెతికి తీసుకు రా అమ్మా” అని చారుమతితో అన్నాడు.
వెంటనే చారుమతి ఊరంత వెతకడం మొదలెట్టింది. సాయంత్రం దాక ఊరిలో ప్రతి అంగుళం వెతికినా ఒక్క ఈక కూడా కనిపించలేదు. దిగాలుగా చారుమతి సూర్యోస్తమమయ్యె సమయానికి ఆ సధువు దెగ్గిరికి వెళ్ళి, “స్వామి, నన్ను క్షమిచండి. నాకు ఒక్క ఈక కూడ దొరకలేదు” అని తల దించుకుని చెప్పింది.
అప్పడు సాధువు తనకు, “చూశావా, మన మాటలు కూడా ఆ ఈకలు లాంటివే. ఒక్క సారి మన నోరు జారితే ఆ మాటలను మనం యెన్నటికి తిరిగి తీసుకోలేము.” అని చెప్పాడు.
ఆ రోజు నుంచి చారుమతి గాలి కబుర్లు చెపుతూ ఇతర్లని, తన అమ్మని, ఇబ్బందిపెట్టడం మానేసింది.

చిల్లు కుండ విలువ
ఒక
ఊరిలో నీళ్ళు మోసే పనివాడొకడుండేవాడు. అతను రెండు కుండలను ఒక కట్టెకు కట్టి
కొంత దూరంలో ఉన్న చెరువు నుంచి తన యజమాని ఇంటికి నీళ్ళు మోసుకొచ్చేవాడు. ఆ
రెండు కుండల్లో ఒకటి కొద్దిగా పగిలి నీరు కారు పోతుంటే, మరొకటి ఒక చుక్క
నీరు కూడా కారిపోకుండా ఉంది.
చాలా దూరంగా ఉన్న యజమాని ఇంటికి రెండు కుండల్లో నీళ్ళు తీసుకొచ్చేసరికి, కొద్దిగా పగిలిన కుండలో ఎప్పుడూ సగం నీరే మిగిలేది. ఎన్నో నెలలు ఇలాగే కేవలం ఒకటిన్నర కుండల నీరే యజమాని ఇంటికొచ్చేసరికి మిగిలేవి. నిండా నీరు మోస్తున్నానని ఆ రెంటిలో మంచికుండ అగర్వంతో పొంగిపోయేది. కాని పగుళ్ళకుండ తన పని తాను సక్రమంగా చేయలేకపోతున్నందుకు సిగ్గుతో చచ్చిపోయేది. అవమానకరంగా భావించేది. ఎన్నో నెలల తర్వాత పగుళ్ళు గల కుండ పనివాడితో "నేను అవమానకరంగా భావిస్తున్నాను, నన్ను క్షమించు" అంది.
"ఎందుకు? నువ్వెందుకు అవమానకరంగా భావిస్తున్నావు?" అడిగాడు పనివాడు. "ఇన్ని రోజులు నేను సగం నీళ్ళే మోయగలగుతున్నాను. ఈ పగుళ్ళు నీటిని కారిపోయేలా చేస్తున్నాయి. నావల్ల నీకు అదనపు పని అవుతుంది. నీకష్టానికి తగ్గ ఫలితం దక్కట్లేదు" అని నసిగిందా పగుళ్ళ కుండ. దాని బాధ అర్ధం చేసుకున్న పనివాడు "బాధపడకు, ఈ రోజు యజమాని ఇంటికి వచ్చేటప్పుడు దారి వెంట ఉన్న అందమైన పుష్పాలను చూడు" అన్నాడు. కుతూహలంగా ఆ పగుళ్ళ కుండ ఆ దారి వెంట ఉన్న అందమైన పుష్పాలను చూసి సంతోషించింది. ఇల్లు చేరాక తిరిగి తన పొరపాటును మన్నించమని పనివాడిని కోరింది.
పనివాడు ఆ కుండతో "కేవలం నీవైపే అందమైన పుష్పాలు ఉన్నాయి. మరో కుండ వైపు లేవు. అది నువ్వు గమనించావా? ఎప్పుడూ నిన్నే ఆ అందమైన పూల మొక్కల వైపు ఉండేలా చేస్తాను. నీ నుంచి కారిపోయే నీటిని వాటికి అందేలా చేస్తాను. అంటే నువ్వే వాటికి నీరు పోస్తావన్నమాట. తద్వారా ఈ అందమైన పుష్పాలు యజమాని టేబుల్ అలంకరించడానికి నువ్వే ఉపయోగపడుతున్నావు. నువ్వు పగుళ్ళతో లేకపోతే అతని ఇంట్లో కళకళలాడే పుష్పాలు, అందమైన అలంకరణలు ఉండవు" అన్నాడు. పగుళ్ళ కుండ తన భాధను అర్ధం చేసుకోవడమే కాకుండా, తన లోపాన్ని ఇలా సద్వినియోగం చేసుకుంటున్నందుకు పనివాడికి కృతజ్ఞతలు చెప్పింది.
మనలో లోపాలున్నా పగుళ్ళకుండ మదిరిగానే మనమూ ఎన్నో అద్భుతాలు సాధించగలం. మనం ఇతరులను సంతోషపరచగలం. మన తెలివితేటలతో దేవుడికే గాక మానవాళికి కూడా సేవ చేయగలం. మనం మన జీవితంలోని ప్రతి నిమిషాన్నీ ఆనందంగా ఉండేలా చేసుకోగలం.4

నిజ జీవితంలో సక్సెస్ఫుల్ పెర్సన్.
ఈ స్టోరీ టాలెంట్ కు సంబందించినది..
కట్టెలు కొట్టే ఒక బీధ వ్యక్తి ఉజ్జోగం కోసం ఒక పెద్ద మనిషి దగ్గరకు వెల్తాడు.. తనకు ఎదయినా పని ఇప్పించమని రిక్వెస్ట్ చేసాడు..
ఆ కట్టెలు కొట్టే వాడిని చూసిన పెద్దాయన చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు.. కారణం కండలు తిరిగిన శరీరం అంతకు మించి పని మీద శ్రద్ద పని చేసి సంపాదించాలనే తపన...
పని ఇవ్వాలని నిర్దారనకు వచ్చి ఒక అడవి వద్దకు తీసుకుని వెళ్ళి.. ' ఇది మనం లీజుకు తీసుకున్న భాగం.. నీకు సాధ్యమయినన్ని కట్టెలు కొట్టి.. సాయంకాలనికి నాకు లెక్క చెప్పాలి.. ' అని పనిని అప్పగించి అక్కడనుంచి వెళ్ళి పోతాడు..
కట్టెలు కొట్టే వ్యక్తి తన పనిని మొదలు పెత్తి.. మొదటి రోజు 10 ఎద్దుల బడెలు నిండేలా కట్టెలు రెడి చేసి ఓనర్ కు లెక్క చెప్తాడు..
మొదటి రోజు తన పనిని చూసిన పెద్దాయన చాలా సంతోషించి.. తన పనిని గొప్పగా పొగుడుతాడు..
అలాగే రెండవ రోజు కూడా కట్టెలు కొట్టే వ్యక్తి 9 ఎడ్ల బండ్లు నిండేలా కట్టేలు కొడతాడు...
సాయంకాలం ఓనర్ కు లెక్క చెప్తాడు...
అలా అయిదు రోజులు గడిచే సరికి 6 ఏడ్ల బండ్లు నిండేలా మత్రమే కట్టెలు కొడతాడు..
రోజు రోజుకు పని సామర్ద్యం తగ్గిపోతుందే అని బాద పండిన కట్టెలు కొట్టే వ్యక్తి తన యజమానితో జరుగుతున్న విషయం మొత్తం షేర్ చేసుకుంటాడు...
'అయ్యా నేను రోజు మొత్తం క్షణం అయినా సేద తీరకుండ ప్రయత్నించినా మొదటి రోజు చేసినంత పనిని చేరుకోలేక పోతున్నాను.. అని తన బాదను విన్నవించుకుంటాడు...
అంతా వినిన యజమాని.. ' చూడు బాబు.. నీ ప్రయత్న లోపం ఎమి లేదు.. నేను నిన్ను నమ్ముతాను.. నీలో చేయాలన్న తపన ఉంది.. చేయగలిగిన శక్తి ఉంది... కాని... నీవు ఛేస్తున్న తప్పంటే నీకు తెలియరావడం లేదు...' అని సమాధానం ఇస్తాడు...
నేనేమి తప్పు చేసాను అని పని వాడు అడుగుతాడు..
అందుకు యజమాని... ఎప్పుడయినా నీవు కట్టెలు కొట్టే నీ గొడ్డలిని పదును పెట్టావా..?? అని అడుగుతాడు...
అందుకు పని వాడు లేదనే సమాదానం చేప్తాడు...
యజమాని చిన్నగా నవ్వి... ' బాబు కట్టెలు కొట్టడం నీకు వచ్చిన కళ.. అందులో నీవు నిపునుడవు.. కాని.. నీ నైపున్యాణికి అంటే నీవు ఉపయోగించే గొడ్డలకి పదును పెడితే.. నిన్ను మించిన పని వాడు ఈ ప్రపంచలో ఇంకేవరు ఉండరు... అని అక్కడ నుంచి వెళ్ళిపోతాడు...'
తను చేస్తున్న తప్పును సరి దిద్దుకున్న పని వాడు.. తన గొడ్డలికి మరుసటి రోజు పదును పెట్టి ప్రయత్నించాడు.. తిరిగి తన పూర్వ స్థితిని చేరుకోవడమే కాదు... ఇంకా మెరుగయిన పనిని చేరుకున్నాడు...'
మనలో చాలా మందికి కూడా అంతులేని నైపుణ్యం చేయాలన్న తపన ఉంటుంది.. కాని వారి నైపుణ్యానికి మెరుగు పెట్టడం మరచి పోతుంటారు... అందుకు నిదర్శనమే ఈ చిన్న కధ...
టలెంట్ ఉంటే సరిపోదు దాన్ని ఎలా ఉపయోగించుకోవాలో తెలిసిన వాడే నిజ జీవితంలో సక్సెస్

అలెగ్జాండర్ నుండి పాఠాలు
అలెగ్జాండర్ నుండి పాఠాలు
అలెగ్జాండర్ చాలా రాజ్యాలను జయించిన తర్వాత ఇంటికి తిరిగి వెళుతున్నాడు..
మార్గమధ్యంలో తీవ్ర అనారోగ్యానికి గురై మరణ శయ్యపై చేరాడు. తాను మరణించడం తథ్యమని అలెగ్జాండర్ కు అవగతమైపోయింది.
తాను సాధించిన గొప్ప గొప్ప విజయాలు, అమిత శక్తిశాలురైన సైన్యం, అంతులేని
సంపద తన్ను మరణం నుంచి దూరం చేయలేవని స్పష్టమైపోయింది. ఇంటికి వెళ్ళాలనే
కోరిక తీవ్రతరమైంది. తన తల్లికి కడసారిగా తన ముఖాన్ని చూపించి కన్ను
మూయాలనే ఆశ.
కానీ సమయం గడిసే కొద్దీ దిగజారుతున్న అతని ఆరోగ్యం అందుకు సహకరించడం లేదు.
నిస్సహాయంగా ఆఖరి శ్వాస కోసం ఎదురు చూస్తున్నాడు. తన సైన్యాధికారులను
దగ్గరికి పిలిచి ఇలా అన్నాడు.. “నేనింక కొద్దిసేపట్లో ఈ లోకం నుంచి
నిష్క్రమించబోతున్నాను. నాకు చివరగా మూడు కోరికలున్నాయి. ఎట్టి
పరిస్థితుల్లోనూ వాటిని నెరవేర్చకుండా విస్మరించకండి.” అని వారి నుండి
వాగ్ధానం తీసుకున్నాడు.
అశ్రునయనాలతో కడసారిగా తమ రాజు గారి ఆజ్ఞను వినమ్రంగా అంగీకరించారు ఆ అధికారులు.
నా మొదటి కోరిక: ” నా శవ పేటికను కేవలం నా వైద్యులు మాత్రమే మోయాలి”
రెండవ కోరిక: “నా పార్థివ దేహం స్మశానానికి వెళ్ళే దారిలో నేను సంపాదించిన విలువైన వజ్రాలు, మణి మాణిక్యాలు పరచండి”
మూడవ కోరిక: “శవపేటిక లో నుంచి నా ఖాళీ చేతులు బయటికి కనిపించే విధంగా ఉంచండి”
చుట్టూ మూగి ఉన్న సైనికులు ఆయన విచిత్రమైన కోరికలు విని ఆశ్చర్యపోయారు.కానీ వారిలో ఎవ్వరికీ ఆయన్ను అడిగే ధైర్యం లేకపోయింది.
అలెగ్జాండర్ కు అత్యంత ప్రీతి పాత్రుడైన ఒక సైనికుడు దగ్గరగా వచ్చి, ఆయన
చేతులను ముద్దాడి, ఆయన కోరికలను తప్పక నెరవేరుస్తామని మాట ఇచ్చాడు. ఈ
కోరికల వెనక ఆంతర్యమేమిటో సెలవియ్యమని అడిగాడు.
అలెగ్జాండర్ అతి కష్టమ్మీద ఇలా అన్నాడు.. “ఈ మూడు కోరికలు నేనిప్పుడే నేర్చుకున్న మూడు పాఠాలకు ప్రతిరూపాలు.”
“మొదటి కోరికలో నా ఆంతర్యం, నిజానికి ఏ వైద్యుడూ మరణాన్ని ఆపలేడు... ఒకవేళ వైద్యం చేసినా వల్లకాటి వరకే.” అని చెప్పడానికి.
“రెండవ కోరికలో నా ఆంతర్యం, నా జీవితంలో సింహ భాగం సంపదను కూడబెట్టడానికే
సరిపోయింది.. అదేదీ నా వెంట తీసుకెళ్ళలేక పోతున్నాననీ, కేవలం సిరిసంపదల
వెంటబడి విలువైన సమయాన్ని, జీవితంలో మాధుర్యం కోల్పోవద్దని చెప్పడానికి”
“మూడవ కోరికలో నా ఆంతర్యం ఈ ప్రపంచంలోకి నేను వచ్చేటపుడు వట్టి చేతులతో
వచ్చాను. ఇప్పుడు వట్టి చేతులతోనే వెళ్ళిపోతున్నాను అని చెప్పడానికే ” అని
చెప్పి కన్ను మూశాడు.
అలెగ్జాండర్ రాజ్యకాంక్ష గల చక్రవర్తే కావచ్చు. కానీ ఆయన గురించిన ఈ
సంఘటనలో భారతీయ ఆత్మ ఉంది. ఆధ్యాత్మిక సారం ఉంది. అందుకనే ఈ సంఘటన అంటే
నాకు ఎంతో ఇష్టం..
Friday, March 7, 2014
భగవదనుగ్రహం
ఒక ఊరిలో పూజారి ఉండేవారు. అతను తప్పనిసరి పనిమీద ఊరు వెళ్ళవలసివచ్చింది.ఆ
ఊరిలో పూజ చేసేవాళ్ళు ఇంకెవరూ లేకపొవడంతో ఆ బాధ్యతని, పన్నెండేళ్ళ వయసున్న
తన కొడుకు ఉన్నికి అప్పచెప్పి వెళ్ళేరు. దేవుడికి నైవేద్యం పెట్టడానికి
అన్నం తీసుకుని ఉన్ని గుడికి వెళ్ళేడు.దేవుడు నిజంగా వచ్చి తింటాడు అనుకుని
ఎదురుచూస్తున్నాడు. విగ్రహం కదలకపోవడంతో అన్నం నచ్చలేదేమో అని బైటికి
వెళ్ళి మామిడి పళ్ళు , పెరుగు కొని
తెచ్చాడు.తినమని బ్రతిమాలాడు, బెదిరించాడు, ఎన్ని చేసినా దేవుడు కదలలేదు.
తండ్రి ఊరినుండి వచ్చాక దేవుడు అన్నం తినలేదని తెలిస్తే తనని కొడతాడని
భయపడి పెద్దగా ఏడవసాగేడు. అది చూసిన దేవుడి మనసు కరిగి నిజంగా నైవేద్యం
స్వీకరించాడు.గిన్నెలు ఖాళీ అవ్వడంతో దేవుడు తిన్నాడని ఉన్ని సంతోషంగా
ఇంటికి వెళ్ళేడు. ఊరినుండి వచ్చిన పూజారి గిన్నెలు ఖాళీగా ఉండడం చూసి
ఉన్నిని ప్రశ్నించాడు. దేవుడు అన్నం తిన్నాడని ఉన్ని సంతోషంగా చెప్పేడు.
పుజారి , ఉన్ని అబద్ధం చెప్తున్నాడని భావించి కోపంతో కొట్టబోయాడు. ఇంతలో ఒక
అశరీరవాణి ఈ విధంగా పలికింది ” ఉన్ని అమాయకుడు, నేను అన్నం తిన్నాను”. అది
విన్న అవి పూజారి దేవుడి మాటలు అని గ్రహించి సంతోషించాడు. ఉన్నిని
కాపాడడానికి స్వయంగా భగవంతుడే వచ్చాడు
.నీతి: ప్రేమ అనే బంధం భక్తులని భగవంతుడుతో కట్టి ఉంచుతుంది.భగవంతుడు భక్తుల ప్రేమకి వశపడి ఉంటాడు. భక్తులని రక్షించడానికి ఏమి చెయ్యడానికి అయినా సిద్ధపడతాడు.

కష్టకాలంలో కూడా.. "బ్రతికేయొచ్చు.."
60 సంవత్సరాల నిరుపేద వృద్దుడు. పెద్ద వయస్సులో కష్టపడలేక - జైలులో ఉన్న తన కొడుకుకు ఒక లేఖ వ్రాసాడు.
" నాన్నా..! నువ్వు నిరాధార కేసులో ఇరుక్కుని జైలులో ఉన్నావు. ఇక్కడ నా పరిస్దితి ఏం బాగోలేదు. ఒళ్ళు కూడా సహకరించడం లేదు. మన తోటలో కూరగాయలు సాగు చేద్దాం అంటే.. పొలం భూమి చాలా గట్టిగా ఉంది రా.! మనుష్యులని పెట్టి సాగు చేయిద్దాం అన్నా - చేతిలో అంత డబ్బు లేదు. నాకు సహాయంగా ఉండే నువ్వు కూడా జైలులో ఉండి పోయావు. నాకు సహాయం చేసే వారు లేరు. చాలా బాధల్లో ఉన్నాను. త్వరగా వస్తే బాగుంటుంది. " ఇది ఆ లేఖ సారాంశం.
ఆ లేఖను తన కొడుకుకి క్షమాబిక్ష ఇవ్వడం కోసం రాష్ట్రపతికి పంపాడు.. అలాగే కొడుకుకి కూడా..
కొద్దిరోజులకు ఆ వృద్ధుడు తన కొడుకు దగ్గర నుంచి లేఖ అందుకున్నాడు.. అందులో " నాన్నగారు మీరు ఆ పొలం తవ్వోద్దు.. ఎందుకంటే - నేను హత్యకేసులో ఇరుక్కున్న శవాలు ఆ భూమిలోనే ఉన్నాయి. నేను త్వరలోనే వచ్చేస్తా..! వచ్చాక ఆ పని చూస్తా.." అని ఉంది.
అది చదివిన ముసలాయనకి ఏమీ అర్దం కాలేదు.
పక్కరోజు ఇంటికి పోలీస్ వాళ్ళు వచ్చారు. ఇళ్ళంతా సోదాలు చేసి.. ఆ లేఖని చూసి - అనక ఆ పొలం అంతా తవ్వి తవ్వి అలసిపోయి, ఎటువంటి ఆధారం దొరకక పొయేసరికి, " వీ ఆర్ రియల్లీ సారీ.." అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోయారు.
అదే రోజు తన కొడుకు దగ్గర నుంచి ఇంకొక లేఖ అందుకున్నాడు ముసలాయన. అందులో " నాన్నా పొలంలో ఇప్పుడు - నువ్వు ఏం కావాలంటే అవి వేసుకో.. నేను లేని లోటు పోలీస్ వాళ్ళు తీర్చారు.. అరోగ్యం జాగ్రత్త నాన్నా.."
అలా మన పోలీస్ వాళ్ళ సహాయంతో ఆ పెద్దాయన హ్యపీగా పొలం పండించుకున్నాడు..
నీతి : విన్నవన్నీ నిజాలు కాదు.. చూసేవన్ని సత్యాలు కావు.. తెలివనేది బుర్రలోనే ఉంటే.. కష్టకాలంలో కూడా.. "బ్రతికేయొచ్చు.." "బ్రతికించొచ్చు.."
టేక్ కేర్.. ఫ్రెండ్స్..

దేవుడు
ఒక రోజు దేవుడు ఓ కుక్కని తయారు చేసాడు.
దేవుడు అన్నాడు: రోజంతా ఇంటి
ముందు కూర్చో. ఎవరైనా తెలియని వాళ్ళు వస్తే
అరువు. నేను నీకు 20 ఏళ్ళు ఆయుషుని
ఇస్తాను.
కుక్క: స్వామి ఇదేమి బాలేదు… నేను అన్ని
ఏళ్ళు అరవలెను. కాబట్టి ఇదుగో 10
ఏళ్ళు నీకు ఇచెస్తను. 10 ఏళ్ళు మాత్రమే
అరుస్తాను సరేనా !
దేవుడు: సరే..
ఆ తర్వాతి రోజు దేవుడు ఒక కోతి ని
తయారు చేసాడు.
దేవుడు: నీ కోతి చేష్టలు చేస్తూ జనాల్ని సంతోష
పరుచు. నీకు 20
ఏళ్ళు ఆయుషు ఇస్తున్నాను.
కోతి: ఏంటి కోతి చేష్టలు 20 ఏళ్ళ ! అమ్మో! కుక్క
తన 10 ఏళ్ళు నీకు ఇచ్చింది గా నేను అలాగే
ఇస్తాను.
దేవుడు: సరే…
మరుసటి రోజు దేవుడు మరల ఒక ఆవుని
తయారు చేసాడు.
దేవుడు: నువ్వు రైతుతో పాటు పొలానికి వెళ్లి
రోజంతా ఎండలో కస్టపడి
సాయత్రం పాలు ఇస్తూ రైతుకి సహాయం చేయి.
నీకు 60 ఏళ్ళు ఆయుషు ఇస్తునాను.
ఆవు: 60 ఏళ్ళు ఈ గొడ్డు చాకిరీ నేను చేయలేను.
నాకు కూడా 20 ఏళ్ళు ఇచి మిగతా 40
ఏళ్ళు నువ్వే తీసుకో…
దేవుడు: సరే…
తర్వాత రోజు దేవుడు మనిషి ని తయారు చేసాడు.
దేవుడు: తిను, తాగు , ఆడుకో, పెళ్లి చేసుకో, నీ
జీవితాన్ని ఆనందించు.. నేను నీఎకు 20
ఏళ్ళు ఆయుషు ని ఇస్తునాను.
మనిషి: ఏంటి? 20 ఏళ్లే నా? చూడు , నా 20
ఏళ్ళు తో పాటు ఆవు నీకు ఇచ్చిన 40, కోతి
మరియు కుక్కకి ఇచిన 10,10 మొత్తం 80 కావాలి…
దేవుడు: సరే…
అందుకే మొదట 20 ఏళ్ళు మనిషి తింటున్నాడు,
నిద్రపోతున్నాడు, ఆడుకుంటున్నాడు,
ఆనందిస్తున్నాడు.. తరవాత 40
ఏళ్ళు ఆవు చేస్తున్నాటు తన కుటుంభానికి
సహాయం చేయటానికి గొడ్డు చాకిరీ చేస్తున్నాడు ఆ
తర్వాత 10 ఏళ్ళు కోతి చేష్టలు చేస్తూ తన
మనవల్లు మనవరల్లని నవ్విస్తున్నాడు.. తరవాత
10 ఇంటి ముందు కూర్చొని వచ్చే పోయే వాళ్ళని
అరుస్తుంటాడు….!!

పాపాలు
ఒకసారి
ఒక వ్యాపారి దుకాణం తెరవగానే ఒక సాధువు వచ్చి ధర్మం అడిగాడు .. పోవయ్యా పో
అన్నాడు వ్యాపారి . మళ్ళి ఘంట తరువాత అదే సాధువు వచ్చి ధర్మం అడిగాడు .
మళ్ళి పోవయ్యా పో అన్నాడు వ్యాపారి ... ఇలా ఘంటకు ఒకసారి సాధువు వచ్చి
బిక్ష అడగటం వ్యాపారి పోవయ్యా పో అనడం రోజంతా జరిగింది .
వ్యాపారి దుకాణం మూసే టైం అయ్యింది . అప్పుడు కూడా చివరగా సాధువు బిక్ష అడిగేసరికి వ్యాపారి అన్నాడు నేను లేదు పోవయ్యా అని పొద్దున్నే చెప్పా .. నువ్వు అప్పుడే వెళ్లి పోయి మిగిలిన చోట్ల బిక్ష అడిగితె పోయేది కదా నీ జోలె నిండేది అన్నాడు .
అప్పుడు సాధువు నువ్వు బిక్ష ఇవ్వక పొతే పోనీలే కాని ఒక్క ప్రశ్న అడుగుతాను దానికి నీవు సమాధానం అయినా ఇవ్వు అన్నాడు .
? అని వ్యాపారి మొహం పెట్టాడు . సాధువు అన్నాడు నీవు ఏమీ తినకుండా ,కనీసం కాఫీ నీళ్ళు అయినా తాగకుండా పొద్దున్న నుంచి జనాలను మోసం చేసి వ్యాపారం చేస్తున్నావు ఇదంతా ఎవరి కోసం అన్నాడు ...
అప్పుడు వ్యాపారి నాకు భార్య పిల్లలు ఉన్నారు వారి కోసం అన్నాడు . మరి నీవు చేసిన పాపలలో వారు బాగం పంచుకుంటారా అని అన్నాడు .. అడిగి చెప్తాను అన్నాడు వ్యాపారి .
డిన్నర్ టైం లో వ్యాపారి భార్యా పిల్లలను అడిగాడు నేను మీ కొరకు సంపాదిస్తున్నాను కదా మరి నా పాపాలలో భాగం పంచుకుంటారా అని .
"నీవు తండ్రి కాబట్టి సంపాదిస్తున్నావు . అమ్మ వంట చేసి పెడుతుంది కాబట్టి తింటున్నాము ఇంత కంటే మాకు ఏమీ తెలవదు .. మేమైతే మంచోల్లమే..నీ పాపాలు మేము పంచుకోము" అన్నారు పిల్లలు .
"నీవు ఎలా సంపాదిస్తున్నావో నాకు తెలవదు . నీవు ఎంత సంపాదించినా కూడా ఉన్న దాంట్లో adjust చేయడం మాత్రం నాకు తెల్సు .నిన్ను పాపాలు చేయమని నేనెప్పుడు చెప్పలేదు . నేను మంచిదాన్నే . కాబట్టి నీ పాపాలు నేను పంచుకోను "అని చెప్పింది భార్య ..
ఇప్పుడు వ్యాపారి ఆలోచించే సరికి దేవుడి దృష్టిలో భార్య పిల్లలు మంచోల్లే ..కాని ఆకలి ఉన్న మనిషి దగ్గరికి వచ్చి బిక్ష అడిగితె వేయనందుకు , జనాలను మోసం చేసి సంపాదించిన సంపద వల్ల తాను పాపాత్ముడు అయ్యాడు . నీతి::: నీకు ఎన్ని భాద్యతలు ఉన్నా , అప్పులు ఉన్నా న్యాయాన్ని విడిచి పెట్టకు . ఇప్పుడు కాకపోయినా next జన్మలో అయినా కర్మ ఫలాన్ని అనుభవించాల్సిందే . పంచుకోడానికి ఎవరు ఉండరు . నీ భాగస్వామి నీవు జీవించి ఉన్నంత వరకు జీవితాన్ని పంచుకుంటుంది కాని పాపాలను కాదు

ఐకమత్యం
ఇద్దరు
అన్నదమ్ములు నలభైయేళ్ల పాటు కలిసి సంతోషముగా ఉండేవారు. ఇద్దరు ఎదురెదురు
పొలాల్లోనివసించేవారు. యంత్రాలు వాడుకోవడం, వ్యాపారానికి కావలసిన
వస్తువులు, అన్నీ కలిసి పంచుకునే వారు.
ఇంతలో చిన్న మాట తేడా వల్ల, ఇద్దరికి అభిప్రాయభేదాలు వచ్చాయి. కొన్ని రోజుల పాటు మౌనంగా ఉండేవారు. తరువాత ఆ మౌనం, కఠినమైన మాటలుగా మారింది. తరువాత ఇద్దరు పూర్తిగా మాట్లాడుకోలేదు.
ఒక రోజు జాన్ ఇంటి తలుపు ఎవరో తట్టేరు. తలుపు తెరవగానే, ఒక వడ్రంగి, తన పనిముట్టు సామాన్లతో నుంచుని ఉన్నాడు.'ఒక రోజు పని ఏమైన ఇప్పించ గలరా' అని వడ్రంగి అడిగేడు. నా దగ్గర ఒక పని ఉంది అని జాన్ చెప్పాడు
.
ఎదురుగా ఉండేది, నా తమ్ముడే. కొద్దిరోజులుగా, మేము మాట్లాడుకోవడం లేదు.కొన్ని రోజుల క్రితం పొలం దున్నడానికి, యంత్రం తీసుకుని వెళ్లాడు. అప్పటి నుంచి మాకు గొడవ అయింది. అందుకని నేను ఏమైనా చేసి వాడికి గుణపాఠం చెప్పాలి. అక్కడ ఉన్నసామాన్లతో ఒక ఎనిమిది అడుగుల గోడ, రెండు పొలాలకి మధ్య కట్టమని అడిగేడు. అలాకట్టటం వల్ల, రేపటి నుంచి వాడి మొహం చూడక్కర్లేధు, అని చెప్పాడు. వడ్రంగికి కావలిసిన సామాన్లు ఇచ్చి జాన్ పనిమీద, పట్టణం వెళ్లాడు.
వడ్రంగి రోజు అంతా కష్టపడి పని చేశాడు. సాయంకాలం జాన్ రాగానే, పని అయిపోయిందని చెప్పాడు.
ఆశ్చర్యంగా చూసాడు జాన్. గోడ లేదు, కానీ ఒక వంతెన ఉంది. ఆ వంతెన రెండు పొలాలకి మధ్య కట్టేడు వడ్రంగి. చూడడానికి అధ్భుతంగా ఉంది.
వంతెనకి అటువైపు నుంచి చూస్తే, తమ్ముడు, చేతులు చాచి అన్న దగ్గరికి వస్తున్నాడు. ఇద్దరు అన్నదమ్ములు వంతెన మధ్యలో నుంచుని, చేతులు పట్టుకున్నారు. వడ్రంగి తన సామాన్లు పట్టుకుని వెళ్ళి పోతున్నపుడు, అతన్ని ఆపి, మాకు ఇంకా చాలా పనులు, చేసి పెట్టాలి అని అన్నారు. దానికి వడ్రంగి ,నాకు ఉండడం ఇష్టమే, కానీ ఇంకా చాలా వంతెనలు కట్టాలి అని అన్నాడు.
నీతి: మనుషులతో సంబంధాలు తెంచుకోవడం సులభం, కాని తిరిగి నిలబెట్టుకోవడం చాలా కష్టం.ఏ ఇద్దరి మధ్య అయినా అభిప్రాయభేదాలు రావడం సహజం,వాటిని పక్కనపెట్టి, అనుబంధం నిలుపుకునే ప్రయత్నం ఇద్దరూ చెయ్యాలి.అహంకారం , ద్వేషం అడ్డుగోడలుగా ఉన్నప్పుడు ప్రేమతో వాటిని దాటే ప్రయత్నం చెయ్యాలి.
ఎంత ఆడంబరంగా జీవించాము అన్నదానికన్న, ఎంతమందికి సహాయపడ్డాము అన్నది ముఖ్యం. మనకి ఎంతోమంది స్నేహితులు ఉండచ్చు, అందులో ఎంతమంది మనని నిజమైన స్నేహితులుగా భావిస్తున్నారో తెలుసుకోవాలి.అందం, డబ్బు, ఆడంబరాలు మొదలైనవాటివల్ల మనిషికి గుర్తింపు రాదు, అహకారం వస్తుంది, అది మన వ్యక్తిత్వాన్ని పాడుచేస్తుంది.
ఒక మనిషిగా ఎప్పటికీ గుర్తింపు పొందాలి అన్నా, సమజానికి ఉపయోగపడాలి అన్నా అది ఉన్నతమైన వ్యక్తిత్వం వల్ల మాత్రమే సాధ్యమౌతుంది.

Thursday, March 6, 2014
కర్తవ్యమే భవిష్యత్ సూచిక ....!?
రోడ్డుపై వెళ్తున్న ఓ బాటసారి హఠాత్తుగా సొమ్మసిల్లి పడిపోయి అపస్మారక స్థితిలో అలాగే కూలబడ్డాడు. అయితే ఆ దారిలో వెళ్తున్న ఏ ఒక్కరు కూడా అతన్ని సమీపించేందుకు ప్రయత్నించలేదు. తమ పనులు తాము చూసుకోసాగారు. అందులో కొంతమందేమో బాగా తాగి పడిపోయాడని భావించారు.
అయితే చివరగా అటువైపే వెళ్తున్న ఓ సాధారణ వ్యక్తి అతగాడి పరిస్థితికి జాలిపడ్డాడు. అతడిని సమీపించి అతని నాడిని పరీక్షించి ముఖం మీద నీళ్లు చల్లి, ఓ గుక్కెడు నీళ్లు తాగించాడు. కాసేపటికి సొమ్మసిల్లి పడిపోయిన బాటసారికి తెలివొచ్చింది. వెంటనే తనను కాపాడిన వ్యక్తికి పదేపదే ధన్యవాదాలు తెలుపుకున్నాడు.
సరైన సమయంలో ఆదుకున్నందుకు గాను తగినంత బహుమతి కోరాల్సిందిగా సూచించాడు బాటసారి. నేను మీకు ఏమి చేయాలో దయచేసి చెప్పాల్సిందిగా తనకు సాయం చేసిన వ్యక్తిని మళ్లీ అడిగాడు. దానికా వ్యక్తి నేను డబ్బు కోసమో లేదా ఏ స్వలాభం కోసమో మీకు సాయం చేయలేదని సావధానంగా సమాధానమిచ్చాడు. ఎలాంటి ఫలితాన్ని ఆశించకుండా ఈ పని చేశానని వివరించాడు.
కానీ బాటసారి మాత్రం వదలలేదు. ప్రతిఫలంగా ఏదో తీసుకోందే తన మనసు తృప్తి చెందదని విజ్ఞప్తి చేశాడు. దీంతో ఆ వ్యక్తి ఇలా అన్నాడు. "ప్రకృతిని ఓ సారి చూడండి, అద్భుతమైన వృక్షాలు, అందమైన పక్షులు, పచ్చటి ఆకులు, నీలిరంగులోని ఆకాశాన్ని చూడండి. అవి ఎంతో ఆనందాన్ని, ఆహ్లాదాన్ని, సంతృప్తినిస్తాయి. కానీ ప్రతిఫలంగా అవి ఏమీ తీసుకోవు. నిజంగా మీరు నాకు ప్రతిఫలం ఇవ్వదలుచుకుంటే... ఇదే విధమైన సేవను మరొకరికి అవసరమైనప్పుడు చేయాల"ని బాటసారికి సూచించాడు. మీరు నాకిచ్చే ప్రతిఫలం అదే అని తెలిపాడు.
ఆ మాటలకు విస్తుపోయి చూసిన ఆ బాటసారి కనీసం పేరైనా చెప్పాలని ఆ వ్యక్తిని కోరాడు. "సేవకులకు భగవద్గీతలో ఎలాంటి పేరు లేదు. నేనెవరు.. నా పేరేంటి అన్నది ఇక్కడ విషయం కాదు. మీకు సాయం చేసే ఒక గొప్ప అవకాశం నాకు దక్కింది అది చాలు" అని ఆ బాటసారికి చెప్పి తన దారిన తాను వెళ్లిపోయాడు.
భగవద్గీతలోని కర్మయోగంలో ఈ అంశాన్ని పార్థుడికి శ్రీకృష్ణుడు బోధించడం తెలిసిందే కదా. దీని అర్ధం... ఎలాంటి సంబంధాలు లేకున్నా... ప్రతిఫలాన్ని ఆశించకుండా మన కర్తవ్యాలను స్వచ్ఛందంగా నిర్వర్తించాలి. ప్రతి వ్యక్తి తన కర్తవ్యాన్ని సక్రమంగా నిర్వర్తించినట్లయితే.. వారి వారి వ్యక్తిగత భవిష్యత్తుకు ఎలాంటి ప్రమాదం వాటిల్లకుండా నియంత్రించవచ్చు. కనుక కర్తవ్యమే భవిష్యత్ సూచిక.
Subscribe to:
Posts (Atom)